నేడు నెల్లూరు

Tuesday, March 29, 2011

Aanam Viveka in Assembly Controversy - Discussion

Monday, March 14, 2011

మేకపాటి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆనం వివేకానందరెడ్డిపై ఆగ్రహించారు

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై , జగన్ వెంట తిరుగుతున్న ప్రజాప్రతి నిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి నైతికతను నిరూపించు కోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన విమర్శలపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజక వర్గ పీఆర్పీ మాజీ నేత ఆనం వెంకటమణారెడ్డి నిప్పులు చెరిగారు. యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి, మరలా మాట మార్చిన మీరా..విలువల గురించి మాట్లాడేది? రోశయ్యతో పని చేయలేమని చెప్పి, చివరకు ఆయన తిన్న ప్లేట్లను సైతం ఎత్తి వేసి ప్లేటు ఫిరాయించిన మీరా నైతికత గురించి మాట్లాడేది? రాజకీయాలను అడ్డుపెట్టుకుని వందల కోట్లకు పడగలెత్తిన మీరా నీతి గురించి మాట్లాడేది? ’’అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం నెల్లూరులో ‘మేకపాటి’ అతిథిగృహంలో వారు విలేకరులతో మాట్లాడారు.

ధర్మం వైపే నిలిచాం..ప్రజల కోరిక కూడా అదే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు తెలుస న్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అవిరళ కృషి కారణంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలకు పదవులు అనుభవిస్తున్నారంటే అది వైఎస్సార్ పెట్టిన భిక్షేనన్నారు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ వెంట నడవటమే ధర్మం..న్యాయం.. జనం కూడా అదే కోరుకుంటున్నారన్నారు. ఆ ధర్మాన్ని తాము పాటించబట్టే మంచి గుర్తింపు లభించిందని, రాష్ర్టంలో ఎక్కడ కెళ్లినా ప్రజల తమను ఆదరిస్తున్నారన్నారు.

గత ఎన్నికల్లో మీ అన్నదమ్ములకు, తమకు వైఎస్సారే టికెట్లు ఇచ్చారని, ఆయన పెట్టిన భిక్ష వల్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వంటి పదవులు వచ్చాయన్నారు. వాటిని విస్మరించి మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. నాలుగుసార్లు గెలిచానని చెప్పుకుంటున్న ఆనం ఏ విధంగా గెలిచిందీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సరైన ప్రత్యర్థి లేక పోవడం, టీడీపీ, కమ్యూనిష్టుల పొత్తు కారణంగా బలహీనమైన అభ్యర్థులైపై పోటీ చేసి గెలిచారన్నారు.

‘‘తారుడబ్బాలతో కోటీశ్వరులయ్యారంటూ మాట్లాడుతున్నావు, తారు డబ్బా విలువ నీకేం తెలుసు? అవును మేం తారుడబ్బా లతోనే సంపాదించాం. 30 ఏళ్లు కష్టపడి తామీ స్థాయికి వచ్చాం. తారు లేకుండా, సిమెంటు లేకుండా పని ఎలా అవుతుంది? కనీసం ఈ కామన్‌సెన్స్ కూడా లేకుండా మాట్లాడితే ఎలా? వ్యాపారాలు చేసుకోవడం తప్పా? రాజకీయాల్లోకి వచ్చి వందల కోట్లకు పడగ లెత్తిన మీకు శ్రమ విలువేం తెలుసు’ అని దుయ్యబట్టారు. నెల్లూరులో మీ అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు తెలియదనుకుంటు న్నారా? మీరు అనుభవిస్తున్న భోగభాగ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అని విమర్శించారు.

సాంకేతికంగా మాట్లాటం కాదు..రెఫరెండానికి సిద్ధమా?
జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. నీతి నియమాలు గురించి మాట్లాడే వారు ఎవరి వల్ల లబ్ధి పొంది ఉంటే వారి వెంట ప్రయాణించాలి. అదే చేస్తున్నాం. మీరు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. వెఎస్సార్ పుణ్యాన కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయని విస్మరించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. నిజానికి పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు యువనేత జగన్ వెంట నడిచినపుడే నీతి, నైతికత ఉన్నట్లవుతుందన్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యామని సాంకేతికంగా మాట్లాడటం కాదు..ధై ర్యముంటే జిల్లాలో రెఫరెండానికి వెళదాం సిద్ధంకండి. మీరు కాంగ్రెస్ తరుఫున, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేద్దాం అని సవాల్ విసిరారు.

