నేడు నెల్లూరు

Tuesday, December 14, 2010

చీటీల పేరుతో మోసం దాదాపు అరకోటి కుచ్చు టోపీ

నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో గల జనార్దన్‌రెడ్డి కాలనీలో చీటీల పేరుతో ఓ మహిళ దాదాపు అరకోటి స్వాహా చేసి మాయమైంది. ఈఘటన సోమవారం వెలుగుచూసింది.

బాధితుల కథనం మేరకు.. జనార్దన్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఆషా అనేక ఏళ్ళగా చిటీల వ్యాపారం చేస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్న కాలనీలో అందరితో నమ్మకంగా ఉంటూ దాదాపు రూ.అరకోటి వసూలు చేసింది. చిటీల కాలం పూర్తి అయినా తన వద్దే ఉంచితే వడ్డీ వేసి సొమ్మును ఇస్తానంటూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చిం ది. ఈ నేపథ్యంలో కొందరు డబ్బులు అవసరమై చిటీల సొమ్ము ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు.దీంతో తను ఎవరికి డబ్బులు ఇవ్వననీ.... ఎవరికి చెప్పుకుంటారో చెప్పడంటూ తెగేసి సమాధానం చె ప్పింది.

డబ్బులు అడిగితే కేసులు
ఎవరైనా గట్టిగా అడిగితే కేసులు పెడుతోందని బాధితులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ పది మంది బాధితులు కలిసి ఆమె ఇంటి వద్దకు వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగారు. దీంతో వారందరిపై దాడి, తదితర కేసులు పెట్టింది.
ఈ సంఘటనతో మిగతా వారు ఆమెను డబ్బులు అడిగేందుకు హడలిపోతున్నారు.
నేడు పోలీసులకు ఫిర్యాదు ఆమె వద్ద చిట్టీలు వేసి మోసపోయిన వారందరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

రూ. 5 కోట్ల స్థలం కాజేసేందుకు మళ్లీ యత్నాలు

నెల్లూరు నగరంలోని వెంకట్రామాపురం (విజయమహల్‌గేటు) వద్ద 1960లో రాధాకృష్ణారెడ్డి లేఅవుట్ వేశారు. సిఎఎస్ నెంబరు 214లో భూములను లేఅవుట్ చేయడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశారు. దీనిని ప్రభుత్వం ఆమోదించడంతో ప్లాట్లు వేసి భూముల అమ్మకాలు జరిపారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్డును వేసి మున్సిపల్ అధికారులకు అప్పగించాల్సి ఉంది.

జీవో నెంబరు 62 ప్రకారం లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీకి ప్రజోపయోగమైన పనుల కోసం పది శాతం భూములు కేటాయించాలన్నది నిబంధన. కానీ 1972లో ఈ విధానం పాటించకపోవడంతో సిఆర్ నెంబరు 534 ప్రకారం ఈ లేఅవుట్‌ను అప్పటి మున్సిపల్ కౌన్సిల్ రద్దు చేసింది. 1960-61లో ఇద్దరికి ఈ లేఅవుట్‌లలో ప్లాట్లు అమ్మిన సమయంలో కూడా పడమర హద్దుగా 40 అడుగుల రోడ్డు ఉన్నట్లు పత్రాలలో పేర్కొన్నారు. ఇది లేఅవుట్ల నిబంధనకు విరుద్దంగా అమ్మారని అప్పట్లో కమిషనర్ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించారు.

బాక్సుటైపు వంతెన
ఈ వివాదం సాగుతుండగానే 1996లో విజయమహల్ గేటు వద్ద బాక్సుటైపు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి అప్రోచ్ రోడ్డు చూపించాల్సిన అవసరం మున్సిపాలిటీపై పెట్టారు. లేఅవుట్‌లో చూపిన విధంగా 40 అడుగుల రోడ్డును భూసేకరణ చేశారు. రాధాకృష్ణారెడ్డి భూసేకరణ ఆపాలని, లేదంటే ఇందుకు అనుగుణంగా మున్సిపాలిటీలో ఉన్న స్థలాన్ని ఇవ్వాలని కోరారు

. ఆ మేరకు 1986లో సిఆర్ నెంబరు 1219 ప్రకారం మున్సిపల్ రిజర్వు స్థలం 35.2 సెంట్ల భూమిని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకించిన ఆయన హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు 1.06 ఎకరాల భూమి ఇస్తే సరిపోతుందని తేల్చింది. దీంతో సంతృప్తి చెందని ఆయన 1.765 ఎకరాల భూమిని అప్పగించాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. వాస్తవ పరిస్థితులు తెలియచేయాలని కోర్టు మున్సిపల్ అధికారులను కోరగా అప్పటికే రాజకీయ ఒత్తిళ్ళతో ఆయనకు అనుకూలంగా నివేదికను సమర్పించినట్లు విమర్శలున్నాయి.

వాస్తవ పరిస్థితి ఇదే..
1960లో వేసిన లేఅవుట్లను 1972లో రద్దు చేశారు. రోడ్డు కోసం వదిలిని భూమికి పరిహారం చెల్లించాలా.... వద్దా అన్న సంశయం అధికారుల్లో నెలకొన్నది. రైల్వే వంతెన నిర్మాణం అప్పుడు రాధాకృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులను తప్పుదోవ పట్టించి లేఅవుట్లను రద్దు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ రికార్డుల మేరకు ఈ 40 అడుగుల స్థలం రోడ్డు కిందనే చూపుతుండడం విశేషం.

మున్సిపల్ చట్టం 1965లోని 184,185 సెక్షన్ల ప్రకారం స్థల యజమాని లేఅవుట్ ఆమోదం కోసం రోడ్లు నిర్మించిన తరువాతే ప్లాట్లు అమ్మాలన్నది నిబంధన. ఈ లేఅవుట్లను రద్దు చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రద్దయిన లేఅవుట్‌ను బూచిగా చూపి మున్సిపల్ స్థలాలు కొట్టేసేందుకు ఇదొక పథకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్‌లో ఈలేఅవుట్ల రద్దు చేసినట్లు ఆయనకు అనుకూలంగా అప్పటి కౌన్సిల్ పాలకులు వ్యవహరించారని సమాచారం.

కోరుతున్న స్థలాలు
నెల్లూరు నగరంలోని వేపదరువు ప్రాంతంలో ఎల్‌పి 70/71 రిజర్వుడ్ ఖాళీ మున్సిపల్ స్థలం 0.40 సెంట్లు, బాలాజీనగర్‌లోని ఎల్‌పి 66/82లో ఉన్న రిజర్వు ఖాళీ మున్సిపల్ స్థలం 1.06 ఎకరాలు, ఆదిత్యనగర్‌లో ఎల్‌పి 55/95 రిజర్వుడ్ ఖాళీ మున్సిపల్ స్థలం 0.375 సెంట్లు మొత్తం 1.765 ఎకరాలు భూమిని అప్పగించాలని రాధాకృష్ణారెడ్డి కోరుతున్నారు. ఇందుకు కొందరు ప్రజా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు తలొగ్గి ఈ స్థలాలను అప్పగించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఈ స్థలాల దస్త్రం పెండింగ్‌లో ఉంది. గత పదేళ్లుగా కోర్టులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా ఈ వివాదం తిరిగి మళ్ళీ కదలిక మొదలైంది. ఓ ప్రజా ప్రతినిధి గట్టిగా పటుబట్టడంతో అప్పనంగా మున్సిపల్ స్థలాలను అప్పగించేందుకు సిద్ధ్దమవుతున్నారు.రూ.5కోట్ల్ల ఈమున్సిపల్ స్థలాలను ఇలా పక్కదారి పట్టిస్తుండడం భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తప్పవు.

Tuesday, November 30, 2010

Sunday, October 31, 2010

చినుకు పడితే చిత్తడే: నెల్లూరులో కొలన్లుగా మారుతున్న కాలనీలు, ఆనం పై జనంఆగ్రహం

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం

నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రహదారులు జలమయం అయ్యాయి. బొల్లినేని ఆస్పత్రి, గాంధీ సెంటర్, రామలింగాపూర్ సెంటర్ అండర్‌బ్రిడ్జి, ఆత్మకూరు బస్టాండ్ రోడ్లపై నీళ్లు నిలిచాయి.
కాగా కోవూరు మండలం దామోదర్‌నగర్‌లో నలభై కుటుంబాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గూడురు డివిజన్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కైవల్యనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాపూరు, పొదలకూరు రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Hitches in Jagan Nellore odarupu yatra

Thursday, October 28, 2010

జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు

తండ్రి మృతి చెందిన మరుక్షణం నుంచీ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ఆ లక్ష్యసాధన కోసం కంటిమీద కును కు లేకుండా పనిచేస్తూ, ముఖ్యమంత్రి రోశయ్య పీఠానికి ఎసరు పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి తనయడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఇక సొంత పార్టీనే దిక్కయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సైతం ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు జగన్‌ శిబిరం సమాచారం. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జగన్‌కు ఎంత తీవ్రమైన మద్దతు వ్యక్తమ యిందో, ఇప్పుడు అదే మద్దతు అంత పేలవంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సంతకాలు చేసిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు అరడజను మంది తప్ప, మిగిలిన వారంతా భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడంతో జగన్‌ శిబిరంలో నిరాశా, నిస్పృహలు ఆవ హించాయి. సొంత పత్రికలో సొంత వర్గీయుల ప్రకటనలు తప్ప, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా జగన్‌కు సంబంధించిన గళమే వినిపించడం లేదు. అది కూడా ఆ అరడజను మందే కనిపిస్తు న్నారు. చివరకు హంగూ ఆర్భాటాలతోమొదలుపెట్టిన ఓదార్పు యాత్ర సైతం అత్యంత పేలవంగా సాగు తోంది. మీడియా సైతం దానికి మునుపటి మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, చర్చల్లో కూడా ఎక్కడా ఓదార్పు ముచ్చట్లు విని పించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఓదార్పు యాత్రకు భారీగా ఖర్చు పెట్టుకుని, రోజులు వెళ్లదీస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం జగన్‌కు అరడజను మంది ఎమ్మెల్యేలు తప్ప మిగి లిన వారి మద్దతు లేదని సొంత వర్గం నేతలే అంతర్గతంగా అంగీ కరిస్తున్నారు. ఇక ఎంపీల్లో సబ్బం హరి, మేకపాటి మినహా మరెవరూ మద్దతునివ్వడం లేదు. తండ్రి ఆత్మబంధువయిన కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ మొండివైఖరికి విసిగి వేసారి పోయి ఆయనను విడిచిపెట్టి, సొంత రాజకీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం.. జగన్‌తో ఉంటే పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని తెలియడంతో వారు కూడా మొఖం చాటేసుకుంటున్నారు.

ఇక తాజాగా యువజన కాంగ్రెస్‌ నాయకులను కూడా పార్టీ నాయకత్వం నియంత్రించడం ప్రారంభించడంతో జగన్‌ ఉక్కిరి బిక్కిరయి ఒంటరిగా మారిపోయారు. ఇంతవరకూ ఎమ్మెల్యేలు తన ఓదార్పు యాత్రకు రాకపోతే.. వారి తర్వాత శ్రేణులు, ప్రధానంగా బలమైన యూత్‌ కాంగ్రెస్‌ నేతలపై వల విసరడం ద్వారా, ఎమ్మెల్యేలను బలవంతంగా దారికి తెచ్చుకోవడంలో విజయవంతమైన జగన్‌ వ్యూహం.. తాజాగా బెడిసికొట్టడంతో ఖంగుతినవలసి వచ్చింది. జగన్‌ మద్దతుదారులయిన యూత్‌ కాంగ్రెస్‌ నేతల పదవులన్నింటినీ రద్దు చేయడంతో, జగన్‌కు ఇప్పటివరకూ ఉన్న ఆ కాస్త మద్దతు కూడా మాయమయింది.

ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తమ పదవుల కోసం తప్ప, జగన్‌ కోసం పనిచేసేందుకు సమయం కేటాయించే పరిస్థితి లేదు. జగన్‌కు ఇప్పటిదాకా దన్నుగా నిలిచిన యూత్‌ కాంగ్రెస్‌ ప్రముఖులకు నాయకత్వం చెక్‌ పెట్టడంతో ఇప్పుడు వారే బలహీనులయ్యారు. ప్రస్తుతానికి కొందరు మంత్రులు మాత్రమే జగన్‌తో తెరచాటు మంతనాలు సాగిస్తున్నారు. వారి శాఖల అంశాలపైనే జగన్‌కు సంబంధించిన మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వెలువడుతున్న విష యం చర్చనీయాంశమయింది. గత కొద్దిరోజులుగా అభయ హస్తం, పావలా వడ్డీకి సంబంధించిన వార్తలు వెలువడుతున్న విషయాన్ని తమ అనుమానాలకు మద్దతుగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు సైతం పావలా వడ్డీ, అభయహస్తం పథకాలకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు స్వల్పమేనని గుర్తు చేస్తున్నారు.

