నేడు నెల్లూరు

Wednesday, March 31, 2010

నా తమ్ముడికి నాపై కక్ష : నేదరుమల్లి సోదరుడు పద్మనాభరెడ్డి


గూడూరు నుంచి పోటీ చేసిన పనబాక కృష్ణయ్యకు మద్దతు తెలిపినందుకు తన తమ్ముడు తనపై కక్షగట్టాడని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి ఆరోపించారు. తాను అభివృద్ధి చేసిన ఎన్‌బీకేఆర్ విద్యా సంస్థలపై ఆయన కుమారుడు రాంకుమార్‌రెడ్డి, మరి కొంత మందితో దాడులు చేయించారన్నారు.

తనకు న్యాయం జరగని పక్షంలో ఉరేసుకుని చస్తానని హెచ్చరించారు. పనబాక కృష్ణయ్యతో కలిసి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. తనకేదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని పద్మనాభరెడ్డి హెచ్చరించారు. తాను ఎత్తుకుని మోసిన తమ్ముడే ఇలా చేయడం బాధగా ఉందన్నారు.


తనకు న్యాయం జరగని పక్షంలో తన ఆస్తిని, విద్యా సంస్థలను, తన శవాన్ని ఆయననే తీసుకుపొమ్మనాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను లేని సమయంలో సిబ్బందిని బెదిరించి తన కార్యాలయంలోని చెక్‌బుక్‌లు, ఎఫ్‌డీలు తీసుకుపోయి కొంత నగదు కూడా డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గూడూరు నుంచి కృష్ణయ్యను ఓడించి టీడీపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఆయన తనను కోరారని వెల్లడించారు.


1992 నుంచి ఏఐసీసీ సభ్యునిగా ఉన్న తాను కాంగ్రెస్‌కు ద్రోహం చేయలేనన్నానన్నారు. జనార్దనరెడ్డి వ్యతిరేక కార్యకలాపాల వల్ల గూడురుతోపాటు సూళ్లూరుపేట, వెంకటగిరి స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని ఆరోపించారు. జరిగిన సంగతులు సోనియాగాంధీకి కూడా వివరిస్తానని అన్నారు. జనార్దనరెడ్డిని బహిష్కరిస్తేనేగాని నెల్లూరులో పార్టీ బాగుపడదని పనబాక కృష్ణయ్య అన్నారు.

నెల్లూరు లో B.S.N.L 3G సేవలు ప్రారంభం

పెరిగిన ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా టెలిఫోన్ రంగంలో బిఎస్‌ఎన్‌ఎల్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక స్వర్ణవేదిక కళ్యాణమండపంలో బిఎస్‌ఎన్‌ఎల్ త్రీజి సేవలను మంగళవారం నెల్లూరు ఎంపి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. దేశంలో 112 కోట్ల జనాభా ఉన్నారన్నారు. వారిలో 56కోట్ల మంది టెలిఫోన్‌ను వినియోగించుకుంటున్నారని, త్వరలోప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అందుబాటులోకి రాబోతుందన్నారు. శాంపిట్రోడా కమిటీ సిఫార్సులు టెలిఫోన్ రంగానికి ఊతమిస్తాయన్నారు. గతంలోల్యాండ్‌లైన్ దొరికాలంటే చాలా కష్టంగా ఉండేదని, ఫోన్ మాట్లాడలాంటే పోస్ట్ఫాసు వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి ఉండేదన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందుతున్నారు. గతంలో దేశంలో 70శాతం వరకు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారయ్యాయని, ప్రస్తుతం అవి 40శాతం తగ్గినట్లు తెలిపారు. త్వరలో 100శాతం వరకు చేరుకుంటుందన్నారు. రాబోయే రోజులలో అన్ని పరికరాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతాయన్నారు. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడి ముందుకు పోతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ పిఎసి నెంబర్లు, నెల్లూరు బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ఎంపిని సన్మానించారు. నెల్లూరు టెలికం జనరల్ మేనేజర్ గోపి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలకొండారెడ్డి, తిరుపతి డిజిఎం విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సినీ పరిశ్రమతో ఆడుకుంటున్న ఐపిఎల్‌ - సినీ నటుడు శివాజి

