నేడు నెల్లూరు

Friday, April 30, 2010

నగర కాంగ్రెస్‌లో దుమారం

గత అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో కాం గ్రెస్ వర్గపోరు నివ్వురుకప్పిన నిప్పులా లోలోపల నాయకుల మధ్యే రగులు తూ వచ్చింది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేదురుమల్లి జనరల్ స్థానంగా మారిన నెల్లూరు టికెట్‌ను ఆశించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మిలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగించగా, చివ రికి మేకపాటినే నెల్లూరు పార్లమెంట్ టికెట్ వరించింది. అసెంబ్లీ టికెట్ల పంపిణీలో కూడా నేదురుమల్లికి కొంత చుక్కెదురై అసెంబ్లీ స్థానాల్లో నేదురు మల్లి అనుచరులకు టికెట్లు లభించ లేదు. ముఖ్యంగా గూడూరు టికెట్ తనను కాదని పనబాక కృష్ణయ్య తె చ్చుకోవడం నేదురుమల్లి జీర్ణించు కోలేకపోయారు. ఎన్నికల్లో బహిరం గంగా పన బాకను ఓడించాంటూ ప్రచారం చేశారని, ఎన్నికల అనంతరం పార్టీకి ఫిర్యాదులు వెళ్లాయి.

కాంగ్రెస్ అభ్యర్థి పనబాక కృష్ణయ్య పీసీసీ అ«ధ్యక్షుడు డి.శ్రీనివాస్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలకు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. నేదురుమల్లి సీడబ్ల్యూసీ మెంబరు కావడంతో తన పరిధిలో లేదని పీసీసీ అధ్యక్షుడు తెలపడంతో పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాంధీకి నివేదికలు ఇచ్చారు. దీనిపై విచారణ జరపా లంటూ సోనియాగాంధీ పార్టీ నాయ కులను ఆదేశించారు. ఇక అప్పటి నుంచి జిల్లాలో వర్గపోరు తీవ్రమైంది. ఆనం సోదరులు, నేదురుమల్లి వర్గాల మధ్య రోజు రోజుకు విభేదాలు జోరందుకోవడంతో రెండు గ్రూపు లుగా కాంగ్రెస్ నాయకులు మారారు. నేదురుమల్లికి మద్దతుగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు వ్యవహ రిస్తుండగా, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మేకపాటి వర్గీయులు ప్రస్తుతం ఆనం సోదరులతో జత కట్టారు.

నేదు రుమల్లి సోదరుల మధ్య ఎన్‌బీకేఆర్ విద్యా సంస్థల వివాదాన్ని వర్గపోరుకు వేదికగా మలిచారు. నేదురుమల్లి పద్మనాభరెడ్డికి పనబాక కృష్ణయ్య, రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు మద్దతుగా నిలిచి సీఎం రోశ య్యను కలిసి జనార్దన్‌రెడ్డిపై ఫిర్యా దులు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నెల రోజులు గడిచినా దీనిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. సోనియాను కలిసిన పనబాక లక్ష్మి
కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాం««ధీని ఢిల్లీలో కలిశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా రాజకీయాల వరకు తానే నాయకుడని, కాంగ్రెస్‌కు పెద్ద దిక్కునంటూ చెప్పుకునే నేదురుమల్లి జిల్లాలో పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమికి ఆయనదే బాధ్యతని సోనియా దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. చిల్లకూరు, కోట సెజ్‌లలో బినామీల పేరుతో ఆయన అనుచరులు ప్రభుత్వ సొమ్మును కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.

ముఖ్య అనుచ రులుగా ఉన్న ఐదుగురిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారని, గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ నివేదికలు బహిర్గతం చేయాలన్నారు. ఇదే విధంగా వదిలేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికైనా నేదురు మల్లిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. నేదురుమల్లిపై సోనియాకు పనబాక లక్ష్మి ఫిర్యాదు చేయడం జిల్లాలో కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చనీయాంశమైంది.