అప్పుడు ఆ పథకాలపై రాని వార్తలు, ఇప్పుడు రోశయ్య సీఎం అయిన తర్వాతే వస్తున్నాయంటే వాటి వెనుక ఏ మంత్రుల హస్తం ఉందో స్పష్టం అవుతోందని కొందరు ఎమ్మె ల్యేలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మంత్రుల వైఖరిపై ముఖ్యమంత్రి గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసినా వారి పనితీరు, జగన్‌కు విధేయతలో మార్పు రాలేదంటున్నారు. పైగా రోశయ్య ప్రభు త్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలుచేసేందుకే మంత్రుల హోదాలో మహిళలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, వ్యూహాత్మకంగా రోశ య్యను భ్రష్ఠుపట్టిస్తున్నారంటున్నారు. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని వంటి మంత్రులు జగన్‌కు బాహాటంగానే తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

అటు.. అధిష్ఠానం కూడా రోశయ్యను మార్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేకపోవడంతో జగన్‌ ముఖ్యమంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయిపోయాయి. పైగా పార్టీ అధినేత్రి.. రోశయ్యపై సానుభూతి చూపించడం, వైఎస్‌ మాదిరిగా కాకుండా ప్రతి అంశాన్నీ తనకు చెప్పి చేయటంతో రోశయ్యనే పూర్తి కాలం కొనసాగించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఎమ్మె ల్యేలు, మెజారిటీ మంత్రులు, ఎంపీలు ముఖం చాటేస్తుండటం కూడా జగన్‌ లో ఆందోళన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో జగన్‌కు సొంత పార్టీ పెట్టడం తప్ప మరో దిక్కు కనిపించడం లేదు. ఇప్పటివరకూ అటు రోశయ్యను, ఇటు చంద్రబాబును, అదే సమయంలో పార్టీలోని వైఎస్‌ ప్రత్యర్థులను ఏకకాలంలో ఎదుర్కుంటున్న జగన్‌ ఆ లక్ష్యంలో పూర్తిగా అలసి పో యారు. ఈ ఒంటరి పోరాటం ఇకపై కష్టమని ఆయన గ్రహిం చినట్లు కనిపిస్తోంది. తన ఓదార్పు యాత్రను పార్టీ నాయకత్వం లెక్కచేయడం లేదంటే, తన ప్రాధాన్యాన్ని అధిష్ఠానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని సైతం ఆయన గ్రహించక పోలేదంటున్నారు.

ఇప్పుడు కూడా సొంత పార్టీ పెట్టకుండా, ఎక్కు వ కాలం అధిష్ఠానాన్ని బెదిరించడానికే పరిమితమయితే అది సాధ్యం కాదని ఆయన అనుచరులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నందున పార్టీ పెట్టవచ్చంటున్నా రు. లేకపోతే ఇప్పటివరకూ ఉన్న అభిమానులు, నాయకులు కూడా మిగలరంటున్నారు. సొంత పార్టీ పెడితేనే తన సత్తా చూపించవచ్చని, పార్టీలోనే ఉంటే తనను గుర్తించడం కష్టమన్న వాస్తవాలను ‘అనేక సంఘటనల ద్వారా అనుభవించిన’ జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు వేస్తున్నారంటున్నారు.

స్టోన్‌హౌస్‌పేట, ట్రంకురోడ్డు విస్తరణకు కసరత్తు

నగర తూర్పు, పడమర ప్రాంతాలను కలిపే సర్వేపల్లి కాలువ బ్రిడ్జి ఒక వైపు శిథిలావస్థలో ఉంది. దానిని నూతనంగా నిర్మించడంతో పాటు ఆరు లైన్లుగా విస్తరించేందుకు 2.6 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. స్టోన్‌హౌస్‌పేట నుంచి టూ టౌన్ పోలీసు స్టేషన్ వరకు 50 అడుగులు మేర రోడ్డు విస్తరణకు 1.8 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నిధుల మంజూరుకు మంత్రి హమీ ఇవ్వడంతో స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణకు మోక్షం కలగనుంది. ఇందు కోసం త్వరలో వ్యాపారులతో నగర, రూరల్ శాసన సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

మైపాడు గేటు రోడ్డు కూడళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
నగరంలోని మైపాడు గేటు రోడ్డు కూడలి ఇరుకుగా ఉంది. ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువగా ఉన్నాయి. కూడలిని ,బ్రిడ్జిని విస్తరించేందుకు కోటి రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనికి ఆమోద ముద్ర లభిస్తే ఆ ప్రాంతం కూడా విశాలం కానున్నది. అలాగే మైపాడు, గేటు రోడ్డు నుంచి మైపాడు వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో రోడ్డును అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిధులు మంజూరైతే మైపాడు గేటు నుంచి నవాబుపేట కూడలి వరకు రోడ్డును విస్తరించి అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ట్రంకురోడ్డు విస్తరణకు కసరత్తు
నగరంలోని ప్రధాన రహదారి అ యిన ట్రంకురోడ్డు కొన్నిచోట్ల 100 అ డుగులు మరికొన్నిచోట్ల 40 అడుగులు మేర ఉంటుంది. దీంతో ఫత్తేఖాన్‌పేట, ఎంబీ బ్రదర్స్ ప్రాంతంలో రోడ్లు ఇరుకుగా ఉంటూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు కసరత్తు జరుగుతోంది. స్థానిక వ్యాపారులతో చర్చించి విస్తరణను చేపట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో విస్తరణ జరిగితే ట్రాఫిక్ ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.

నెల్లూరు రోడ్ల యడల్పుకు కసరత్తు

నెల్లూరు నగరంలో రోడ్ల విస్తరణకు కసరత్తు జరుగుతోంది. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రోడ్ల వ్యవస్థ లేదు. నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లతో అవస్థలు ఎదురవుతున్నాయి.. ఈ సమస్యపై మున్సిపల్ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్, నగర శాసన సభ్యులు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిలు కొంత మేర దృష్టి సాధించారు. నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన స్టోన్‌హౌస్‌పేట నుంచి జిల్లా వ్యాప్తంగా ఫల సరుకుల వ్యాపారం సాగుతోంది.

ఈ ప్రాంతానికి సరుకుల రవాణ కు సంబంధించి వందలాది వాహనాలు వస్తున్నాయి. డెభై, యనభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 30 అడుగుల రోడ్డు మాత్రమే నేటికి ఆధారం. ఏడు దశాబ్ధాల కిందట జనాభా, వాహనాల సంఖ్య పది రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. రోడ్ల విస్తరణ జరగలేదు. దీంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీతో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ ప్రాంతమంతా వ్యాపార కేంద్రాలు కావడం, దుకాణాలు ముందు సరుకుల రవాణాకు చెక్క రిక్షాలు, ఆటోలు నిలపాల్సి ఉండడంతో ట్రాఫిక్ ఇక్కట్లు మరింత ఎక్కువయ్యాయి.

అలాగే ఆ ప్రాంతానికి వెళ్లే ప్రజలకు పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. వాహనాలను రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. సర్వేపల్లి కాలువ బ్రిడ్జి సైతం 20 అడుగులు ఉండడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. నగర శాసన సభ్యుడిగా ముంగమూరు శ్రీ«ధర్‌కృష్ణారెడ్డి ఎన్నికైన తరువాత స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణపై దృష్టి సారించి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. పలు సభల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించి సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్రిడ్జితో పాటు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

Tuesday, October 19, 2010

Saturday, October 16, 2010

ఆనంగానం..ఓదార్పుకు ఆనం సోదరులు గైర్హాజరు పై స్పెషల్

వ్యూహం ప్రకారమే ఓదార్పుయాత్ర

కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అన్ని వర్గాలను ఆకట్టు వ్యూహంతో సాగు తోంది. అయితే రెండోరోజూ కూడా జగన్ నోటి వెంట అవే పలుకులు వినిపిస్తున్నాయి. ఈ పర్యటన వైఎస్ పథకాల జపం ఇందులో ప్రధాన భా గం. మృతుల కుటుంబాలను పరామ ర్శించే కార్యక్రమం రహస్యంగాు మారింది

ప్రతి సభలోను కాబోయే సిఎం జగన్ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.ఇది అధిష్టానానికి ఒక రకంగా ఓదార్పు ద్వారా హెచ్చరిక సంకేతాలు పంపుతున్నారు.కావలిలో బుధవారం రాత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మొ క్కుబడి తంతుగా నిర్వహించడం కలికి వర్గీయులు, అభిమానులను తీవ్ర అ సంతృప్తికి గురిచేసింది.. కోవూరు ఎమ్మెల్యే జగన్‌తో జతకట్టి ఓదార్పు యాత్రల్లో పాల్గొన్నారు. రెండో రోజైన గురువారం కావలి పట్టణం, రూరల్ ప్రాంతాలకే ఈ యాత్ర పరిమితమైంది.

అవే పలుకులు
బుధవారం రాత్రి 8.30గంటలకు జిల్లా సరిహద్దులోకి జగన్ అడుగు పెట్టారు. ప్రకాశం జిల్లాలో అన్ని తానై నడిపించిన మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సరహద్దు వరకు వచ్చి జగన్‌ను జిల్లా నేతలకు అప్పగించి వెనుదిరిగారు. చేవూరు వద్ద జగన్ వర్గీయులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాలుగున్నర గంటలు జగన్ ఆలస్యంగా రావడం, కారులోనే కూర్చొని చేతులూపడంతో చాలా సేపు నిరీక్షించిన కొంతమంది జనం నిరాశగా తిరుగుముఖం పట్టారు.

5 గంటల పాటు జరిగిన తొలి రోజు పర్యటనలో వైఎస్ విగ్రహాలతో పాటు కావలి మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభల్లో జగన్ వైఎస్ పథకాలను ఏకరువు పెట్టారు. జనం చేత పదే పదే వైఎస్ పేరు జపించే విధంగా చూశారు. తొలి రోజు సభల్లో ఎమ్మెల్యేకొండాసురేఖ ఆనం సోదరులు లక్ష్యంగా మాట్లాడారు. ము న్సిపల్, సహకార ఎన్నికలు వాయిదా వేయడాన్ని ఎండగట్టారు.

ఇక ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీరు ఏం కోరుతున్నారు... మీ తాపత్రయం ఏమిటి అంటూ సభికులను ప్రశ్నించి, జగన్‌ను సిఎంను చే యాలని వ్రారు చెప్పినట్లు అధిష్టానం దృష్టికి తీసుక పోతామన్నారు. తొలి రోజు పర్యటన ్ధరాత్రి ఒంటిగంట దాటే వరకు సాగింది. జనం కూడా ఒపిగ్గా ఉండి జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటారు.ప్రతి సమావేశంలో చెప్పిన మాటలనే పదే పదే చెబుతుండడంతో పాటు ఆకట్టుకొనే రీతిలో జగన్ ప్రసంగం సాగడంలేదు.కొన్నిచోట్ల ఐదు నిమిషాలు లోపే ప్రసంగాన్ని ముగిస్తున్న ఆయన వైఎస్ పేరే జపిస్తూ వస్తున్నారు. వైఎస్ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారిని ఆకట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సభికుల చేత నేవైఎస్ఆర్... అంటూ ప్రతి సారి చెప్పిచడంతో పాటు జగన్ కూడా మూడు, నాలుగు సార్లు వైఎస్ ఆర్... అంటూ వారితో శృతి కలుపుతు న్నారు. ఈ యాత్రలో చిత్తూరు, కడ ప ప్రాంతాల నేతల సందడే జోరుగా ఉంది.

అంతా వ్యూహం ప్రకారమే
రెండు నెలలుగా జిల్లాలో జగన్ ఓదార్పుయాత్రకు జగన్ వర్గీయులు రాత్రింబవళ్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి కార్యక్రమాన్ని వ్యూహం ప్రకారం రూపొందించారు. జగన్ గ్రామానికి రాకముందే పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంఘీబావం తెలిపే విధంగా చూ స్తున్నారు. మేళ తాళాలతో స్వాగతం, స్థానికులనుు సమీకరించ డం వంటివి కూడా ముందుగానే చూస్తున్నారు. జగన్ అడుగుపెట్టగానే జగన్ జిందాబాద్ , కాబోయే సిఎం జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు మార్మోగుతున్నాయి.

కొద్దిసేపు జగన్ వైఎస్ పథకాలను వివరించి వాటి ద్వా రా పొందే లబ్దిని గుర్తుచేసి భవిష్యత్‌లో నేనే మీకు అండగా నిలుస్తానని సంకేతాలిస్తున్నారు.. ఇక గ్రామాలో పిల్లలతో ముద్దాడడం, వృద్ధులను పలకరించి చేతులు కలపడం ఈ యాత్రలో తళుక్కులు. ఒక్కసారిగా కాన్వాయ్‌ని ఆపి ఇళ్లలోకి వెళ్లి కొందరి యోగ క్షేమాలు తెలుసుకొని తిరిగి ప్రయాణం అవుతున్నారు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో కి వెళ్లి సర్వమత సమానత్వాన్ని చాటే వి«ధంగా పూజ లు, ప్రార్దనలు చేస్తున్నారు.

స్థానికుల్ల్లో మమేకమై నేనున్నాను.. అంటూ భరోస కల్పించే ప్రయత్నం చేస్తున్నా రు. పూర్తిగా భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో ఉంచుకొని ఓదార్పుయాత్ర సాగుతోంది. స్థానిక నేతల ప్రస్తావన ులేదు. పూర్తిగా జగన్ మాటలతోనే సమావేశాన్ని ముగిస్తున్నారు. ఇది స్థానిక నాయకులకు కొంత మింగుడు పడని పరిస్థితిగా మారుతోంది.

రహస్యంగానే ఓదార్పు
వైఎస్‌మృతి అనంతరం అశువులు బాసిన కుటుంబాలను జగన్ ఓదారు స్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణ, ఓదార్పు చేసే కుటుంబం ముంగిట వరకు మీడియా, ప్రజా ప్రతినిధులు అందరు వెళతారు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన తరువాత జగన్ ఏకాంతం గా మాట్లాడుతారు. అప్పుడు మాత్రం ఎవ్వరికి అనుమతి ఉండదు. మీడియా ఫొటోలకు అనుమతిలేదు. సొంత ఛా నల్ వారికే అనుమతి. మృతుల కు టుంబాలకు రూ.1లక్ష వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నారన్నది సమాచా రం. దీనిని గోప్యంగా ఉంచడంలో మర్మమేమిటో తెలియదు.