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా పడుతుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ యావత్తు మూతపడే ప్రమాదమున్నట్లు సినీ హీరో, తాజ్‌మహల్‌ సినిమాతో నిర్మాతగా మారిన శివాజి పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ విజయయాత్ర సందర్భంగా చిత్ర యూనిట్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం నెల్లూరు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సినీ పరిశ్రమపై లక్షలాదిమంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాలతో ఐపిఎల్‌ నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొద్దిరోజులు మాత్రమే నిర్వహిస్తుండే ఈ ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం 40 రోజుల వరకు కొనసాగుతుందని, దీనిని అడ్డుకునేందుకు సినీ ప్రముఖులు, నిర్మాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభావం ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై కూడా పడుతుందన్నారు. ఐపిఎల్‌ నిర్వాహకులు లలిత్‌మోడీ అంతా తానై ఈ మ్యాచ్‌లను నిర్వ హించడాన్ని ఆయన ఖండించారు.

Tuesday, March 30, 2010

ఐపిఎల్ క్రెకెట్ మ్యాచ్‌లపై నెల్లూరులో రోడ్‌షోకు విశేష స్పందన

మహిళల్లో క్రికెట్‌పట్ల ప్రత్యేకించి ఐపిఎల్ మ్యాచ్‌లపట్ల అవగాహన పెంచేందుకు ఈమ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీమాక్స్ చానెల్ చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి నగరంలో మంచి స్పందన లభించింది. రాష్ట్రానికి చెందిన డక్కన్‌చార్టర్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్నలతో కూడిన కూపన్లను సోనీమాక్స్ చానెల్ ప్రతినిధులు సోమవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈప్రశ్నలకు సరైన సమాధానం రాసి పంపిన వారిలో విజేతలను ఎంపికచేసి వారి ఇళ్లకు ప్రముఖ టివి యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ అతిధులుగా విచ్చేసి బహుమతులు అందచేయనున్నారు. నగరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జేమ్స్ గార్జెన్, బాలాజీనగర్, ట్రంకురోడ్డు, బృందావనం, వెంకటరామాపురం, స్టోన్‌హౌస్‌పేట, సంతపేట, మూలపేట, పప్పులవీధి, ఉస్మాన్‌సాహెబ్‌పేట, చిన్నబజారు, పెద్దబజారు, రాయాజీవీథి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు నుండి ప్రారంభమైన ప్రచార రథం తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, శింగరాయకొండ, కావలి మీదుగా నెల్లూరు చేరుకుంది. నెల్లూరు నుండి గూడూరు, నాయుడుపేట మీదుగా తిరుపతికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో సోనీమాక్స్ ప్రతినిధి కె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రథంతో బయల్దేరిన మరో రథం గుడివాడ, ఏలూరు, తణుకు, రాజమండ్రి, కాకినాడ, తుని, అనకాపల్లి, గాజువాక మీదుగా ఏప్రిల్ 1వ తేదీనాటికి విశాఖపట్నం చేరుకుంటుందని శివప్రసాద్ తెలిపారు.

Monday, March 29, 2010

నెల్లూరు నగర మేయర్ భానుశ్రీ కనిపించడం లేదు

నెల్లూరు నగర మేయర్ నందిమండలం భానుశ్రీ గత 20 రోజులుగా కనిపించడం లేదని స్థానిక తెలుగుదేశం నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై మేయర్ భర్తను ఎసిబి అధికారులు అరెస్టు చేసినప్పటి నుండి ఆమె కనీసం కార్పొరేషన్ అధికాలకైనా చెప్పకుండా అదృశ్యమయ్యారని నెల్లూరు నాలుగవ నగర పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేషన్ కమిషనర్‌తో సహా అధికారులంతా ఆమె ఆచూకీ తమకు తెలియదని చెబుతున్నారని ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలారి వెంకట స్వామి నాయుడు చెప్పారు. ఎసిబి కేసు నుండి తన భర్తను కాపాడుకోవడానికి ఆమె ప్రయత్నం చేసుకోవడంలో తప్పులేదని అయితే కనీసం పాలనా బాధ్యతలను డిప్యూటీ మేయర్‌కు అప్పగించి వెళ్లకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్నారు. మేయర్ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయారన్నారు. దీనితో పలాయనవాదం పాటించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకుని దిక్కులేకుండా పోయిన కార్పొరేషన్‌ను ఆదుకోవాలని కోరారు