సీఎం పర్యటనకు తప్పని వర్గపోరు
మే 2న నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్న సీఎం కె.రోశయ్య పర్యటనకు కాంగ్రెస్ వర్గపోరు వీడడం లేదు. గురువారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను సందర్శించారు. ఏర్పా ట్లపై అధికారులతో చర్చించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఓ రోజంతా సీఎం నెల్లూరులో గడప నుండడంతో ఆ మేరకు కార్యక్రమాలు రూపొందించే పనిలో మంత్రి బిజీబిజీగా గడిపారు.

జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజీవ్ భవన్ నాయకుల నేతృత్వంలో శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లపై పరిశీలించ నున్నారు. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల నాయకులు ఇలా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించడం అధికారులకు తలనొప్పిగా మారనున్నది. రెండు వర్గాలు సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పోటా పోటిగా ప్రచారాలు చేస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న రోశయ్యకు కాంగ్రెస్ వర్గపోరు ఎలా స్వాగతం చెబుతుందో వేచి చూడాల్సిందే.

రోశయ్య పర్యటన కోసం నగరానికి మెరుగులు

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పర్యటన కోసం నెల్లూరు నగరం ముస్తాబవుతోంది. ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడిన ముఖ్యమంత్రి పర్యటన ఎట్టకేలకు ఖరారయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా నగరానికి వస్తున్న రోశయ్య దాదాపు 26 గంటలు గడుపుతారు. అయితే అందులో కేవలం మూడు గంటలు మాత్రమే అధికార అనధికార కార్యక్రమాల్లో గడుపుతారు. ఇందులో అరగంట పాటు అధికారులు, అనధికారులతో సమీక్ష జరుపుతారు. గంటన్నర సేపు ప్రారంభోత్సవ కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఒక గంట సేపు వైశ్య ప్రముఖులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన ఆయన పర్యటనా కాలాన్ని రిజర్వులో ఉంచారు. రాష్టమ్రంతటా 5వ విడత భూపంపిణీ కార్యక్రమం నిర్వహించినప్పటికీ ముఖ్యమంత్రి రాకకోసం జిల్లాలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్ఠానంతో జరిగిన చర్చల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో మూడుసార్లు ఆయన పర్యటన రద్దయింది. చివరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారయింది. దీనితో నగరంలో హడావుడి ఊపందుకుంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నింటికీ మోక్షం లభిస్తోంది. పలుచోట్ల మురికి కాలువలు కూడా శుభ్రపడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం పినాకినీ అతిథి గృహాన్ని సందర్శించారు. విఆర్‌సి మైదానంలో జరిగే బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. మూడు దఫాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్న అధికారులు చివరకు తేదీ ఖరారు కావడంతో వాటిని సవరించుకుంటున్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పర్యటన కేవలం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సాగుతున్నట్టుగా ప్రచారం జరగడంతో ఆనం వ్యతిరేక వర్గం తమ ఉనికిని చాటుకోవడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి తొలి పర్యటనలో అంతా ఆనం సోదరులు హవా కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే విషయంపై చర్చ జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటన జరిగినపుడు చేసే ప్రచారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిథులందరికీ స్థానం లభించేది. గ్రూపు తగాదాలున్నప్పటికీ తన రాకముందే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వాటిని సర్దుబాటు చేసేవారు. ఈ దఫా ప్రచారంలో కొంతమందిని విస్మరించినట్లు కనిపిస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు పోస్టర్లలో అంతా ఆనం సోదరులు, వారికి అనుకూలంగా ఉన్నవారి ముఖాలే కనిపించేలా ఏర్పాట్లు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఆదివారం మధ్యాహ్నం 12. 30 నుండి సాయంత్రం 6 గంటల వరకు రిజర్వు సమయాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Wednesday, April 28, 2010