కలికి అనుచరుల అసంతృప్తి
మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి మూడు దశాబ్దా లుగా కావలి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వీరి జ్ఞాపకార్ధం ఉదయగిరి రోడ్డు కూడలిలో కలికి విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన అ నుచరులు బావించారు. చాలా రోజు లుగా విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం రాత్రి జగన్ చేత కలికి విగ్రహాన్ని ఆవిష్క రించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి జగన్ ఈ విగ్ర హాన్ని ఆవిష్కరించగా కలికి అభిమా నులు కొద్దిసేపు మాట్లాడాలని కోరా రు. వైఎస్ విగ్రహావిష్కరణ తరువాత మాట్లాడాతానన్నారు. వైఎస్ విగ్రహా న్ని ఆవిష్కరించిన జగన్ కలికి ప్రస్తా వన తేకపోవడంతో కలికి అభి మానులు,అనుచరులు నిరాశ పడ్డారు.

నేతలు దూరం దూరం
జగన్ వర్గీయులుగా ముద్రపడ్డ వారు తప్పా ఈ యాత్రకు జిల్లాలోని కాంగ్రెస్ నేతలు దూరం దూరంగానే ఉంటున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కావలి పట్టణ ంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయ గిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డిసిసి అ«ధ్యక్షడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి జగన్ వెంట నడుస్తున్నారు. నేదురమల్లి, పనబాక, ఆనం సోదరులు, ఆదాల, కాకాణి తదితర నేతలంతా దూరం దూరం గానే ఉంటున్నారు.

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మెరుగుపర్చాలి : వెంకయ్యనాయుడు

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత మెరుగుపర్చాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాం డ్ చేశారు. "దేశ పటిష్ఠతకు, రాజకీయ స్థిరత్వానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, అవినీతి అక్రమాల నియంత్రణకు.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టడం అవసరం'' అన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు.. సభ్యత్వం కోల్పోయే పరిస్థితి రావాలన్నారు.

ఆయన శుక్రవారం ఇక్కడ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, రామచందర్‌రావు, ఆచారిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ సీఎం యడ్యూరప్ప రెండుసార్లు విశ్వాస పరీక్షలో నెగ్గడం, గుజరాత్‌లో బీజేపీ సర్కారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆరు చోట్ల 80%కు పైగా సీట్లు, ఓట్లు సాధించటంపై వెంకయ్య సంతోషాన్ని వ్యక్తంచేశారు.

కర్ణాటకలో రాజ్‌భవన్‌ను గవర్నర్ కాంగ్రెస్ భవన్‌గా మార్చారని ఆరోపించారు. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ రాజకీయవాదిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ జీర్ణించుకోలేదని, కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ ఎగుమతులను నిషేధించటంతో కంగుతిన్న అక్రమ మైనింగ్ బడా వ్యాపారులు ప్రభుత్వాన్ని అస్థిరపర్చే యత్నం చేశారని చెప్పారు.

ఇంత జరిగినా, పొరపాటు తెలుసుకోకుండా.. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలతో గవర్నర్ రహస్యంగా సమావేశమై కోర్టు తీర్పు వచ్చే 18 వరకు వేచి చూడాలని చెప్పినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 9 మంది ఎమ్మెల్యేలు విపక్షం వైపు వెళ్తే కాంగ్రెస్ గమ్మున ఎలా ఉంటుందని ప్రశ్నించారు. "మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని కాదని.. కేవలం పదిమంది చెబితే నాయకత్వాన్ని మారుస్తారా? ఇక్కడ కూడా రోశయ్య వద్దని కొందరు ఎమ్మెల్యేలంటే సీఎంను కాంగ్రెస్ దించేస్తుందా?'' అని ప్రశ్నించారు.

అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూస్తామని చెబుతున్న కర్ణాటక గవర్నర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి ఒకవేళ మైనింగ్ అక్రమాలకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని వెంకయ్య ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. కర్ణాటక వ్యవహారాల నుంచి బీజేపీ కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందని వెంకయ్య ఒప్పుకొన్నారు.

Wednesday, October 13, 2010

36 కుటుంబాలు .. 400కుపైగా వైఎస్సార్ విగ్రహాలు

36 కుటుంబాలను ఓదార్చడానికి 515 గ్రామాల్లో పర్యటించి 400కుపైగా వైఎస్సార్ విగ్రహాలను పెట్టడం అవసరమా ?
36 మంది చనిపోయారు .. 400కుపైగా వైఎస్సార్ విగ్రహాలు పుట్టాయి.

విగ్రహాల ధరలు 20,000 నుంచి 50,000 వరకు వున్నాయ్
ఒక్క విగ్రహం ఖరీదు సుమారు 30,000 .. దాని ఏర్పాట్ల ఖర్చు 15,000 = 45,000
400 విగ్రహాలు x 45,000 = 1,80,00,000 (విగ్రహాల ఖర్చు మాత్రమే ..)


Controversy in Jagan Odarpu Yatra - Part 2

Controversy in Jagan Odarpu Yatra - Part 1

ఈయన ఏవరో కనుక్కోండి ....


భలే కనుక్కొన్నావే ..... చేయి పైకి ఎత్తాడు కాబట్టి కనుక్కొన్నావ్ ... లేకపోతే ?? ఎవరయినా కనుక్కోలేక పోతే ఈయనే రాజశేఖర్ రెడ్డి. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా నెల్లూర్ లో ముక్కు ముఖం సరిగా లేకుండా రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎన్నో ఉన్నాయ్.

మహాత్మగాంధీ బొమ్మ దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహం .. పోటోలు


బొల్లినేని హాస్పిటల్ ..... బొల్లినేని హాస్పిటల్

ఈ పోటోలు చూడండి ... బొల్లినేని హాస్పిటల్ ముందు రోడ్దు ... ఎన్నిగుంటలు ఉన్నాయో చూడండి. ఈ హాస్పిటల్ వాళ్లు ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్స్, దేశ, విదేశాలలో కాంట్రాక్టులు చేస్తారు, వాళ్ల హాస్పిటల్ ముందు రోడ్దు కు ఒక ట్రాక్టర్ మట్టి పోసుకోలేరు !
రోగుల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తారు, రోజుకు ఎన్ని అంబులెస్సులు వస్తూ, పోతూ వుంటాయ్ ...
చిన్న హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ కు అంబులెస్సులో రోగిని తీసుకొచ్చేటపుడు ... ఈ గుంటల రోడ్డు దాటేలోపు రోగి ప్రాణం సగం పోతుంది ......... గుండె జబ్బు ఉన్న రోగి పరిస్థితి ఏమిటి ?



Tuesday, October 12, 2010

Monday, October 11, 2010

Venkaiah Naidu on Yeddyurappa victory

Terrific Accident in Nellore

Adala Prabhakar Reddy Land scam in Nellore

మహాత్మగాంధీ బొమ్మ దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహం .. ఆనం పాపం కాదా !

కోటంరెడ్డి కొత్తహాలు దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడతానంటే, అక్కడ వద్దని గాంధీ తాత నెత్తిన తీసుకొచ్చిపెట్టాడు..ఆనం, అనుమతి ఇచ్చేటపుడు తెలియదా ఆనంకు మహాత్మగాంధీ విగ్రహానికి చాల దగ్గరా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వస్తుందని ?

నెల్లూరు నగరంలో ఎక్కడయినా సరే రెండు అడుగులు ఇవ్వండి అని అడిగాడు కోటంరెడ్డి , అయ్యప్ప గుడి నుంచి పెన్నా బ్రిడ్జి
దాక మిని బైపాస్ ఉంది, ఎక్కడ ఇవ్వకూడదు.... కోటంరెడ్డి ఏమైనా నాకు మహాత్మగాంధీ బొమ్మ దగ్గర కావాలని అడిగాడా ?



ఔరా నారా కాదు ... ఔరా సాక్షి

సాక్షి పత్రికలో వచ్చిన ఫొటో .... మహిళ చంద్రబాబు చేతిలో మైక్ లాగుతుంది, బాబు అడ్డుకొన్నాడు .. చేతిలోంచి మైక్ లాగడం చూపకొండా .. చంద్రబాబు అడ్దుకొన్న దానిని మహిళను కొట్టినట్లు చూపడం ...ఈ ఫోటో కూడా సాక్షి ప్రచురించడం ....... ఛీ..చీ

రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు రెండెనట ... జమిన్ రైతు పేపర్ తెగ బాధపడిపోతుంది ...

రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు రెండెనట ... జమిన్ రైతు పేపర్ తెగ బాధపడిపోతుంది ... పేపర్ కటింగ్ చూడండి



స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మగాంధీ, రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు నెల్లూర్ లో ఎన్ని ఉన్నాయ్ ?


రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు ఎన్ని పెట్టాలో ఏవిదంగా పెట్టాలో చెప్పవచు కదా ! ... క్రింద ఫోటో చూడండి ఇలా పెడితే జమీన్ రైతుకు సంతోషమా ....



చంద్రబాబునాయుడు మాటలు ఒకసారి చదవండి....

అనంతపురం :ఆయన స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్ముడా? బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచి సామాజిక న్యాయం కోసం రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కరా? ఏమి చేశారని వైఎస్ఆర్ విగ్రహాలను ఊరూరా పెడుతున్నారు? ఫ్యాక్షన్ నేతగా వందలాదిమందిని చంపించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. అలాంటి దోపిడీ దొంగ విగ్రహాలను ఊరూరా పెడతారా? అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ పాలకులపై ఆయన నిప్పులు చెరిగారు. "రాష్ట్రాన్ని వైఎస్ అడ్డంగా దోచుకున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయన విగ్రహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. అందులోనూ నేతలకు అవినీతి జబ్బు పట్టుకుంది. అభిమానం ఉంటే ఇంటి పెరట్లోనో, తోటల్లోనో విగ్రహాలు పెట్టుకోండి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తే సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తుతాయి.
అభిమానం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలే కానీ అది బలవంతంగా రుద్దితే వచ్చేది కాదు.

Jagan Nellore Odarpu Yatra Postponed

Sunday, October 10, 2010

Prasanna Kumar Reddy Attack on Chandrababu Naidu

1995లో లక్ష్మీ పార్వతి పంచన చేరిన ప్రసన్న : బీద రవిచంద్ర

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ అవినీతి పరుడైన ప్రసన్నకుమార్‌రెడ్డికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. 1993లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడివా అని ప్రశ్నించారు. 1995లో లక్ష్మీ పార్వతి పంచన చేరి పది రోజుల్లో చంద్రబాబు కాళ్లు పట్టుకుని పార్టీలో చేర లేదా...? అంటూ విమర్శించారు. జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదరణతోనే ప్రసన్న నియోజకవర్గంలో గెలిచారన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు

. జగన్ ఇచ్చిన డబ్బుతో ఓదార్పు యాత్రకు పోస్టర్లను ప్రసన్న ఏర్పాటు చేశారని విమర్శించారు. టీడీపీ నగర అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసి అర్హత నీకెం ఉందంటూ వైఎస్ఆర్ అభిమానులు ప్రసన్నను ఓ మీటింగ్‌లో నిలదీశారన్నారు. ఆడా, మగ కాకుండా మారారని ప్రసన్నను ఎద్దేవా చేశారు. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు బీద రవికుమార్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు సాయం కోసం పడిగాపులు కాసి తీరా సాయం పొందిన తర్వాత చంద్రబాబును లేఖాస్త్రాలతో విమర్శించడం సిగ్గుచేటన్నారు

త్వరలో తగిన బుద్ధి చెబుతామని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కడుపున ప్రసన్న చెడపుట్టాడు : సోమిరెడ్గి

తెలుగుదేశం పార్టీ దయాదాక్షణ్యాల మీద ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ గుర్తుపై గెలిచి ప్రస్తుతం వైఎస్ జగన్ వద్ద పరువును తాకట్టు పెట్టాడని సోమిరెడ్గి విమర్శించారు. గతం లో నేదురుమల్లి కాళ్లు పట్టుకున్నారని, రాజ్యలక్ష్మి జపం చేసి జనార్ధన్‌రెడ్డి కొడుకు రామ్‌కుమార్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించి, ప్రస్తుతం జగన్ ప్రాపకం కోసం పాకులాడి డబ్బుకు దాసోహమనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలున్న స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పేరు, ప్రతిష్టలు దిగజారుస్తున్నారన్నారు.

కోవూరు నియోజకవర్గంలో శ్రీనివాసులురెడ్డి విగ్రహాలు పెడతామని ప్రకటించి ప్రస్తుతం వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఆయన చూపిస్తున్న ఆశక్తి వెనుక అక్రమార్జనే కారణమన్నారు. తెలుగు, ఇంగ్లీషు సరిగ్గా తెలియని ప్రసన్న సీఎల్పీ కార్యాలయానికి ఏదైనా లెటరు ఇవ్వాలంటే ఆ కార్యాలయం గుమస్తా రవిచంద్ర రాసిస్తారన్నారు. ఆ లెటరులో తన పేరును సరిగ్గా సంతకం చేయలేని పరిస్థితి ప్రసన్నదని ఎద్దేవా చేశారు. నీకు ఖలేజా, చీము, నెత్తురుంటే చంద్రబాబు ఇచ్చిన సీటుకు రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. జగన్, వైఎస్,సోనియా మరెవరైనా ఫోటోలు పెట్టుకుని పోటీ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయతగల నాయకుడు పంచన చేరగానే వైఎస్ అకాల మృత్యువుకు గురయ్యారన్నారు. ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ ప్రసన్న ఐరన్‌లెగ్‌వల్ల ఆదరణ కోల్పోయారన్నారు.