రేపు నెల్లూరు లో 3జి సేవలు ప్రారంభం

టెలిఫోన్‌ రంగంలో 3జి సేవలను ఈ నెల 30న (మంగళవారం) నెల్లూరు నగరంలో ప్రారంభించనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ గోపీ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3జి సేవలను ముందుగా నెల్లూరు నగరానికి మాత్రమే పరిచయం చేస్తున్నామని చెప్పారు. 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు స్థానిక స్వర్ణ వేదిక కల్యాణ మండపంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌లకన్నా ముందుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ 3జి సేవలను ప్రారంభిస్తుందని చెప్పేందుకు తమకు గర్వంగా ఉందన్నారు. 3జి సేవలలో భాగంగా వీడియోకాల్‌ సౌకర్యం, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌, మ్యూజిక్‌, ఆల్బమ్స్‌ క్షణాల్లో డౌన్‌లోడింగ్‌ చేసుకునే సౌకర్యాలు వినియోగదారులకు అందుతాయన్నారు. అంతేకాకుండా మొబైల్‌ ఫోన్‌లలో 50కి పైగా టివి చానల్స్‌ను నేరుగా చూసుకోవచ్చన్నారు.

జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లను విక్రయించే ఫ్రాంఛైస్‌లు ప్రస్తుతం నెల్లూరు, గూడూరు, కావలి పట్టణాల్లో మాత్రమే ఉండగా ఇకపై తొమ్మిది చోట్ల ఈ సౌకర్యాలను విస్తరిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, సోమవారం తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ల్యాండ్‌ లైన్‌ లేకుండానే ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తున్నామని, అయితే ఈ అవకాశం కేవలం పది రోజుల వరకు మాత్రమే ఉంటుందన్నారు. పది రోజుల తర్వాత ఇంటర్‌నెట్‌ కావాల్సినవారు తప్పనిసరిగా ల్యాండ్‌ లైన్‌ను తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో డిజిఎం పెంచలరెడ్డి, మార్కెటింగ్‌ డిఇ మార్కొండారెడ్డిలు పాల్గొన్నారు.

Sunday, March 28, 2010

కలెక్టర్‌ బదిలీకి రంగం సిద్ధం

జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ను బదిలీ చేయడానికి జిల్లాకు చెందిన ఒక రాజకీయ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లాలో వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతున్నప్పటికీ ఆధిపత్యపోరులో భాగంగా కలెక్టర్‌ను బదిలీ చేసి తమకు అనుకూలంగా ఉండే మరో అధికారిని ఇక్కడకు తీసుకురావాలని ఒక వర్గం యోచిస్తోంది. మరోపక్క రాంగోపాల్‌ జిల్లాకు వచ్చి రెండేళ్లు కావడంతో బదిలీకి అనుకూలత ఏర్పడినట్టు తెలిసింది.