మాఫియా మాయ... మోసపోతున్న వాహనదారులు

40 ఏళ్ల క్రితం సైకిల్‌ వున్న వ్యక్తిని సంపన్నుడుగా భావించేవారు. నాటి రోజుల నుండి నేటి రోజులకు పోలిస్తే ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతూ కాలక్రమేణా సైకిల్‌ స్థానంలో కారు గలవాడే నేడు సంపన్నుడుగా చలామణి అవుతున్నాడు. కాని ప్రస్తుతం ద్విచక్ర వాహనం (బైక్‌) అనేది సైకిల్‌లాగా నేటి రోజులను బట్టి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ నగరంలో చూసినా, ఏ పల్లెలో చూసినా రయ్‌మని దూసుకుపోయే మోటార్‌ సైకిళ్లు, కార్లు, ఆటోలు నేడు కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి వాయువేగంతో నడిచేందుకు ప్రతిఒక్కరూ ఇష్టపడుతున్న నేటి రోజుల్లో వాహనం లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి నేటి ఆధునిక మానవుడికి ఏర్పడింది. నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటే వాటికి అవసరమైన కొన్ని లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలను జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ బంకుల్లో అమ్మకాలు చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకా కొలతల్లో తేడాలు చేయడమే గాక, వీటిని కల్తీ చేయడానికి ఒక మాఫియా తయారైంది.

వీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజల జేబులను చిల్లు గొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 200 వరకు పెట్రోలు బంకులు ఉన్నాయి. వీరు నెలకు 50 లక్షల లీటర్ల పెట్రోలు, రెండు కోట్ల లీటర్ల వరకు డీజిల్‌ అమ్మకాలు అధికారికంగా సాగిస్తున్నారు. అనధికారికంగా సాగే అమ్మకాలకు వీరి వద్ద లెక్కే ఉండదు. కొలతల్లో తేడాలు, కల్తీలతో లీటర్‌కు రూ.5ల నుండి రూ.10ల వరకు అదనంగా ఆదాయాలను ఈ పెట్రోల్‌ బంకులవారు సంపాదిస్తున్నారు. దీని అంచనా ప్రకారం నెలకు కోట్ల రూపాయల్లో జనం సొమ్మును స్వాహా చేస్తున్నారు. లెక్కలు చూపకుండానే వీరు జరిపే అమ్మకాలు, చిల్లర అమ్మకాలు, ఇతర మోసాల కారణంగా మరింత సొమ్మును ఈ మాఫియా ముఠా జేబుల్లోకి నింపుకుంటుంది. వ్యాట్‌ ప్రకారం ప్రతి పెట్రోలు ఉత్పత్తుల డీలర్లు ఆర్‌సిలు కలిగి ఉండాలి.

అయితే మన జిల్లాలో ఆర్‌సిలను రద్దు చేయించుకుని ఎంతకు కొంటున్నది, ఎంతకు అమ్ముతున్నది అనేటువంటి లెక్కలు లేవని సమాచారం. దీంతో అక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. వాహనదారులకు పెట్రోలు, డీజిలు పట్టిన తర్వాత ఆ బంకువారు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాల్సిన అవసరముంది. కాని బిల్లులు ఇచ్చే పరిస్థితిలో చాలా బంకులు నిర్లక్ష్యం చూపిస్తున్నాయి. పెట్రోల్‌ బంకుల ముందు తాము కల్తీలు చేయడం లేదని, కొలతలు సక్రమంగా ఉన్నాయని పరీక్ష చేసిన వారి పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం మభ్యపెట్టడం తప్ప ఇంకేమీలేదు. ఏదైనా అధికారులు హడావుడి జరిగితే సక్రమంగా చేయడం, తర్వాత వారిష్టమొచ్చినట్లు వారి పేర్లు రాయడం ఆనవాయితీ. పాలిష్‌ క్లాత్‌, గ్రీస్‌, బ్రేక్‌ ఆయిలు, ఇంజన్‌ ఆయిల్‌ వంటి అమ్మకాలపై పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి వున్నా, వాటిపై పట్టించుకునే అధికారే లేడు.