ఒక్కొక్క లేఖకు ఎంత తీసుకుంటున్నావు : సోమిరెడ్డి

గత ఎన్నికలకు ముందు వైఎస్ బజారురౌడీ అంటూ విమర్శనాస్త్రాలు గుప్పించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాటమార్చడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఎన్నికలైపోగానే సంపాదన కోసమే నీచమైన రాజకీయాలు చేస్తూ బజారు మనిషిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒకప్పుడు,ప్రజాధరణ పొందిన నాయకుడని చంద్రబాబుని పొగిడిన ప్రసన్న ప్రస్తుతం విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒక్కొక్క లేఖకు ఎంత తీసుకుంటున్నావు. హోల్‌సేల్‌గా లేఖకు ఎంత పుచ్చుకుంటున్నావంటూ ధ్వజమెత్తారు.

1993లో దివంగత ఎన్టీఆర్ అప్పట్లో ప్రసన్నకు పార్టీ టికెట్టు ఇవ్వకపోతే స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఒప్పించి పార్టీ టికెట్ ఇప్పించారన్నారు. 2004-2009 లలో నూ చంద్రబాబు ఇచ్చిన టికెట్‌పై గెలిచారన్నారు. ఎనిమిదిన్నర నెలల పాటు మంత్రిగా పని చేసి ఏనాడు డీడీఆర్‌సీ, జిల్లా పరిషత్ మీటింగ్‌లలో పాఒ్గని ప్రజా సమస్యలను పరిష్కరించిన దా ఖలాలు లేవన్నారు. జిల్లా మంత్రిగా ఉండి ఆగస్టు 15న జెండా ఎగర వే యాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇన్‌చార్జి మంత్రి దేవేందర్ గౌడ్ చేత జెండా ఆవిష్కరణ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.

Saturday, October 9, 2010

బాబు మారనంతవరకు టిడిపికి భవిష్యత్తు లేదు:నల్లపు రెడ్డి

జగన్ పర్యటించే ప్రాంతాలు

ఓదార్పు యాత్ర వివరాలతో కూడిన రూట్ మ్యాప్‌ను నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో జగన్ పర్యటించే ప్రాంతాలు నియోజక వర్గాల వారిగా ఇలా ఉన్నాయి.

కావలి నియోజక వర్గం : కావలి టౌన్‌లో ఉదయగిరి వంతెన, ఉదయగిరి రోడ్డు, వెంగళరావు నగర్ సెంటర్
కావలి రూరల్: రుద్రకోట, మద్దూరుపాడు, ముసునూరు, గౌరవరం, ముంగమూరు
బోగోలు: బోగోలు, నాగుల వరం, తాళ్లూరు
అల్లూరు: బీరంగుంట, నార్త్‌మోపూరు, ఇందుపూరు,పురణి, పశ్చిమగోగుల పల్లి,అల్లూరు, జువ్వాగు
దగదర్తి: సున్నపుబట్టి

ఉదయగిరి నియోజక వర్గం :జలదంకి: జమ్మల పాళెం, అన్నవరం, జలదంకి, నాగిరెడ్డిపాళెం, చిన్నక్రాక, హనుమకోండపాళెం, 9వ మైలు, అగ్రహారం, బ్రాహ్మణక్రాక, చామదల, సోమవరప్పాడు, బోయలపాడు, కిష్టపాడు, కొత్తపాళెం

కలిగిరి: తూర్పుగుడ్లదొన, పడమర గుడ్లదోన, అనంతపురం, సిద్ధనకొండూరు, లక్ష్మీపురం, ప రికోట, 14వ మైలు, అయ్యప్ప రెడ్డిపాళెం, కు మ్మరకొండూరు, కాకుటూరు, తిమ్మారెడ్డిపాళెం, పెద్దకొండూరు, వీరారెడ్డిపాళెం, కలిగిరి, అంబటివారిపాళెం, చీమల వారిపాళెం,తెల్లపాడు,చిన్నఅన్నలూరు,తగురువారిపాళెం,కృష్ణారెడ్డిపల్లి
కొండాపురం: జంగాల పల్లి, ఆదిమూర్తిపురం, కొండాపురం, తూర్పుఎరబ్రల్లి, బసిరెడ్డిపల్లి, బోయవారిపల్లి, ఇస్కదామెర్ల
వింజమూరు: చాకలికొండ, తమిదపాడు, కాటేపల్లి, వింజమూరు, నందిగుంట, గుండెమడకల, శంఖవరం, నల్లగొండ్ల

దుత్తలూరు: భైరవరం, తురకపల్లి, జంగాలపల్లి, రాచవారిపల్లి, ఏరుకొల్లు, బ్రహ్మేశ్వరం, లక్ష్మీపురం,దుత్తలూరు బీసీ కాలనీ, దుత్తలూరు, సోమలరేగడ, మందాలనాయుడుపల్లి, వెంకటంపేట, పాపంపల్లి, నందిపాడు
వరికుంటపాడు: జడదేవి, కనియంపాడు, వరికుంటపాడు, రామాపురం, తిమ్మారెడ్డిపల్లి, ఇరువూరు, కృష్ణంరాజుపల్లి, కొండాయ పాళెం, తూర్పుపాళెం, పెద్దిరెడ్డిపల్లి, టీసీపల్లి, ఎర్రంరెడ్డిపల్లి, గొల్లపల్లి, జి. కొండారెడ్డిపల్లి

ఉదయగరి: దాసరిపల్లి, చౌటపల్లి, నడింపల్లి, అప్పసముద్రం, గండిపాళెం, వెంగళరావునగర్,దుంపవారిపల్లి, గుడినరవ, తిరుమలాపురం, సున్నంవారి చింతల, మాసాయిపేట, గానుగపెంటపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉదయగిరి, ఉదయగిరి యాదవపాళెం, నేలటూరు, కురప్రల్లి, కిష్టంపల్లి, ఆర్లపడియ, శకునాలపల్లిగడ్డ, పుల్లాయపల్లి, లింగంనేనిపల్లి, కొత్తపల్లి, బిజ్జంపల్లి, కొట్టాలు, దేకూరుపల్లి, జి. ఆయ్యవారిపల్లి, జి.చెరువు పల్లి, జి.చెర్లోపల్లి
సీతారామపురం : బెడుసుపల్లి, నెమళ్లదిన్నె,నాగరాజుపల్లి,గంధంవారిపల్లి, గుండుపల్లి, గడ్డమీదపల్లి, ఓగూరువాండ్ల పల్లి, పబ్బు లేటిపల్లి, చిన్నాగంపల్లి, సీతారామపురం, సింగారెడ్డిపల్లి, అయ్యవారిపల్లి, పోలంగారిపల్లి, రంగనాయుడుపల్లి, బసినేనిపల్లి, ఎస్‌ఆర్ నగర్

ఆత్మకూరు నియోజకవర్గం
మర్రిపాడు: చిన్నమాచనూరు,పోలీరెడ్డిపల్లి, కదిరినేనిపల్లి, బొంతం వారిపల్లి, చిలకపాడు, రాజులపాడు, సన్నువారిపల్లి, పెగళ్లపాడు, ఏపిలగుంట, బూదవాడ, కృష్ణాపురం, కంపసముద్రం, బ్రాహ్మణపల్లి, నాగినేని గుంట, సింగనపల్లి, కదిరినాయుడుపల్లి, పడమటి నాయుడిపల్లి, చుంచులూరు, మర్రిపాడు,పొంగూరు కండ్రిగ, భీమవరంవడ్డెపాళెం, నందవరం, రామానాయుడుపల్లి, డీసీపల్లి

ఆత్మకూరు : కరటంపాడు, బోయల చిరువెళ్ల, గొల్లపల్లి, నెల్లూరుపాళెం,టి.ముస్తాపురం,ఆత్మకూరు (గర్స్ హైస్కూల్ సెంటర్, సత్రం సెంటర్, చల్లావీధి, పంటవీధి, నాగేంద్రపురం,టెంకాయతోపు,బస్టాండ్ సెంటర్), నువ్వూరుపాడు, అశ్వనీపురం, జంగాలపల్లి, దేపూరు.

అనంతసాగరం : రేవూరు,మినగల్లు, కొత్తపల్లి, పాత దేవరాయపల్లి, వెంగంపల్లి, చిరి వెళ్ల, చిరివెళ్ల ఎస్పీకాలనీ, అనంతసాగరం, మంగుపల్లి, అగ్రహారం, బొమ్మవరం, చాపరాళ్లపల్లి, మంచాలపల్లి, వరికుంట పాడు, పాతాళపల్లి, మస్తాపురం, గోవిందుపల్లి, పడమటి కంభంపాడు,సోమశిల
ఏఎస్‌పేట: ఏఎస్‌పేట, చిరమన, హసనాపురం, శ్రీకొలను
సంగం: కొరిమెర్ల, సంగం, కోలగట్ల, వాసిలి, గాంధీ జనసంగం, వెంగారెడ్డిపాళెం, సిద్ధీపురం, దువ్వూరు
చేజర్ల: మడపల్లి, చేజర్ల,బోడిపాడు, పుళ్లనీళ్లపల్లి, తిమ్మాయపాళెం,సూరాయపాళెం,ఆదూరు పల్లి

వెంకటగిరి నియోజకవర్గం
కలువాయి: కుల్లూరు, కలువాయి, కోటితీర్థం,ఎనమదల

కోవూరు నియోజకవర్గం
కోవూరు: కోవూరు (మైథిలి సెంటర్, సాయిబాబా గుడిసెంటర్)
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి, దామరమడుగు
కొడవలూరు: యల్లాయపాళెం,దాసరిపాళెం,రామాపురం,మిక్కిలింపేట,కొత్తవంగళ్లు, పెద్దపుత్తేడు, గండవరం, నార్తురాజుపాళెం

విడవలూరు: పార్లపల్లి, విడవలూరు, అన్నారెడ్డిపాళెం, ఊటుకూరు, రామతీర్థం, దిన్నే, చవికిచర్ల, పద్మనాభ సత్రం, తలమంచి, దామెగుంట
ఇందుకూరుపేట: నిడుముసలి, కుడితిపాళెం,గంగపట్నం,కొరుటూరు,సోమరాజుపల్లి, రావూరు,జగదేవిపేట, డేవీస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం

నెల్లూరు రూరల్ : చింతారెడ్డిపాళెం, అల్లీపురం, గుడిపల్లిపాడు,నారాయణరెడ్డిపేట, కోడూరుపాడు, కాకుపల్లి, ధనలక్ష్మీపురం, కనపర్తిపాడు,పొదలకూరురోడ్డు, వేదాయపాళెం
నెల్లూరు సిటీ : రోడ్ షో
సర్వేపల్లి నియోజకవర్గం
టీపీ గూడూరు : పొట్లపూడి, విలుకానిపల్లి, కొత్తూరు చింతోపు,మరుపూరు, పేడూరు,పేడూరు ఎస్సీకాలనీ, పాపిరెడ్డిపాళెం, తోటపల్లి గూడూరు,వరిగొండ
ముత్తకూరు: బ్రహ్మదేవి, పొట్టేపాడు,ముత్తకూరు,ఈపూరు వెంక న్నపాళెం
వెంకటాచలం: గుడ్లూరు వారిపాళెం, పూడిపర్తి, సర్వేపల్లి,తిక్కవరప్పాడు, గొలగమూడి, అనికేపల్లి, వెంకటాచలం, కందలపాడు
మనుబోలు : మనుబోలు,మడమనూరు,వీరంపల్లి
పొదలకూరు: పొదలకూరు

వెంకటగిరి నియోజకవర్గం
రాపూరు: గోనుపల్లి, పెనుబర్తి, ఓబులాయపల్లి, ఏపూరు, రావూరు, సిద్ధవరం
బాలాయపల్లి: గొల్లపల్లి, బాలాయపల్లి, వెంగమాంబపురం,మాటమడుగు
వెంకటగిరి : వెంకటగిరి
సూళ్లూరుపేట నియోజకవర్గం
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట (హోలీ క్రాస్‌సెంటర్,
నాయుడుపేట : ఏల్చూరు,కోనేటిరాజుపాళెం,నాయుడుపేట (గోమతీ సర్కిల్,బస్టాండ్ సెంటర్,పాత బస్టాండ్),తిమ్మాజి కండ్రిగ, భీమవరం, పుదూరు

పెళ్లకూరు: పాల్చూరు,అన కవోలు, కలవకూరు, కుల్లూరు, ఉమ్మారెడ్డిగుంట,నెలబల్లి,పెళ్లకూరు, చావలి, శిరసనంబేడు,రాజుపాళెం, చెన్నపనాయుడుపేట, చెంబేడు, పునబాక
ఓజిలి : ఓజిలి,మనమాల, కురుగొండ్ల,గునపాడు,
దొరవారి సత్రం: నెలబల్లి, దొరవారిసత్రం
తడ: కాదలూరు, వెండ్లూరుపాడు, మాంబట్టు, అపాచీ సెంటర్, పులివేంద్ర, తుండూరు, అక్కంపేట, తడ, బీవీపాళెం

సైదాపురం: మర్లపూడి,పోతేగుంట, సైదాపురం
గూడూరు నియోజకవర్గం
చిల్లకూరు: చింతవరం, ఏరూరు, వరగలి క్రాస్‌రోడ్డు, కోట క్రాస్‌రోడ్డు
గూడూరు:తిప్పవరప్పాడు,గూడూరు,చెన్నూరు
చిట్టమూరు: గునపాటిపాళెం,మెట్టు,చిట్టమూరు,ఈశ్వరవాక, మల్లాం, వంజవాక, కర్లపూడి, కొత్తపాళెం
కోట: గూడలి, విద్యానగర్, ఊనుగుంటపాళెం, కోట క్రాస్‌రోడ్డు
వాకాడు: వాకాడు

బ్లాక్‌మెయిల్‌లో కోట్లు గడిస్తున్న ఆదాల

అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెలే ్య ఆదాల ప్రభాకర్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఆధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం వెంకటాచలం మండలం అబ్బిసాహెబ్‌కండ్రిగలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తుకూరులో రిలయన్స్ కంపెనీని బెదిరించి రోడ్డు నిర్మాణంలో రూ.5 కోట్లు దోచుకున్నారన్నారు.