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఆనం వర్గం పట్టు కొనసాగింది. అధికారుల నియామకం నుంచి పార్టీ పదవుల ఎంపిక వరకూ వారి కనుసన్నలలోనే జరిగాయి. అయితే వైఎస్‌ మరణం తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి వర్గం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు సర్వేపల్లి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు నేదురుమల్లి వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్పీగా ఉన్న మల్లారెడ్డిని బదిలీ చేసే విషయంలో కూడా నేదురుమల్లి వర్గం మాట చెల్లుబాటైంది. జిల్లాలో శాంతిభద్రతల పరంగా అత్యంత కీలకమైన ఎస్పీ బదిలీ విషయంలో జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి రాకపోవడం చర్చనీయంగా మారింది. ప్రస్తుతం కూడా రాంగోపాల్‌ బదిలీ విషయంలో నేదురుమల్లి వర్గం పట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో ఉన్న ఐఎఎస్‌ అధికారికి పదోన్నతి కల్పించి నెల్లూరుకు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ జిల్లాకు వచ్చినప్పటి నుంచి వివాదరహితుడిగా కొనసాగారు. వైఎస్‌ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వచ్చినప్పుడు పలు సందర్భాల్లో రాంగోపాల్‌ పనితీరును ప్రశంసించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ఇందిరమ్మ గృహాల్లో లోపాలు సరిదిద్దడంతో కలెక్టర్‌ రాంగోపాల్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

Saturday, March 27, 2010

గునపాటి వెంకట కృష్ణ రెడ్డి ఇందుకూరుపేట లో పేదలకు సహాయం

నెల్లూరు లో మైపాడు గేటు వద్ద పైరసీ CD పట్టివేత

నేదురుమల్లి కుటుంబాల్లో విభేదాలు

రాజ్యసభ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరులు ఎఐసిసి సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు గుప్పుమంటు చివరకు వీధిన పడే స్థాయికి దిగజారాయి. దివంగత పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి స్థాపించిన విద్యా సంస్థల ద్వారానే నేదురుమల్లి సోదరులు జనార్దన్‌రెడ్డి, పద్మనాభరెడ్డిలు రాజకీయంగా ఆర్ధికంగా బలపడ్డారు. వీరిద్దరికి బాలకృష్ణారెడ్డి స్వయానా పినతండ్రి అవుతారు. బాలకృష్ణారెడ్డి మరణానంతరం విద్యాసంస్థలను నేదురుమల్లి పద్మనాభరెడ్డి నిర్వహిస్తూ వచ్చారు. జనార్దన్‌రెడ్డి మాత్రం రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. ఆ క్రమంలోనే ఇంజనీరింగ్‌ కళాశాలను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి తెచ్చారు.

విద్యాసంస్థలను మాత్రం నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబీకులే నడుపుతూ ఆర్ధికంగా బలపడుతూ వచ్చారు. రెండుమూడు సంవత్సరాల క్రితం దివంగత బాలకృష్ణారెడ్డి కుమారుడు నేదురుమల్లి హిమకుమార్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు విద్యా సంస్థల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలంటూ పలుమార్లు నేదురుమల్లి పద్మనాభరెడ్డిపై ప్రత్యక్షంగానే వీధికెక్కారు. అయినా వీరి ప్రయత్నాలు నెరవేరలేదు. పెద్దాయన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జోక్యంతో బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సర్దుకుపోతూ వచ్చారు. ఇటీవలి కాలంలో పద్మనాభరెడ్డి కుమారుడు భానుశేఖర్‌రెడ్డి కరెస్పాండెంట్‌గా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉద్యోగ సంఘాల నాయకులు యాజమాన్యానికి వివాదం మొదలైంది. ఈ విషయంలోను కళాశాలకు ఉన్న గౌరవం వీధికెక్కింది.

చివరకు సద్దుమణిగింది. కొంత కాలానికి ఉన్నట్లుండి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి గురువారం కళాశాలకు వెళ్లి హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘం తనను కళాశాల కరెస్పాండెంట్‌గా నియమించిందని ప్రకటించుకుని రికార్డు, చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శుక్రవారం ఎఐసిసి సభ్యులు డాక్టర్‌ నేదురుమల్లి పద్మనాభరెడ్డి తాను హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘానికి చైర్మన్‌ నని తనకు తెలియకుండానే కళాశాలోకి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పట్రా ప్రకాశరావు తదితరులు అక్రమంగా ప్రవేశించారంటూ కోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ప్రాంతంలో కల కలం రేపింది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. పద్మనాభరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి అయిన గూడూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పనబాక కృష్ణయ్యకు మద్దతుగా ప్రచారం చేయడం వలనే రెండు కుటుంబాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో చేరుకుంటున్నాయన్నారు.