వీటిపై దాదాపు జిల్లాలో ఎలాంటి కేసులు కూడా అధికారులు నమోదు చేసినట్లు దాఖలాలు లేవు. జిల్లాకు అత్యంత సమీపంలో ఉన్న చెనై్న నుండి ప్రతి నిత్యం వందల కొలది ఆయిల్‌ ట్యాంకర్లు నగరానికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి ఆయిల్‌ ట్యాంకర్లు నగరానికి ఆయిల్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ ఆయిల్‌ ట్యాంకర్లను తీసుకొచ్చే సమయంలో కొంతమంది నిర్వాహకులు మార్గమధ్యంలోనే ట్యాంకర్లను ఆపి అందులోవున్న డీజిల్‌, పెట్రోల్‌ను వేరే క్యానుల్లోకి మార్చి అక్కడే అమ్మకాలు జరిపి, వాటి స్థానంలో కిరోసిన్‌ వంటి వాటిని కలపడం నిత్యకృత్యమైపోయింది. వారు కలిపింది పోగా ఆ ట్యాంకర్‌ సంబంధిత పెట్రోలు బంకుకు చేరుకోగానే ఆ బంకువారు ఆయిల్‌ అన్‌లోడ్‌ చేసుకున్న తదుపరి వారి కోటా ప్రకారం వారు కూడా కిరోసిన్‌ను కల్తీ చేయడం షరామామూలైపోయింది. ‘

తిలాపాపం తలో పిడికెడు’ అన్నట్లుగా డీజిల్‌, పెట్రోల్‌లో బంకు యజమానులు, ఆయిల్‌ ట్యాంకర్‌ నిర్వాహకులు కల్తీ చేయడం వల్ల ఆ ఆయిల్‌ పోసుకున్న వాహనదారులు వాహనాల లైఫ్‌ అతి తక్కువ కాలానికే పడిపోయి నానా ఇక్కట్లు పడుతున్నారు. అంతేగాక కంప్యూటర్‌ రీడింగ్‌ని చూపిస్తూ ఆయిల్‌ పట్టడమే గాక మాన్యువల్‌ ప్రకారం కూడా ఆయిల్‌ పడుతూ లీటర్‌కు ఎటువంటి పరిస్థితుల్లో కనీసం 2 ఎంఎల్‌ అయినా సరే తగ్గించి పట్టడం నేడు జిల్లా మొత్తం జరుగుతున్న తంతు.

దీనిపై పెట్రోలు పట్టే కుర్రవాడిని ఇదేమిటని అడిగితే మాకు వచ్చేది ఆ ఒక్క ఎంఎల్లేసారా అంటూ సమాధానం ఇస్తున్నాడు. రోజుకు వందల వాహనాలు లక్షల్లో పెట్రోలు, డీజిల్‌ పట్టించుకుంటూ పోతుంటే వీరు మిగిల్చుకుంటున్న 1ఎంఎల్‌, 2ఎంఎల్‌ సరాసరి వారు డ్యూటీ దిగే సమయానికి వందల లీటర్ల రూపంలో మిగిల్చుకుంటున్నారు. అటు కల్తీ చేసి బంకు యజమానులు, ఇటు ఆయిల్‌ మిగిల్చుకుంటూ బంకు కుర్రాళ్లు, ఆయిల్‌ ట్యాంకర్‌తో ఆయిల్‌ తెచ్చే ట్యాంకర్‌ నిర్వాహకులు చేసే కల్తీ వీరందరి మోసాలకు వాహనదారులు నేడు బలైపోతున్నారు. ప్రభుత్వాధికారులు దీనిపై చొరవ చూపి నిఘావుంచి, వారిపై సరైన చర్యలు తీసుకుంటే నిత్యావసర వస్తువుగా ఉన్న డీజిల్‌, పెట్రోలు ప్రతి ఒక్క వాహనాదారుడికి మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సిఎం పర్యటన పేరుతో దండకాలు