ఎర్రగుంట వద్ద ఏవీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 14 ఎకరాల భూమిలో గ్రావెల్ తవ్వుకుని వారిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పోర్టు రహదారి, జాతీయరహదారి మధ్య ఉన్న 8 ఎకరాల భూమిని, ఇడిమేపల్లి సప్లయి ఛానెల్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రైతుల పంటకాల్వను పూడ్చేస్తున్నా కలెక్టర్ కె.రాంగోపాల్, ఇరిగేషన్ అధికారులు నిద్రపోతు న్నారా అని ఆయన ప్రశ్నించారు.

పంటకాలువను యథావిధిగా ఉంచకపోతే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Friday, October 8, 2010

ఓదార్పుకు నెల్లూరు కార్యకర్తల మద్దతు..పార్టీ కార్యాలయంలో హోమం

నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర షెడ్యూల్ విడుదల చేసిన ఎంపి మేకపాటి

నెల్లూరు బిడ్డకు మగధీర నంది అవార్డు


నెల్లూరు మూలపేట నివాసి, నా బాల్యమిత్రుడు, మగదీర సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆర్.రవీంద్ర కు నంది అవార్డు

Ravindar is the one behind the sets of ‘Aithe’, ‘Morning Raga’, ‘Chatrapati’ (for which he created a 2.5 acre fisherman village set), ‘Okkadunnadu’, ‘Vikramarkudu’, ‘Rakhi’ (recreated an 1803 German loco engine from scrap material), ‘Amma Cheppindi’ (space station), ‘Ashta Chamma’, ‘Anukokunda Oka Roju’, ‘Prayanam’, and now ‘Magadheera’.

He is also working on an international project, ‘Bhopal: A prayer for rain’ based on the infamous Bhopal gas tragedy for which he created a rustic factory and slum set in Bollarum at a cost of Rs.1.4 crore.

Born and brought up in Nellore, he did his bachelors in fine arts from JNTU, Hyderabad, before heading to IIT-Delhi for Masters in designing course. After dabbling in software and web-designing for a brief while “to earn my daily bread” he forayed into tinsel world with ‘Amrutham’ serial.

సింహపురి సింహాలు : రా చూసుకుందాం

మాజీల జోరు..జనం బేజారు!

కార్పొరేషన్‌లో పాలకుల పదవీ కాలం పూర్తయినా అధికారులపై పెత్తనం మాత్రం ఎక్కడా తగ్గినట్లు కనిపించడం లేదు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పేరు చెప్పుకుని అధికార పార్టీకి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో దందా సాగిస్తున్నారు. అధికారులను బెదిరించి పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వివాదాలు మొదలవుతున్నాయి. పాలకవర్గం పదవీ కాలం గత నెల 29వ తేదీన పూర్తయిన విషయం తెలిసిందే. కానీ అధికార పార్టీకి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు మాత్రం ఆ విషయాన్ని మరిచిపోయి తాము అధికారంలో ఉన్నట్లుగానే దర్జా వెలగబెడుతున్నారు. అధికారంలో ఉండగా కార్పొరేషన్ ముఖం చూడని కార్పొరేటర్లు ఇప్పుడు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులతో సమానంగా అనధికారికంగా విధులకు హాజరవుతున్నారు. వీరందరి చేతుల్లో ఎం బుక్కులు, వర్క్ ఆర్డర్లు, అక్రమ లేఔట్ల నమూనాలు, అపార్టుమెంట్ల ప్రణాళిక అనుమతులకు సంబంధించిన పత్రాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ పేరు చెప్పి అధికారులపై వత్తిడి చేస్తున్నారు. గతంలొ వేరే వారు ప్రాతినథ్యం వహించిన డివిజన్లలోనూ ఆధిపత్యం చెలాయంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. మాజీ మేయర్ భానుశ్రీ పేరు చెప్పి ఓ మాజీ కార్పొరేటర్ 27వ డివిజన్‌లో గురువారం గందరోగళం సృష్టించారు. ఈ డివిజన్‌లో ఓ వ్యక్తి వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ఓ గది నిర్మించుకున్నాడు. దీనికి ముందు కూడా అనేక నిర్మాణాలు జరిగాయి. ఆక్రమణలు పెరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం అప్పటి కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి నగర ప్రణాళికాధికారులకు సూచించారు. అధికారులు పట్టించుకోలేదు. అకస్మాత్తుగా గురువారం సదరు మాజీ కార్పొరేటర్ ఒత్తిడితో సిటీ ప్లానర్ తనిఖీల పేరుతో గురువారం వెల్డింగ్ షాపును తొలగించడానికి సిద్ధమయ్యారు. నిన్నటి వరకు ఈ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహించిన బాధ్యతతో ఆయన రంగంలోకి దిగారు. తాను ప్రాతినిథ్యం వహించిన ప్రాంతంలో పక్షపాత వైఖరి అవలంబిస్తే చూస్తూ ఊరుకోలేనని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగిస్తే మొత్తం తొలగించాలని కేవలం కొందరి మెప్పుకోసం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ఉద్యమిస్తానని హెచ్చరించారు. దీనితో ఆ అధికారి వెనుతిరిగి వెళ్లారు. ఇవి బయట పడని సంఘటనలు మాత్రమే. ఇది బయట పడిన సంఘటన మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటివి చాలా జరుగుతున్నట్టు కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. కొందరు మాజీ కార్పొరేటర్లు పనిగట్టుకుని అధికారులను బెదిరిస్తూ అమాయకులకు అన్యాయం చేస్తున్నారని, కార్పొరేషన్‌ను దొడ్డిదారిలో దోచుకుతింటున్నారని చెబుతున్నారు.

స్పీకర్ వద్దకు ప్రసన్న వివాదం

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వివాదం స్పీకర్ ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు చేరింది. గురువారం టీడీపీ విప్ ధూళిపాళ నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రసన్ననను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపి త్వరలో నోటీసు జారీ చేస్తానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. స్పీకర్ నుంచి తాకీదు అందిన తరువాత స్పందిస్తానని ప్రసన్న పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికలు ముగిసిన 15 రోజుల నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపె ౖ ్ట విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ పగ్గాలు సినీ నటుడు బాలకృష్ణకు అప్పగించాలని విలేఖర్ల సమావేశంలో పదే పదే డిమాండ్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ప్రసన్న చేరుతారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు వినిపించాయి.

అసెంబ్లీలోనూ టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడటంతో తిరుగుబాటు అభ్యర్థిగా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హత లేదని, టీడీపీ విప్ నరేంద్రనాథ్ స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఆ తరువాత తెలంగాణ వివా దం చోటుచేసుకోవడంతో ప్రసన్న వివా దం మరుగున పడింది. జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర జరుగనున్న నేపథ్యంలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలు, ఇతర ఆధారాలతో గురువారం మరో సారి టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్‌తో మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అయిన ప్రసన్నను ఎమ్మెల్యే పదవి నుంచి ఎందుకు తొలగించరో చెప్పాలన్నారు. ఇందుకు ఆధారాలు కూడా సమర్పించామని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జగన్, వైఎస్‌లను పొగుడుతూ మాట్లాడటాన్ని వారు తప్పుపట్టారు. ఇది చట్టవిరుద్ధమని స్పీకర్‌గా న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ చట్టపరంగా ఎలాం టి చర్యలు తీసుకోవాలో అదే విధంగా ఉంటాయని, త్వరలో నోటీసు పంపుతానని హామీ ఇచ్చారు. ఇదే విషయా న్ని ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకుపోగా స్పీకర్ నుంచి నోటీసు అందిన తరువాతే మాట్లాడుతానన్నారు.

ఆనం చెప్పిన మాటలు నేడు ఏమైనాయి : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయకపోతే రాజీనామా చేసే ఎమ్మెల్యేల్లో మొదటి సంతకం తనదే అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని కాంగ్రెస్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. జగన్‌ను సీఎం చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పిన వివేకా, ప్రస్తుతం మాట మారుస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కోటంరెడ్డి ఏనాడూ పని చేయలేదని వివేకా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. 14 నెలల ముందు కార్పొరేటర్‌గా డాక్టర్ అనిల్ విజయం సాధించినపుడు ఇందిరా భవన్‌లో వివేకా చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. శ్రీధర్‌రెడ్డి లాంటి ఉద్యమాల పోరాట వీరుడు, వ్యూహకర్త జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరని వివేకా చెప్పారన్నారు. ఇలాంటి నాయకుడు దొరకడు... ఆయన ఉండటం కాంగ్రెస్ పార్టీ అదృష్టం.. ఆయనను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలి.. అని వివేకా నాడు చెప్పారన్నారు. ఆ మాటలు మరచిపోయి ప్రస్తుతం తన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమని చెప్పడం విడ్డూరంగా ఉందని శ్రీధర్‌రెడ్డి చెప్పారు.

ఎవరు మాటలు మారుస్తున్నారనే విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారన్నారు. పార్టీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుందనే విషయాన్ని కార్యకర్తలే చెబుతారన్నారు. తమ తండ్రులు, తాతలు ఎవరూ మంత్రులు కారని... మధ్య తరగతి నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చానని కోటంరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే తాను పాటుపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం జిల్లా ప్రజలు జగన్ రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన యాత్ర విజయవంతమవుతుందని చెప్పారు.

ABN RK Open Heart With Venkaiah Naidu

http://www.teluguhrudayam.com/videos.php?type=embeds&cat=Interviews&mid=2001

Thursday, October 7, 2010

YSR statue in Sullurpet

Ntv - Power Puch Kotam

రేపు ఇందిరాభవన్ ముట్టడి

కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో మంగళవారం కోటంరెడ్డి అనుచరులు ఇందిరాభవన్‌ను ముట్టడించి తాళాలు వేశారు. రెండుగంటలపాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.అయినా ఎవరూ కూడా అడ్డుకోలేదు. కాంగ్రెస్ నేతలంతా మౌనం పాటించారు. బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో కోటంరెడ్డి పీసీసీ చీఫ్ డీఎస్‌ను గురి పెట్టి మాట్లాడారు. శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో ఇందిరాభవన్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకుంటారో చూడాలన్న నిర్ణయంతో పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తున్నారు

. పీసీసీకి సవాల్ విసిరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపా టి చంద్రశేఖర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మ న్ భూమన కరుణాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పీసీసీ చర్యలను తప్పుపట్టి ఘాటుగానే విమర్శలు సంధించారు. జగన్ వర్గీయులు గా ముద్రపడ్డ ముఖ్యనేతలంతా కోటంరెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు.

ఫలించిన వివేకా వ్యూహం

నెల్లూరు నగర కేంద్రంగా కాంగ్రెస్ నేతలు ఆనం వివేకానందరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల మధ్య సాగుతున్న పోరుకు శుభంకార్డు పడినట్లే. వివేకా వ్యూహరచన ఫలించడంతో పీసీసీ కార్యదర్శిగా ఉన్న కోటంరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించారు. దీంతో నగరంలో కాం గ్రెస్ పార్టీపై పూర్తి పెత్తనం ఆనం సోదరులకే కా నున్నది. సస్పెన్షన్‌కు నిరసనగా ఈనెల 8న కోటంరెడ్డి అనుచరులు ఇందిరాభవన్‌ను ముట్టడించనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ డీఎస్‌నే గురి పెట్టి కోటంరెడ్డి అస్త్రాలు సంధిస్తున్నారు.

ఫలించిన వివేకా వ్యూహం
2009 వరకు వివేకా, శ్రీధర్‌రెడ్డి కలిసే ఉండేవారు. ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో కోటంరెడ్డి వివేకాను విభేదించారు. సొంతంగా రాజీవ్‌భవన్‌ను నెలకొల్పి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. నగరాభివృద్ధి పనుల్లో అవినీతిపై ధ్వజమెత్తుతూ వివేకాకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. పార్టీ కార్పొరేటర్లలో చీలికతెచ్చి కొందర్ని తమ వైపు తిప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహిస్తూ వ చ్చారు. వైఎస్ఆర్ మృతి తరువాత జగన్‌కు సంఘీభావం తెలిపారు. జగన్ వర్గం నేతగా కొనసాగుతూ వచ్చారు. ఈ విషయాన్ని పలుసార్లు పీసీసీ దృష్టికి వివేకా తీసుకుపోయారు. కోటంరెడ్డి మాట్లాడే ప్రతి మాటను పీసీసీకి నివేదిస్తూ వచ్చారు. ఈ ఏడాది

ఆగస్టులో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల నరసింహారావు ద్వారా ఓ నివేదికను పీసీసీకి అందచేశారు.
మూడునెలలుగా ప్రయత్నం
మూడు నెలలుగా కోటంరెడ్డిని పార్టీ నుంచి సాగనంపాలని వివేకా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. జగన్‌యాత్ర జిల్లాలో తలపెట్టడడంతో కీలక భూమిక పోషిస్తున్న కోటంరెడ్డిని ఇక ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని పీసీసీపై ఒత్తిడి తీసుకువచ్చారు. వివేకా వ్యూహరచన ఫలించడంతో మంగళవారం కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ప్రకటన విడుదల చేశారు. కోటంరెడ్డి 25 ఏళ్ల పైగా పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులు నిర్వహించారు. చివరకు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయించి వివేకా తనదే పైచేయి అని నిరూపించుకున్నారు. కోటంరెడ్డి సస్పెన్షన్‌తో వీరిద్దరి వివాదానికి తెరపడినట్లుగా పరిశీలకులు అంటున్నారు.

