
ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కె.రోశయ్య నగరానికి రానుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులు, నేతలతో సమీక్షించారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక విఆర్. హైస్కూల్ మైదానానికి వెళ్లి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్ భానుశ్రీ, జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్, ఎస్పి ఇ.దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
1 comment:
best of luck to nelloreans to get their long pending demands cleared
Post a Comment