రాష్టమ్రుఖ్యమంత్రి కె.రోశయ్య జిల్లా పర్యటన వ్యాపారులకు సంకటంగా మారింది. మే నెల 2వ తేదీన ఆయన పర్యటన దాదాపుగా ఖరారు కావడంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దండకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వ్యాపార వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక నేత వసూళ్లలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోట్లాది రూపాయల దండకాలే ధ్యేయంగా ఆయన వ్యవహరించడం వ్యాపారులకు మింగుడు పడని విధంగా తయారైంది. నగరంలో కాంగ్రెస్‌ పార్టీలో పట్టున్న ఒక వర్గానికి సన్నిహితంగా మెలిగే నాయకుడు కావడంతో వ్యాపారులు ఆయన అడిగినంత మొత్తం ఇచ్చుకోలేక, కాదనలేక సతమతం అవుతున్నారు.

రాష్టమ్రుఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న రోశయ్యను ఘనంగా స్వాగతం పలకాలని, సత్కరించాలని ఒక సామాజిక వర్గం నిర్ణయించింది. దీంతో అధికారపార్టీకి చెందిన నగరంలోని ప్రముఖ నేత సూచన మేరకే ఈ దండకాలు ప్రారంభించినట్లు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన నేత ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకమారు సమావేశం ఏర్పాటుచేసి వ్యాపార వర్గాలకు ఇండెంట్లు ఫిక్స్‌ చేశారు. దీనికి ఏమాత్రం పైసా కూడా తగ్గేది లేదంటూ హుకుం జారీ చేశారు. ఆయనకు సన్నిహితంగా మెలిగే మరికొందరు ఛోటా నేతలు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇంకేముంది వ్యాపారుల వద్దకు చేరుకుని తమ వెంటనే డబ్బులు ముట్టజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని, తాము ప్రత్యేకంగా సన్మానం చేయాలన్నా ఇంత పెద్ద ఎత్తున నిధులు అవసరం రావని ఒక నేత విచారం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వ్యాపారులు నేరుగా సదరు నేత దృష్టికి తీసుకువెళ్లి తమకు కేటాయించిన మొత్తాలను కొంత తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసుకున్నారు.

అయితే ఈ ప్రతిపాదనను ససేమిరా ఒప్పుకోక పోవడమే కాకుండా మన వాడు ముఖ్యమంత్రి అయితే డబ్బు ఇవ్వడానికి వెనుకాడతారా, రేపు ఏదైనా సమస్య వస్తే మాదగ్గరికి ఎలా వస్తారో చూస్తానని ఆయన రుసరుసలాడినట్లు తెలిసింది. వ్యాపారాలు చేసే సమయంలో ఒకటో రెండో లొసుగులు తప్పనిసరిగా ఉంటాయని, నగరంలో పట్టున్న నేతకు సన్నిహితంగా ఈ వ్యక్తి మెలుగుతుండటంతో కాదనే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈ విషయాన్ని సదరు సీనియర్‌ నేత దృష్టిలో పెట్టేందుకు కూడా వ్యాపార వర్గాలు వెనుకాడుతున్నాయి. మొత్తం మీద సిఎం రోశయ్య పర్యటన చిన్నచిన్న వ్యాపారులకు, ముఖ్యంగా స్టోన్‌హౌస్‌పేటలో హోల్‌సేల్‌ వ్యాపారులకు చిక్కులను తెచ్చిపెట్టింది.