Teacher Sex lessons in Nellore B.ed college

Wednesday, October 6, 2010

షోకాజ్ కు జవాబు ఇవ్వను : కోటంరెడ్డి

జగన్‌కు మద్దతు ఇస్తే సస్పెండ్ చేస్తారా?


షోకాజ్ ఇవ్వకుండానే చర్యలు సబబా?
నెల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి తాళం
కార్యకర్తలను శాంతింపజేసి తాళాలు తెరిచిన శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు, న్యూస్‌లైన్ : యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న ఓదార్పుయాత్రకు మద్దతు పలికినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేయడం తగదని పీసీసీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పీసీసీ ప్రకటించిన అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లను తీవ్రంగా విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న తమపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. మరణ శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక కోరడం మన సంప్రదాయంకాగా, తనకు కేవలం ఫోన్ కాల్‌తో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తగదన్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్ష విధించినా గాంధీభవన్ మెట్ల వద్ద స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైఎస్ చూపిన ప్రేమాభిమానాలవల్లనే చేరువయ్యానని, ఎలాంటి పదవీ పొందలేదని తెలిపారు. తాను జీవితాంతం వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ నిర్దేశకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పారు.

నెల్లూరులో నిరసనలు.. ఆందోళనలు

పీసీసీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న సమాచారం తెలియడంతో నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రాజీవ్‌గాంధీ భవన్‌కు చేరుకుని కోటంరెడ్డికి తమ సంఘీభావం తెలిపారు. అక్కడ నుంచి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఇందిరా భవన్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కోటంరెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కోటంరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసేంత వరకూ తాళాలు తీయబోమని స్పష్టం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కార్యకర్తలను ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఇందిరాభవన్ తాళాలను కోటంరెడ్డి స్వయంగా తీశారు.

సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు: చేవూరు శ్రీధర్‌రెడ్డి

పార్టీ ప్రయోజనాల కోసం పాటు పడుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవడం వల్ల ఒరిగేదీ ఏమీ లేదని వైఎస్సార్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొం టున్న నాయకులను బేబీలుగా ఎమ్మెల్యే వివేకానందరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు

షోకాజ్‌లు కాదు.. ఏకంగా తీసేయాలి : ఆనం వివేకా


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే షోకాజ్‌ నోటీసులు కాదు ఏకంగా పార్టీని తొలగించాలని పిసిసి కార్యదర్శి కోట్టం శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు డిసిసి అధ్యక్షులు గోపాల్‌రెడ్డిని ఉద్దేశించి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి విషయాన్ని ప్రస్తా వించగా ఆయన విషయంలోనూ తన అభిప్రాయం అదేనని చెప్పారు. జగన్‌ ఓదార్పు విషయంలో తమ వైఖరి ఇప్పటికే వెల్లడించామని పేర్కొన్నారు. ఈ విషయంలో స్పందించేందుకు తమ జిల్లాలో ఉద్దండులు ఉన్నారని, ఓ దార్పుపై వారినే అడగండని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటీసులు జారీచేయడం వృథా ప్రాయాసం అని పేర్కొన్నారు. ఏకంగా పార్టీ నుంచి తొలగించే చర్యలే తీసుకోవాలని సూచించారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి సేవ చేసిన వారి విషయంలోనూ ఇలాగే స్పందించాలా అని గోపాల్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించగా అయితే ఏంటి (సో వాట్‌)అని ఆనం స్పందించారు.

పార్టీకి ఎన్నడూ పనిచేయని వారి పార్టీ అధికారంలోకి రాగానే వచ్చి హవా చలాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ జిల్లాలో తొమ్మిది మంది ఎంపీలు, సిడబ్ల్యుసి సభ్యులు ఉన్న ప్రత్యేక జిల్లా అని పేర్కొన్నారు. జిల్లాలో చక్రం తిప్పే నేతగా మీడియా అభివర్ణించే ఆయన సమస్యల సందర్భంలో పార్టీకి అండగా నిలవరని, ఏ సమస్య లేనప్పుడే ఆయన చక్రం తిప్పుతాడని చెప్పారు. ఎవరు ఆయన అని ప్రశ్నించగా మీకు తెలియందా అని బదులిచ్చారు. మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్‌రెడ్డా అని ప్రశ్నించగా నా చేత చెప్పించాలని మీరెందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. తమ బండి ఎద్దులు మాత్రం తమ వద్దనే ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

జగన్ వర్గానికి మరో ఝలక్

జగన్ ఓదార్పు యాత్ర పేరు మీద జిల్లా కాంగ్రెస్‌లో మరో నేతపై వేటు పడింది. ఈసారి నిబంధనలు సైతం బేఖాతరయ్యాయి. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలకడంతోపాటు పార్టీ నాయకులపై విమర్శలు చేసిన నెపంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని పదవి నుండి, ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తూ పిసిసి నిర్ణయం తీసుకుంది. దీనితో జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేగింది. ఈ సంఘటన ఎలాంటి పరిణమాలకు దారితీస్తుందనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవి నుండి తొలగించిన సమాచారాన్ని మంగళవారం వెంకటాచలం మండలం పర్యటనలో ఉన్న కోటంరెడ్డికి ఫోన్ ద్వారా పిసిసి సంయుక్త కార్యదర్శి రాపూరు ఆనంద భాస్కర్ తెలియ జేశారు. పిసిసి తీసుకున్న నిర్ణయంపై కోటంరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యచరణపై వ్యూహం రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అంతకుముందు డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డిపై షోకాజ్ నోటీసులు సంధించిన పిసిసి ఆయన్ను కూడా పార్టీ నుండి సాగనంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ముందు లాంఛనాలన్నీ దాదాపు పూర్తి చేశారు. నేడో రేపో ఆయన విషయంలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో కోటంరెడ్డిపై చర్య తీసుకోవడం కలకలం సృష్టించింది. కోటంరెడ్డి విషయంలో పిసిసి కఠినంగానే వ్యవహరించడం వెనుక జిల్లాకు చెందిన బలమైన వర్గాల హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి, పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్థరరెడ్డి ఇద్దరూ జిల్లాను శాశించే స్థాయిలో ఉన్న రెండు ప్రధాన గ్రూపులకు దూరంగా రాజకీయం నడుపుతున్నారు. దీనితో రెండు వర్గాలకు కూడా శతృవులుగా మారారు. దీనితో ఇద్దరిపైనా ఒకరి తరువాత ఒకరిపై వేటు పడింది. డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరిపై చర్య తీసుకునే విషయంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, అలాగే కోటంరెడ్డి విషయంలో ఆనం వర్గం వత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డిపై వేటు విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడిన తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. ఇదిలావుండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర నుండి అంతర్గత వైరం ఉన్న నేదురుమల్లి సహజంగానే జగన్ విషయంలో దూరంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్న ఆనం వివేకానందరెడ్డి ఆయన తనయుడు జగన్ విషయంలో తేడాగా వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కాగా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఆనం వివేకానందరెడ్డి, నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్లినపుడల్లా జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడిపై వేటు పడుతోందనే ప్రచారం జరగడం విశేషం.

రాజీవ్‌భవన్ నేతల ఆందోళన... ఇందిరాభవన్‌కు తాళాలు

పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షోకాజు నోటీసు జారీ చేస్తూ, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గాంధీభవన్ నుంచి సమాచారం అందటంతో నెల్లూరులోని రాజీవ్‌భవన్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరాభవన్‌కు తాళాలు వేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలనే బరువు బాధ్యతలను భుజాన వేసుకుని పనిచేస్తున్న తనకు అధిష్ఠానం షోకాజు జారీ చేయడం బాధాకరమన్నారు. తాను చేసిన తప్పేమీ లేదన్నారు. 25ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ఎనలేని కృషి చేసిన తనపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో మంగళవారం జగన్ ఓదార్పు యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి తాను హాజరయ్యానని, అదే సమయంలో గాంధీభవన్ నుంచి పిసిసి జనరల్ సెక్రటరీ రాపూరు ఆనంద్ భాస్కర్ వద్ద నుంచి వచ్చిన ఫోన్‌కాల్ ద్వారా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తెలిసిందన్నారు. అధికారికంగా తనకు షోకాజ్ అందలేదన్నారు. ఉరిశిక్ష వేసే ఖైదీకి సైతం ఆఖరికోరిక అడుగుతారని, కానీ తనను మాత్రం వివరణ కోరకుండా ఏకపక్షంగా షోకాజు నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. తాను చేసిన తప్పులను చెప్పకుండా సభ్యత్వం నుంచి తొలగించడం దురదృష్టకరమన్నారు. తనకు ఇప్పటి వరకు ఉత్తర్వుల కాపీ అందలేదని, అందిన తర్వాత స్పందిస్తానని తెలిపారు. కేవలం వైఎస్ జగన్ చేపడుతున్న ఓదార్పుయాత్రకు మద్దతు పలికినందుకే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రలో జరుగుతుందన్నారు. ఇందిరాభవన్ నిర్మాణంలో తన వంతు కృషి చేశానని తెలిపారు. ఇందిరాభవన్‌ను కొందరు నాయకులు ఆక్రమణ చేస్తే, అప్పుడు తాను పోరాడానన్నారు. ఇక నుండి పార్టీకి, తనకు ఎటువంటి సంబంధం లేదని పిసిసి చీఫ్ డిఎస్ ద్వారా తెలుసుకున్న తర్వాత చాలా బాధ వేసిందన్నారు. కోటంరెడ్డిపై వేటు విషయం తెలిసిన రాజీవ్‌భవన్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, జగన్ యువసేన నాయకులు రాజీవ్‌భవన్ నుంచి నల్లజెండాలతో ర్యాలీగా బయలుదేరి ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం లోపల ఉన్న సిబ్బందిని బయటకు పంపించి, ఇందిరాభవన్ గేటుకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించారు. షోకాజు నోటీసును వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇందిరాభవన్‌కు చేరుకుని కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. దీంతో కార్యకర్తలు ముందుగా తాళాలు తీసేందుకు నిరాకరించినా తదుపరి తాళాలు తీశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కనీసం వివరణ అడగకుండా కోటంరెడ్డిపై వేటు వేయడం దారుణమన్నారు. ఖచ్చితంగా వివరణ తెలపాలని, లేని యెడల ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి చీఫ్ డిఎస్, వీరప్ప మొయిలీపై అసభ్యంగా మాట్లాడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ప్రతి ఒక్కరిని వివరణ అడిగి సస్పెండ్ చేశారని, కానీ కోటంరెడ్డిని మాత్రం వివరణ అడగలేదన్నారు. ముందుగా ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో సస్పెన్షన్‌కు నిరసనగా గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. బుధవారం మాగుంట లేఅవుట్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి జగన్ ఓదార్పు యాత్ర విజయవంతం కావాలని చేపడుతున్న పాదయాత్రను పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సస్పెన్షన్‌తో వాయిదా వేసినట్లు మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తాటి వెంకటేశ్వర్లు, నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, పి నాగరాజు, ఆనంద్, జయవర్ధన్, రమేష్, అద్దంకి జగన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రక్కదారి పట్టిన 'ఓదార్పు': నేదురుమిల్లి రాజ్యలక్ష్మి

వైఎస్ మృతి చెందిన తర్వాత ఆయన తనయుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర పక్కదారి పట్టిందని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి విమర్శించారు. మంగళవా రం ఆమె, మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బే రు మండల కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు.అధిష్ఠానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేయడం జగన్‌కు మంచిది కాదని హితవు పలికారు.

అనవసర హం గామాతో చేస్తున్న యాత్ర ఓదార్పు కాదనీ, జగన్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ యాత్ర మృతుల కుటుంబాలకు పరామర్శలా లేదని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్లు ఉందన్నారు. ఇప్పటికైనా జగన్‌లో మార్పురావాలని ఆమె ఆకాంక్షించారు.

ఆనం వివేకనంద రెడ్డి - అప్పుడు ఇప్పుడు మాటలు

Exploring Nellore

Officer harrassment towards lady employees increasing in nellore

Kotamreddy Sridharreddy Suspenson - Part 2

Kotamreddy Sridharreddy Suspenson - Part 1

Discussion about Kotamreddy Sridharreddy Suspenson

Tuesday, October 5, 2010

మంత్రి పదవి కోసం.. ఎవరి ఎత్తులు వారివి

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందో లేదోగాని జిల్లా నుండి మాత్రం కేబినెట్‌లో బెర్తు సాధించే విషయంలో కొత్తకొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. గ్రూపు రాజకీయాల్లో ఆధిపత్య పోరుకు మంత్రి వర్గ విస్తరణ కూడా ఒక ఆయుధంగా మారింది. రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఆనం వర్గం విషయంలో పైచేయి సాధించడం కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనం వర్గాన్ని నిలువరించడమే ధ్యేయంగా చేస్తున్న ప్రయత్నం కావడంతో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కూడా ఆయనకు మద్దతు పలికారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆదాల తన నియోజకవర్గంలో కన్నా రాజధానిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. విస్తరణ జరిగితే బెర్తు ఖాయమని ఆదాల వర్గం భావిస్తోంది. అయితే పలుసార్లు విస్తరణ జరుగుతుందనే వాతావరణం కనిపించినా ఆచరణలోకి రాకపోవడం ఆదాల వర్గాన్ని అసహనానికి గురి చేస్తోంది. ఆదాల మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అన్ని శక్తులను సమీకరించుకుని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా ఇప్పటి వరకు అధిష్టానం వద్ద పట్టు నిలుపుకోవడమే ధ్యేయంగా జాగ్రత్తలు తీసుకున్న ఆనం వర్గం తమ పరిస్థితి కుదుటపడినట్లు కనిపించడంతో పావులు కదపడం ప్రారంభించారు. జిల్లాకు మరో మంత్రి పదవి మంజూరయితే దానిని ఆదాలకు దక్కకుండా చేయాలని ఆనం వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే కేవలం నాలుగునెలల్లో పదవీ కాలం ముగియననున్న ఎమ్మెల్యే బూదాటి రాధయ్యను తెరపైకి తెచ్చేందుకు బహుముఖ ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం కేవలం 4 నెలలే ఉన్నప్పటికీ ఐఎన్‌టియుసి నేతగా ఉన్నత స్థాయిలో ఉన్న పలుకుబడితో మళ్లీ నామినేట్ చేయించుకుంటారనే ధీమాతో ఆనం వర్గం ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిసి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం చేయడం ద్వారా రాజీవ్ భవన్ నేతలను కంగు తినిపించడంతోపాటు ఆదాలకు చెక్ పెట్టేందుకు ఇదో మార్గంగా ఆనం వర్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆశీస్సులు ఉన్న రాధయ్య అవసరమైతే రీ నామినేట్ చేయించుకోగలరని ఆనం వర్గం భావిస్తోంది. రెండు రోజుల క్రితం ఇందిరాభవన్‌లో జరిగిన మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సదస్సుకు బూదాటి సారద్ధ్యం వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించడం, ఆయన హాజరు కావడం ఈ కొత్త వాదనకు బలం చేకూరుతోంది.