దీనికి తోడు గత కొన్ని సంవత్సరాల నుంచే రెండు కుటుంబాల మధ్య విభేదాలు నడుస్తుండడం వల్లే పెదనాన్నకు సామాచారం లేకుండానే రామ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు కరెస్పాండెంట్‌ బాధ్యతలు చేపట్టడం దీనిపై నేదురుమల్లి పద్మనాభరెడ్డి ప్రతిగా పోలీస్‌ స్టేషన్‌కు ఎక్కడం బట్టి విభేదాలు ఉన్నాయో అర్ధమవుతోంది. కోట పోలీస్టేషన్‌కు వచ్చిన డాక్టర్‌ నేదురుమల్లి పద్మనాభరెడ్డిని విలేఖరులు కలిసి ప్రశ్నించినా దీనిపై స్పందించకుండా వెళ్లిపోయారు. కాని మనసులో మాత్రం బాధ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 30,40 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన విద్యా సంస్థలను అక్రమంగా లాక్కుంటున్నారన్న బాధ ఆయనలో కనబడింది.

నెల్లూరు తెలుగుదేశం లో గొడవ


పెన్నా నదిలో జలకాలాట


నేదురుమల్లి తనయుడు పై పోలీసు పిర్యాదు

Friday, March 26, 2010

మేయర్ భానుశ్రీ భర్తకు బెయిలు మంజూరు

నెల్లూరు, మార్చి 25: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి అధికారులు నమోదు చేసిన కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న కార్పొరేషన్ మేయర్ నందిమండలం భానుశ్రీ భర్త ట్రాన్స్‌కో డిఇ శివ సుబ్బరాజుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరయింది. దీనితో గురువారం ఆయన హైదరాబాద్ చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి అధికారులు రెండు వారాల క్రితం ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుండి ఆయన బెయిల్ కోసం ప్రయత్నం జరుగుతోంది. తన భర్తకు బెయిల్ సాధించడం కోసం మేయర్ హైదరాబాద్‌లో మకాం వేశారు. మేయర్ భర్త కావడంతో సుబ్బరాజు బెయిల్ కోసం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. తన భర్త సుబ్బరాజుకు బెయిల్ కోసం మేయర్ భానుశ్రీ హైదరాబాద్‌లో మకాం వేయడంతో కార్పొరేషన్‌లో ఆమె ప్రమేయంతో జరగాల్సిన పనులు స్తంభించిపోయాయి.

N.B.K.R విద్య సంస్థల సారధి నేదురమల్లి తనయుడు

Sunday, March 21, 2010

జమీన్ రైతు లో భానుశ్రీ Page No.1


జమీన్ రైతు లో భానుశ్రీ పేజి No.2




నెల్లూరు టౌన్ హాల్ కు 96 సంవత్సరాలు

ఆదాల, కాకాణిలపై ఆనం వర్గ కార్పొరేటర్ల ధ్వజం

సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డిలపై ఆనం వర్గానికి చెందిన కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ఏసి సెంటర్‌లోని నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్‌ కార్పొరేటర్లు సందానీబాష, చాట్ల నరసింహారావు, మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షు రాలు వెంకటజ్యోతిలు మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చెంది న కాంట్రాక్టు సంస్థ చేపట్టిన పనుల విషయంలో గతంలో విజిలెన్స్‌శాఖ తప్పు పట్టగా దానిని ఏదోలా రూపుమాపుకున్నారని పేర్కొన్నారు. కాకాణిని రాజకీయంగా పైకి తెచ్చింది ఆనం సోదరులేనన్నారు.

నెల్లూరు మేయర్ భానుశ్రీ ఇంటి పై ఏ సి బి దాడి

నెల్లూరు జిల్లా కసుమూరు దర్గా ను సందర్శించిన సంగీత దర్శకుడు రెహమాన్

నెల్లూరు జిల్లా అనంతసాగరం లో మంచం మీద దెయ్యం