ప్రజాసమస్యలు గాలికి వదిలి వ్యక్తిగత ప్రతిష్టలకే పట్టం

నెల్లూరు కార్పొరేషన్‌గా మారి సుమారు ఐదేళ్లు కావడంతోపాటు మరికొద్ది నెలల్లో తిరిగి కార్పొరేషన్‌ ఎన్నికలు రానుండడం తెలిసిందే. ఇప్పటివరకు కార్పొరేషన్‌లో జరిగిన ప్రతి చర్చల్లో అజెండాల్లోనూ, బడ్జెట్‌ సమావేశాల్లోనూ, సాధారణ సమావేశాల్లోనూ ప్రజాసమస్యలను మేయర్‌ ముందుంచి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన కార్పొరేటర్లు వ్యక్తిగత ప్రతిష్టలకే ప్రాధాన్యమిస్తూ, కేవలం వారి అధినాయకత్వం నుండి అందుతున్న ఆదేశాల మేరకే కార్పొరేషన్‌లో చర్చలు జరగడం శోచనీయం.

ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ సమస్యలను కార్పొరేషన్‌లో ఉంచి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తలచి కార్పొరేటర్లను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ సంగతి మరచని కార్పొరేటర్లు వర్గాల వారీగా తయారవడమే కాకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి ఎవరిపాటికివారు గ్రూపులుగా మారి సమావేశం మొదలుకాగానే ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ సమావేశాన్ని జరగనీయకుండా చివరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సమావేశం అయిపోయిందనిపిస్తున్నారు. ఎంతో బాధ్యతగా, గౌరవంగా మెలగాల్సిన కార్పొరేటర్లు నువ్వు, నేను, వాడు అంటూ సంబోధించుకుంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ముష్టి యుద్ధాలకు తలపడే విధంగా వ్యవహరించే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రసారాలు, పత్రిల్లో వస్తున్న కథనాలు చూస్తుంటే నగర ప్రజల్లో వీరిపట్ల తీవ్ర వ్యతిరేకభావంతోపాటు, అసలు కార్పొరేటర్లు అంటేనే ఛీకొట్టే పరిస్థితి నెలకొనివుంది.

మేయర్‌లను మార్చడంతోపాటు ప్రస్తుతం మేయర్‌కు కార్పొరేషన్‌లో వర్గాలుగా ఏర్పడి కార్పొరేటర్లు మద్దతు ఇవ్వకపోవడమేగాక ఏకవచనంతో పిలుస్తూ విచక్షణ కోల్పోవడంతోపాటు కేవలం ఆగ్రహావేశాలకే పరిమితం అవుతూ ఎంతసేపటికీ ప్రచార సాధనాల్లో తాము కనపడాలని వివిధ రకాల ప్రయత్నాలు చేయడం కూడా ప్రజలకు కార్పొరేటర్లు అంటేనే ఏవగింపు ఏర్పడే పరిస్థితి నెలకొనివుంది. గడచిన ఐదేళ్లలో ప్రజాసమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు నగరమంతా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగి ఐదు లక్షల జనాభాకు పైగా నెల్లూరు నగరం చేరుకోవడం జరిగింది.

దీనికి సంబంధించి ప్రజలకు అవసరమైన పనులను నెరవేర్చడంలో కార్పొరేషన్‌ పూర్తిగా విఫలమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నప్పటికీ గత రెండు రోజుల కిందట కార్పొరేషన్‌లో జరిగిన బడ్జెట్‌ సమావేశం, సాధారణ సమావేశాల్లో కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. నగరంలోని నడిబొడ్డులోని కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలం వచ్చిందంటే మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడం జగమెరిగిన సత్యమే. అలాగే కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు, పైపులు సక్రమంగా లేకపోవడంతో అవి పగిలి మంచినీటిలో కలిసి ప్రజలు రోగాలబారిన పడుతున్న సంఘటనలు ప్రతి ఏడాది జరుగుతున్నా, కార్పొరేషన్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు లేవు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు సూచనలిచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాగే నగరంలో ఏ సందూ గొందూ చూసినా, మురుగునీరు కాలువల నుండి పొంగి ప్రవహించడంతోపాటు పలు రోడ్లు దుర్వాసనను వెదజల్లుతుంటాయి.