నెల్లూరు నగరాని ఊరిస్తున్న విమానాశ్రయం

నేటి యాంత్రిక యుగానికి తగ్గట్టుగా సమాజం అడుగులేస్తోంది. కాలంతోపాటు మనిషి పడుగెడుతున్నాడు. వేగంగా గమ్య స్థానాలకు చేరాలని ప్రతిఒక్కరూ ఉబలాటపడుతుంటారు. ఇప్పటివరకు జిల్లా ప్రజలు రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే కొంతకాలంగా విమానయానం జిల్లా వాసులను ఊరడిస్తున్నది. అదిగో...అక్కడ.. ఇదిగో..ఇక్కడ విమానాశ్రయం...అంటూ నేతలు ఆశచూపారు. చివరకు జనం ఆశలను వమ్ముచేశారు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతి ఎంపీ చింతా మోహన్ నెల్లూరు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీన్ని వెంకటాచలం సమీపంలో నిర్మించాలని కేంద్ర పౌర విమానాయాన శాఖ అధికారులను కలిసి అభ్యర్థించారు. త్వరలో అధికారులు స్థలపరిశీలనకు రానున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నెల్లూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లే.

పారిశ్రామికంగా పరుగులు
కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు నుంచి నెల్లూరు నగరానికి మహర్దశ పట్టింది. లక్ష కోట్లతో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతోపాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా భారీ సంఖ్యలోనే వస్తున్నాయి. ఈ పరిశ్రమల ఆధారంగా నెల్లూరు నగరంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు సాగనున్నాయి. అపార్ట్‌మెంట్స్, మొబైల్ రంగం ఇతరత్రా వ్యాపారాలన్నీ పుంజుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. పారిశ్రామిక వేత్తలు తరచూ నెల్లూరుకు విచ్చేసి పరిశ్రమల ఏర్పాటుపై చర్చించి పురోగతిని పరిశీలిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం 150 కి.మీ దూరంలో ఉన్న తిరుపతి విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మూడు గంటల పాటు ప్రయాణించి విమానాశ్రయానికి చేరుకోవడం పారిశ్రామిక వేత్తలకు చాలా ఇబ్బందిగా మారుతోంది.

దీంతోపాటు జిల్లా రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది. జిల్లా నుంచి ఎందరో నేతలు ఇతరచోట్ల్ల ఎంపీలుగా చలామణి అవుతున్నారు. ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన వారూ జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు తరచూ హైదరాబాద్, ఢిల్లీలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నెల్లూరు నగరానికి విమానాశ్రయం లేకపోవడం జిల్లావాసులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రోడ్డు, రైల్వే మార్గాలు అనుకూలంగా ఉన్నా, గంటల కొద్ది ప్రయాణించాల్సి రావడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

ఎంవోయూ ఒప్పందం రద్దు
2008లో దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. రూ. 10వేల కోట్లతో నిర్మించే కిసాన్‌సెజ్ ఆధారంగా ఈ విమానాశ్రయాన్ని నెలకొల్పాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. పాడి, మత్స్య, వ్యవసాయ పరిశోధన తదితర వాటిని ఈ సెజ్‌లో ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు. దామవరం వద్ద విమానాశ్రయానికి రెండువేల ఎకరాల భూమి కూడా కేటాయించారు. మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కంపెనీ ముందుకు వచ్చి ఇక్కడ విమానాశ్రయం నెలకొల్పాలని ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. కాని ఎంతకీ ఈ సంస్థ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది జూన్ 22న ఈ ఎంవోయూను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నెల్లూరుకు విమాన సౌకర్యం లేదని ప్రజలు నిరాశ పడ్డారు.

'చింతా' ప్రకటనతో చిగురించిన ఆశలు
కృష్ణపట్నం పోర్టు, మన్నవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నెల్లూరు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు అవసరం ఉందని తిరుపతి ఎంపీ చింతా మోహన్ ఇటీవల ప్రకటించారు. వెంకటాచలం సమీపంలోనే ఈ మినీ విమానాశ్రయం నెలకొల్పేందుకు ఇప్పటికే ఆయన కేంద్ర పౌర విమానాయాన శాఖ అధికారులతో చర్చలు జరిపామని చెప్పారు. సా«ధ్యసాధ్యాలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించగా, త్వరలో ఓ బృందం నెల్లూరుకు వచ్చి పరిశీలించి వెళ్లనున్నట్లు సమాచారం.

Monday, October 4, 2010

సస్పెండ్ చేసినా భయపడం....కోటంరెడ్డి ధ్వజం

షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లకు భయపడేది లేదని, డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీచేయడం దారుణమని పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతిస్తున్న నాయకులను వేధిస్తూ కాంగ్రెస్ పార్టీ వినాశనానికి కంకణం కట్టుకున్న నాయకులను మాత్రం వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం స్థానిక రాజీవ్‌గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిసిసి చీఫ్ శ్రీనివాస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని, టిడిపి, పిఆర్‌పికి వెళ్ళమని డిసిసి అధ్యక్షులు ఎల్లసిరి అనలేదన్నారు. ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందని, కార్యకర్తలు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని మాత్రమే చెప్పారని అన్నారు. గోపాల్‌రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాలని, వ్యక్తిగత యాత్రలో పాల్గొనవద్దని పిసిసి హెచ్చరించడం దారుణమన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్ళిన డిఎస్‌కు డిపాజిట్‌లు కూడా దక్కవని, ముఖ్యమంత్రి రోశయ్యను ఖబడ్దార్ అని, తెలంగాణా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు రాకపోతే స్వీట్లు పంపిణీ చేసిన వారిపై, వీరప్పమొయిలీపై అసభ్యంగా మాట్లాడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇవన్నీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రావా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని కొందరు నాయకులు విమర్శిస్తే షోకాజ్, సస్పెన్షను, డిస్మిస్‌లు ఏమీ ఉండవా అని అన్నారు. జగన్ వెంట నడిచిన నాయకులకు షోకాజ్‌లు ఇస్తూ పోతే, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు శాశ్వత షోకాజ్ ఇస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు సర్వనాశనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు కళ్లుగా ఉండాల్సిన పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సమాధి కడుతున్నారో తెలియడం లేదన్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల అసభ్యంగా మాట్లాడితే డిఎస్‌కి కనపడలేదా అని అన్నారు. నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులకు పదవులు ఇవ్వకుండా, ఊసరవెల్లిలా విమర్శలు చేస్తున్న తులసిరెడ్డికి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, డిఎస్, రోశయ్యకు ధైర్యం ఉంటే మొట్టమొదటి సారిగా కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి దగ్గుబాటి పురంధ్రేశ్వరికి వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని మాట్లాడిన డిఎల్ రవీంద్రరెడ్డికి షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ గురించి నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా సిఎం వారిని ప్రోత్సహించడం దారుణం అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఒకటి, రెండు చోట్ల ఓదార్పు యాత్రలో పాల్గొంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ ఫార్మర్స్ ట్రస్టు చైర్మన్ మాద్దాలి శరణ్‌కుమార్ వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటుకు అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలాగే 42వ డివిజన్‌లోని సుబేదారుపేటలో సుమారు 100మంది యూత్ నాయకులు జగన్ యాత్రకు మద్దతు ఇస్తామని ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, తారీక్, పి నాగరాజు, నూరుద్దీన్, బాలాజి, వంశీ, ఉడతా ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో వైఎస్‌కు ఆలయం

రాష్ట్రంలో ఒకవైపు వైఎస్ విగ్రహాల జాతర సాగుతుండగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏకంగా ఆ యనకు ఆలయం నిర్మిస్తున్నారు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా లోగడ వైఎస్ ఈ గ్రామానికి వచ్చారు. అప్పుడు వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశా రు.

ఇందులో పాఠశాల అదనపు భవనాల కోసం చేసిన విజ్ఞప్తిపై ఆయన తక్షణం స్పందించారు. రూ.12 లక్షలు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామస్థులతో సహపంక్తి భోజనంచేసి, రాత్రి అక్కడే బసచేశారు. అటుపైన పేదలకు 400 పక్కాఇళ్లు, 500 మందికి పింఛన్ మంజూరు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్న గ్రామస్థులు ఇప్పుడు ఆలయం నిర్మిస్తున్నారు.

Saturday, October 2, 2010

వైయస్ జగన్ క్యాంప్ పై చర్యల వెనక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ?

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నెల్లూరు జిల్లా నాయకులపై కాంగ్రెసు అధిష్టానం ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం వెనక కాంగ్రెసు సీనియర్ నాయకుడు నేదురమల్లి జనార్దన్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్రలో పాల్గొన్న ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై గానీ శాసనసభ్యుడు శివరామిరెడ్డిపై గానీ అధిష్టానం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి రోశయ్యపై, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శానససభ్యురాలు కొండా సురేఖపై కూడా కఠినమైన చర్యలేవీ తీసుకోలేదు. కానీ, నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డిలకు, మరో ఇద్దరు నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభం కాక ముందే వారిపై చర్యలు తీసుకోవడం వెనక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు.

నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి క్షణం పడేది కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సరైన అవకాశాలు దక్కకుండా వైయస్ ప్రధాన పాత్ర పోషించారని అంటారు. అలాగే, నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం వెనక వైయస్ పాత్ర ఉందని చెబుతారు. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లికి వ్యతిరేకంగా వైయస్ తన సొంత లాబీని బలంగా తయారు చేశారు. దీంతో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. మంత్రి రామనారాయణ రెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదు. వారిని బుజ్జగించడానికి వైయస్ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకే ఎసరు పెట్టేందుకు నేదురుమల్లి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మేకపాటి బ్రదర్స్ కు షోకాజ్ నోటీసులు

కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు పెద్ద షాకే తగిలింది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభం కాక ముందే పట్టు బిగించేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న నాయకులకు ఎఐసిసి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కి పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సమయంలోనే ఎఐసిసి మేకపాటి బ్రదర్స్ కు మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డికి, నాయకులు శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, తమకు షోకాజ్ నోటీసులు అందలేదని వారంటున్నారు. గతంలో డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కూడా తమకు నోటీసు అందలేదని చెప్పారు. ఆ తర్వాత అందినట్లు అంగీకరించారు. ప్రస్తుత షోకాజ్ నోటీసుల ప్రభావం జగన్ నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

వెంకటగిరి పోలేరమ్మ జాతర హుండీ రాబడి

సెప్టెంబర్‌ 29,30 తేదిల్లో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం శుక్రవారం స్ధానిక ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగింది. ఈ హుండీ లెక్కింపు ద్వారా మొత్తం 5,46,488 రూపాయల రాబడి వచ్చినట్లు ఆలయ ఈవో రామచంద్రయ్య తెలిపారు. ఇందులో 30రూ దర్శన టిక్కెట్లు ద్వారా 1,40,590రూ, 100రూ ప్రత్యేక దర్శన టికెట్ల ద్వారా 42,400రూలు, దాతల విరాళాల ద్వారా 6,034 రూలు హుండి రాబడి 3,52,460 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో హుండీ రాబడితో పోలిస్తే ఈసారి హుండి రాబడి రెట్టింపుగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్‌ పులికృష్ణారెడ్డి, సభ్యులు జానకిరామయ్య, శ్రీహరికోట కృష్ణయ్య, మురళి పాల్గొన్నారు.