తనకు జెడ్పీ చైర్మన్ పదవి రావడానికి వైఎస్సారే కారణమన్నారు. జిల్లాలో 46 మంది జెడ్పీటీసీ అభ్యర్థులను వైఎస్సార్ ఎంపిక చేశారన్నారు. ఆయన ఆశీస్సులతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా సహకరించడం వల్లే జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యానన్నారు. కానీ, తాను జెడ్పీ చైర్మన్ కావడానికి వేరొకరు అవకాశం ఇచ్చారనుకుంటే అది వారి పొరపాటవుతుదన్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని, తాము సంపాదించిన దాంట్లో కొంత రాజకీయాలకు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. సంపాదించడానికే రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా ఎమ్మెల్యే ఆనంకు చురకలంటించారు. నియంతృత్వంతో వ్యవహరించే నేతలు రాజకీయాల గురించి మాట్లాడితే ఫర్వాలేదు కానీ, నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం తగదన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు స్వతంత్ర అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికే మద్దతుగా నిలవడం ఖాయమన్నారు. పెట్టని పార్టీకి, పుట్టని పార్టీకి అభ్యర్థి ఏమిటని కొందరు విమర్శలు చేశారు..ఇవాళ పార్టీ పుట్టింది.. జెండాపుట్టింది..ఒక్కో ప్రశ్నకూ సమాధానం వస్తోంది. అసంబద్ధంగా, అడ్డుగోలుగా మాట్లాడేవారు రాబోయే రోజుల్లో ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారన్నారు.

నైతికతకు అర్ధం తెలుసా?... తేల్చుకుందాం..రా!
నెల్లూరు రూరల్ నియోజక వర్గ పీఆర్పీ మాజీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మాట్లడుతూ మేకపాటి, కాకాణి వంటి నేతలను గురించి మాట్లాడే అర్హత నీకులేదన్నారు. వారి రాజీనామాలు కోరడం కాదు.. దమ్ముంటే నువ్వు రాజీనామా చెయ్యి.. నువ్వూ నేనూ తేల్చుకుందాం.. 10 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తా. ఒక్క ఓటు తక్కువ వచ్చినా, మళ్లీ రాజీనామా చేసి నిన్నే గెలిపిస్తా’’అని పేర్కొన్నారు. వివేకా...విలువల గురించి మాట్లాడుతున్నావు. చెట్టుకింద కూర్చొని రాజకీయాలు తెలియని రోజుల్లో మా తండ్రి భక్తవత్సలరెడ్డి చేరదీస్తే ఆయనకు మీరేం చేశారు? రాజకీయంగా సాయపడమనడంలేదు..పెద్దాయనకు కనీస మర్యాదన్నా ఇచ్చారా? నమ్మి చేర దీసిన వారిని, నమ్మి వెంట వచ్చిన వారిని మోసం చేసే చరిత్ర మీదని దుయ్యబట్టారు.

నెల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. కేఎస్‌రెడ్డి,యశోధర, అనిల్ కుమార్‌ల ఓటమి వెనుక మీ హస్తం ఉందని ప్రజలందరికీతెలుసన్నారు.‘చివరకు మున్సిపల్ ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని సాయంతీసుకుని ఆయనను మోసం చేశావు. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉంటే పని చేయలేమన్నావు. మళ్లీ ఆయన తిన్న పేట్లనే తీశావు.’’అని విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడుతావో తెలియదు.. నెల్లూరు కేసీఆర్‌లా తయారయ్యామని విమర్శించారు.

‘‘కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చిన మేకపాటి సోదరుల గురించి మాట్లాడుతున్నావు. మీకుండేది చింతారెడ్డిపాళెం దగ్గర ఏడు ఎకరాలు. ఆ భూమిని విక్రయించినా.. మీ దగ్గరుండే కార్ల విలువ చేయదు. ఎమ్మెల్యే వేతనంతో నీతిగా బతుకుతున్నావా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఒక్క భానుశ్రీకి తప్ప ఎవరికైనా చేశావా అని విమర్శించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విమర్శించడం ఏమిటీ? అయినా మగాళ్లు మాత్రమే సవాళ్లు చేసుకుంటారు. ఆ ఆర్హత నీకు లేదన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు బలిపశువో తేలే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పనులు,బిల్లులు ఎరగా వేసినా, డబ్బులు వెదజల్లినా, శిబిరాలకు తరలిచినా ప్రజా ప్రతినిధుల హృదయాలను చూరగొనలేరన్నారు. మీకు బలం ఉంటే శిబిరాలు ఎందుకు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ సమా వేశంలో నాయకుడు కేవీ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

నేటి నుంచి రంగనాథ స్వామి తిరునాళ్ళు ప్ర్రారంభం

నెల్లూరు ZP Chairman కాకాని ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రేస్ పార్టీ

Jagan camp fire on Anam Vivekananda reddy