ఇది ఒక ఎతె్తైతే, అదే వీధుల్లో చెత్తా చెదారాలు ప్రతి ఇంటిముందు కుప్పలు కుప్పులుగా దర్శనమిస్తూ ప్రజలు రోగాలకు కేంద్రాలుగా మారి ఉన్నాయనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే పలు డివిజన్లలో విద్యుత్‌ లైట్లు కొన్ని నెలలు, సంవత్సరాలుగా వెలగకపోయినప్పటికీ సదరు ఆ కార్పొరేటర్లు పట్టించుకోవడంగాని, సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ లైట్లను వేయించే ప్రయత్నం కూడా చేపట్టకపోవడం శోచనీయం. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు సైతం జరుగుతున్న సంఘటన లు కోకొల్లలు. ప్రతిసారి డివిజన్లలో నెలకొనివున్న సమస్యలను కార్పొరేషన్‌ సమావేశాల్లో చర్చిస్తామన్న ఉద్దేశ్యం ఏఒక్క కార్పొరేటర్‌కి లేకపోవడం శోచనీయం. ప్రతిఒక్క కార్పొరేటర్‌ తమ డివిజన్లకు ఏ మేరకు నిధులు కేటాయించారు? ఏ మేరకు కమిషన్లు వస్తాయి? అన్న విషయాలపై దృష్టి సారించినంత శ్రద్ధ ప్రజాసమస్యలపై సారించడంలేదన్న వ్యాఖ్యలు నగరంలో వినిపిస్తున్నాయి.

నగరంలో నిత్యం వేలాదిమంది చుట్టుపక్కల గ్రామాల నుండి, నగరాల నుండి ప్రజలు నెల్లూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం వీరి సౌకర్యార్థం మరుగుదొడ్లు కూడా నగరంలో లేకపోవడం సిగ్గుచేటు. ఫలితంగా ఎక్కడ ఖాళీ ప్రాంతం కనపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ దుర్వాసనను వెదజల్లుతుంటాయి. ఇకపోతే కార్పొరేషన్‌గా మారి ఐదేళ్లు అవుతున్నప్పటికీ, మళ్లీ నాలుగైదు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు రాబోతున్నప్పటికీ ఐదు లక్షల జనాభా దాటుతున్నప్పటికీ, గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయంలోని సిబ్బందే ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రజాసమస్యలపై దృష్టి సారించి వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Monday, April 26, 2010

ఆక్యు'ప్రెజర్'తో దోపిడీ

జిల్లాలో ఆక్యుప్రెజర్ వైద్యం పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏటా రూ. 10 కోట్లకు పైగానే ఈ వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. రెండేళ్ల నుంచి గొలుసుకట్టు విధానంతో నెట్‌వర్క్‌లోకి చేరి పేదలు, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నారు. వేలకువేలు జీతాలు, కార్లు ఆశచూపి నిరుద్యోగులను ఆశలపల్లకీ ఎక్కిస్తున్నారు. ప్రజల రోగాల బలహీనతలను గుర్తించి పరికరాలు, మందులు అంటగట్టి ఎంచక్కా సొమ్ము చేసుకుంటు న్నారు. ఈ వైద్యం శాస్త్రీయంకాదని వైద్య నిపుణులు ఎంత మొత్తు కుంటున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చాప కింద నీరులా ఈ దోపిడీ ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితం కాగా, నేడు పల్లెలకు పాకుతోంది.

ఆక్యుప్రెజర్ వైద్యమంటే...
మనకు ఇప్పటివరకు ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, అల్లో పతి, నేచురోపతి వైద్యవిధానాలు అందు బాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా అందుబాటులో ఉంది. ఈ వైద్య విధానం చైనా, జపాన్ తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ వైద్యవి«ధానంలో శరీరభాగాలపై సూదులతో గుచ్చి వ్యాధులను నయం చేస్తారు.