వైభవంగా ముగిసిన పోలేరమ్మజాతర

వేలాది మంది భక్తుల మధ్య గురువారం సాయంత్రం నిమజ్జనోత్సవంతో వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రతి ఏడు మాదిరిగా ఈసారి కూడా జాతర సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి కుమ్మరివీధిలోని అమ్మవారి పుట్టిల్లుగా భావించే కుమ్మరింట్లో అమ్మవారి విగ్రహం తయారు చేసి, అర్ధరాత్రి పనె్నండు గంటల సమయంలో అత్తవారి ఇల్లు ఉన్న జీనిగలవారివీధికి నిరాడంబరంగా తీసుకొచ్చారు. కాంపాళెంలో గాలిగంటల పూజ అనంతరం అమ్మవారికి కళ్లు, దిష్టి చుక్క పెట్టి అలంకరించారు. చప్పరంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి విద్యుత్ దీపాలు, దివిటీల వెలుతురులో భాజా భజంత్రీల మధ్య వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గురువారం తెల్లవారేప్పటికి అమ్మవారి విగ్రహం పట్టణ నడుబొడ్డులోని గుడికి చేరుకుంది. గురువారం సాయంత్రం వరకు అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారికంగా అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అమ్మవారి గుడికి ప్రక్కన బలి ఇచ్చారు. దాని రక్తంతో కలిపిన అన్నం పొలిగా వెంకటగిరి పొలిమేరల్లో వెదజల్లారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సస్యశ్యామలంగా పండాలని ఈ పొలి వెదజల్లడం ఇక్కడ ఆనవాయితీ. బుధ, గురువారాల్లో గ్రామశక్తికి మొక్కుబడుల పేరుతో వందల సంఖ్యలో పొట్టేళ్లు, మేకలు, వేల సంఖ్యలో కోళ్లు బలి ఇచ్చారు. మద్యనిషేధం ఉన్నా మద్యం అమ్మకాలు చాటుమాటుగా సాగాయి. అమ్మవారిని దర్శించింన ప్రముఖుల్లో టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసారత్నం, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్, తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ కృష్ణమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, డీఎస్పీ నారాయణరెడ్డి, తహశీల్దార్ సుశీల ఉన్నారు. జాతర సందర్భంగా నెల్లూరు డిఆర్ ఉత్తం అధినేత కొడవలూరు ధనుంజయరెడ్డి భక్తులకు భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
దర్శనంలో భక్తులకు ఇబ్బందులు
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గుడి వద్ద నానా అవస్థలు పడ్డారు. అనుకున్న విధంగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిసారి మాదిరిగా ఈసారి కూడా తోపులాట మొదలైంది. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించి తమ బంధువులు, డిపార్టుమెంటువారికి దర్శనం చేయించడంతోనే డ్యూటీ ముగిసింది. క్యూలో వృద్ధులు, చిన్నారులు ఎండలో నిలబడి కేకలు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక సంఖ్యలో జంతు బలి
ఈ సంవత్సరం అనుకున్న దానికంటే బంతుబలి అధికంగా జరిగింది. ఒక పక్క జంతుబలి చేయరాదని బ్లూక్రాస్ సొసైటీ, పోలీసులు సంయుక్తంగా చేసిన సూచనలను ఆ చెవిన విని ఈ చెవిన వదిలేసినట్లు ప్రజలు వ్యవహరించారు. గురువారం పట్టణంలో వేల సంఖ్యలో బలి జరిగినా బ్లూక్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన శ్లాటర్ హౌస్‌లో 100 లోపల మాత్రమే జంతువులను బలి చేశారు.

BSNL Dasara offers

దసరా పండుగను పురస్కరించుకుని బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు స్పెషల్ ఆఫర్లు అందిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజరు జి గోపి తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆఫర్లు అక్టోబరు 7వ తేదీ నుంచి 17 వరకు ఉంటాయన్నారు. 3జి డేటా ప్లాన్ రూ. 2756 నుంచి రూ. 1499కు తగ్గించామన్నారు. 3జి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఛార్జీలు తగ్గించామని అన్నారు. గతంలో ల్యాండ్‌లైన్ ఉన్న వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షను కేవలం రూ. 499కే అందిస్తున్నామన్నారు. కొత్తగా తీసుకున్న వారికి కేవలం రూ. 625కే అందిస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు రూ. 2500 విలువచేసే డేటాకార్డు తీసుకుంటే 200 రూపాయలు విలువ చేసే సిమ్‌కార్డు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు బ్రాడ్‌బ్యాండ్ తీసుకున్న వారికి మొదటి 15రోజులు అన్‌లిమిటెడ్ ఉచితం, గేమ్స్ ఆన్ డిమాండ్, మ్యూజిక్ ఆన్ డిమాండ్ అందజేస్తున్నామన్నారు. గతంలో విల్‌ఫోన్ లైఫ్‌టైమ్ ప్లానుకి రూ. 200కు బదులుగా 49 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఎజిఎం మాలకొండారెడ్డికి బెస్ట్ పెర్ఫార్మింగ్ జెఎస్‌సి అవార్డును డిజిపి అరవింద్‌రావు చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. టాప్ అప్ రీఛార్జి, స్పెషల్ ఓచర్లుపై ఫుల్ టాక్‌టైం అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిజిఎం సిఎం జె శ్రీనివాసరావు, డిజిఎం ఫైనాన్స్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Robo Movie Ticket Rs.1000

నెల్లూరు నగరంలో లీలామహల్, కృష్ణ, అర్చన, నర్తకి థియేటర్లలో రోబో సిని మాను ప్రదర్శించారు. ప్రపంచంలోని అన్ని థియేటర్లతో పాటు ఇక్కడ కూడా ఒకటో తేదీన సినిమాను ప్రదర్శించడం మొదలెట్టారు. రూ. పది టిక్కెట్టు వంద, రూ.30 టిక్కెట్టు రూ.350, రూ.60 టిక్కెట్టు రూ.వెయ్యికి విక్రయించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాలుగు థియేటర్ల వద్దఇదే తంతు కొనసాగింది.

సినీ మాఫియా
నెల్లూరులోని ఓ సినీ మాఫియా ఉంది. పెద్ద నటుల సినిమాలను కొన్ని థియేటర్లు మాత్రమే తీసుకుంటాయి. ఇందుకు ఎన్నికోట్లయినా వెచ్చిస్తారు. హక్కులు తీసుకుంటారు. ఇక బ్లాక్ టిక్కెట్ల పర్వం మొదలవుతుంది. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే. ఆయా థియేటర్లలో బ్లాక్ పర్వాన్ని కొనసాగిస్తారు. లేకుంటే సదరు సినిమాను ఒక్క థియేటర్‌కే పరిమితం చేస్తారు. అప్పుడు కూడా బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని కొనసాగిస్తారు. వీరి దెబ్బకు మిగిలిన థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తట్టుకునే పరిస్థితిలో లేరు.

రోబోకు టిక్కెట్లు లేవ్.!
రోబో సినిమాకు వారం రోజులు ముందు నుంచి బుకింగ్‌లు ప్రారంభమ య్యాయి. నెల్లూరులో మాత్రం ఒక్క రోజు ముందు మాత్రమే కొన్ని టిక్కెట్లను ఇచ్చి కౌంటర్లు క్లోజ్ చేస్తారు. సినిమా చూద్దామని ఆనందంగా థియేటర్ల వద్దకు వెళ్ళి క్యూలో బారులు తీరినా ప్రయోజనం శూన్యం. టిక్కెట్లన్నింటిని థియేటర్ల యాజమాన్యం వారి సిబ్బందితో బయటకు పంపిస్తారు. రూ. పది రూపాయల టిక్కెట్టు 70 రూపాయలకు వారికి ఇస్తారు. ఆపై ఎంతొచ్చినా వారిదే.

పత్తాలేని పోలీసులు
రోబో సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా థియేటర్ల వద్ద పోలీసుల ఊసే లేదు. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి తెరతీసి అభిమానులు ఎగబడుతున్న తరుణంలోనూ థియేటర్ల సమీపాలక కూడా రాలేదు. ఒకటి, రెండు థియేటర్లు వద్ద ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని వెంటనే వదిలిపెట్టారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్దకు రాకుండా ఉండేందుకు సినిమాను బట్టి పోలీసులకూ ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడంలో సినీ మాఫియాకు సాటెవ్వరూ లేదనేది నిర్విదాంశం.

ఆశకు పోతే నిరాశ
రోబో సినిమా చూద్దామని అభిమానులకు ఎందరికో నిరాశ ఎదురైంది. ఇప్పటికే వారం రోజుల పాటు టిక్కెట్లు లేవనే ప్రచారం మొదలు పెట్టారు. కానీ అన్ని టిక్కెట్లు అమ్మిన దాఖలాలు లేవు. సగానికి సగం ప్రేక్షకుల చేతికి చేరలేదు.

ఎక్కువ షోలు వేస్తే థియేటర్ సీజ్ చేస్తాం: సౌరబ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ రోబో సినిమాను ప్రభుత్వం నిర్ణయించిన షోల కంటే ఎక్కువగా ప్రదర్శిస్తే థియేటర్లను సీజ్ చేస్తాం. నెల్లూరు, కావలి, గూడూరు డివిజన్‌లలో శనివారం నుంచి సినిమా హాళ్ళ దగ్గర డిప్యూటీ తహసిల్దార్లను బ్లాక్ టి క్కెట్లపై నిఘా ఉంచుతాం. బ్లాక్ టిక్కెట్ల సమాచారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియచేయాలి. నెల్లూరు నగరంలో వేస్తున్న సినిమా హాళ్ళు వివరాలు, ప్రదర్శిస్తున్న షోల వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటాం. థియేటర్లలో పారిశుథ్యం నిర్వహణపై తనిఖీలు నిర్వహిస్తాం.

Friday, October 1, 2010

Sokaj Notice to Nellore DCC Chief Gopal Reddy

ఓదార్పులో పాల్గొంటా : నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి

వ్యక్తిగత హోదాలోనే నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రలో పాల్గొంటానని నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ బలోపేతమయ్యే ఏ కార్యక్రమంలోనైనా విధిగా తాను పాల్గొంటానన్నారు. ఓదార్పు అవసరమని అధిష్టానమే గుర్తించిందని, అందుకే ఏఐసీసీ తరఫున వైఎస్ మరణానంతరం చనిపోయినవారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి నిర్ణయించిందని వివరించారు. పార్టీ చేపట్టబోయే ఓదార్పును కూడా జగన్‌తో కలిసి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో జరిగిన సమావేశానికి హాజరైన ఎల్లసిరి మీడియాతో మాట్లాడారు. ఓదార్పుయాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చినందుకు పీసీసీ నుంచి గతంలో మీకు షోకాజ్ ఇచ్చారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, వివరణ మాత్రమే కోరారని ఎల్లసిరి తెలిపారు. వ్యక్తిగత హోదాలోనే అప్పుడు పార్టీ నేతలను కోరానని పీసీసీకి వివరించానని చెప్పారు. ఓదార్పుయాత్రతో పార్టీకి బలం చేకూరుతుందన్నారు. 2014లో సోనియాగాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని, రాష్ట్రంనుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు పార్టీ గెలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ కుటుంబం లేకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం ఎంత కష్టమో రాష్ట్రంలో వైఎస్ కుటుంబం లేని కాంగ్రెస్ కూడా అంతేనని ఆయన విశ్లేషించారు. తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు జగన్‌లో చూసుకుంటున్నారని వివరించారు.

మంత్రి ‘ఆనం’ స్వగ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి భూమి పూజ

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి స్వగ్రామమైన చింతారెడ్డిపాళెంలో గురువారం సాయంత్రం దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక నేతలు ఎంబేటి చినబాబు, పి.శ్రావణ్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ అకాల మరణంతో తాము కుటుంబ సభ్యుడిని కోల్పోయినబాధను అనుభవిస్తున్నామన్నారు. ఈ విగ్రహాన్ని యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదు ప్రారంభిస్తామన్నారు. అంతేకాక జిల్లాలో నిర్వహించే ఓదార్పు యాత్రను కూడా విజయవంతం చేస్తామని సృష్టం చేశారు. జగన్ కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.

ఆస్తి వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే పోలేరమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె (మొదటి భార్య కూతురు) కవిత తమకు ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందంటూ నిరసనకు దిగింది. వెంకటగిరిలోని ఎమ్మెల్యే ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగడం ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు 1983లో కురుగొండ్ల రామకృష్ణకు వెంకటరత్నమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 1993లో రామకృష్ణ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 1996లో సింధు అనే మరో యువతితో రామకృష్ణకు వివాహమైంది.

వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మొదటి భార్య తల్లిదండ్రులు రామకృష్ణకు వివాహ సంద ర్భంలో అర ఎకరా పొలాన్ని (నాయుడుపేటలోని) రాసి ఇచ్చారు. విడాకులిచ్చే సమయంలో రామకృష్ణ ఆ అరెకరాలో మూడవ వంతు వారికి రాతపూర్వకంగా ఇస్తానని చెప్పినట్లు కవిత చెబుతోంది. అయితే ఈ విషయమై పలుసార్లు ఆయన చుట్టూ తిరిగినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్యే కావడంతో అధికార, ధనబలంతో తమను లెక్కచేయకపోవడమే కాకుండా తమకు చెందాల్సిన ఆస్తిని ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై గురువారం ఆమె ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఎమ్మెల్యే ఆమెను ఇంట్లోకి పిలిపించారు. దీంతో మీడియా కూడా అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేవలం తనపై కొందరు కక్ష కట్టుకుని ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

తాను ఆస్తి వ్యవహారం ఎప్పుడో సెటిల్‌ చేసుకున్నానని, తాను రాసిచ్చాను అనడం సరికాదన్నారు. న్యాయపరంగా తాను రాసిచ్చినట్లు రుజువైతే తాను వారికి రూపాయి చెల్లించాల్సి ఉంటే రెట్టింపుగా రూ.2లుగా చెల్లిస్తానని చెప్పారు. వెంకటగిరి జాతర జరుగుతున్న సందర్భంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని, దీని వెనుక కుట్ర దాగివుందని చెప్పి ఆయన కారులో వెళ్లిపోయారు. దీంతో కవిత కారుకు అడ్డు తగలడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ మీడియా చూస్తుండగానే తన తండ్రి ప్రవర్తించిన తీరును గమనించాలని చెప్పింది. తమ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాను ఎంతవరకైనా పోరాడుతానని ఆమె పేర్కొంది.