దీని నుంచే ఆక్యుప్రెజర్ వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కూడా తొలుత చైనాలోనే ప్రవేశ పెట్టారు. మనిషి నాడి వ్యవస్థపై ప్రెజర్(ఒత్తిడి) తీసుకువచ్చి రోగాలు నయం చేస్తామని రెండేళ్లుగా జిల్లాలో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. చేతులు, కాళ్లలో ఉన్న నరాల్లోకి లేజర్ కిరణాలు పంపి ఓ పరికరంతో గుచ్చుతారు. ఎక్కడ నొప్పి అనిపిస్తే ఆ భాగాన్ని లెక్కించి భవిష్యత్‌లో వచ్చే రోగాలను ముందుగానే తెలియ జేస్తున్నామని ప్రజల్ని నమ్మిస్తారు.

వివిధ కంపెనీలు తయారు చేసిన పరికరాలను ఆ వ్యక్తులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. వాకింగ్ చేయాల్సిన పని లేకుండానే, ఆ మిషన్ పై నిలపడితే కుదుపుల తో నడక సాగించినంత ఫలితం కలుగుతుందని చెబుతారు. అలాగే ఒబెసిటీకి కూడా ఇలాంటి మిషన్‌ను చూపి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇలా రకరకాల చిన్నపాటి పరికరాలను రోగులకు అందిస్తారు. రూ. 14 వేల నుంచి రూ. 60వేల వరకు ఈ మిషన్లకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఒకరి నుంచి మరొకరి గొలుసుకట్టు విధానంలో నెట్‌వర్క్‌లోకి సభ్యులుగా చేర్చుకుని అమ్మకాలు సాగిస్తారు. ఇలా రెండేళ్లుగా జిల్లాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

మోసపోతున్న నిరుద్యోగులు
ఆక్యుప్రెజర్ వైద్యం పేరిట నిరుద్యోగులకు వల వేస్తారు. వారి మాటల చాత్యురంతో నిరుద్యోగులను ఆకట్టుకుని నెలకు వేలకు వేలు జీతాలని నమ్మిస్తారు. కార్లు, విదేశీ టూర్లు, ఒకటేమిటి...మీ జీవితాన్నే మార్చేస్తామని చెబుతారు. వన్ స్టార్ నుంచి సెవన్ స్టార్ వరకు, ఆపై గోల్డ్ లైన్, బ్రాంజ్ లైన్‌కు చేరితే కోటీశ్వర్లు అయిపోవచ్చని ఊరిస్తారు.

చదువుతో పనిలేకుండా ఇతరులను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తే చాలని తెలియ చేస్తారు. అదే వారికి అర్హత. నిరుద్యో గులు, మహిళలు వీరి వలలో పడి మోసపోతున్నారు. వేలకు వేలు డబ్బు లను ధారబోసి ఆ పరికరాలను కొని గొలుసుకట్టు నెట్‌వర్క్‌లో ఎదగలే కుండా దిగాలుపడుతున్నారు. తదు పరి వ్యక్తులు సభ్యులుగా చేరితేనే సిరులు కురిపిస్తాయి. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి...అక్కడే అన్నట్లుగా వీరి జీవితాలు మారుతున్నాయి.

ఏ రోగం అయినా నయం
షుగర్, బీపీ, కొలస్ట్రాల్, ఆర్థరైటీస్, సైనసైటిస్, మైగ్రేన్, నడుం, కాళ్లు, మెడ నొప్పులు, కీళ్లు అరగడం, గ్యాస్ స్ట్రైసీస్, ఆస్మా, థైరాయిడ్, అల్సర్ తదితర రోగాలన్ని ఆక్యుప్రెజర్ వైద్యంతో నయమవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇవి కాకుండా హెచ్ఐవీ, క్యాన్సర్ రోగాలు కూడా అదుపులో ఉంచుతామని నమ్మిస్తారు. వచ్చిన రోగాలే కాకుండా భవిష్యత్‌లో వచ్చే రోగాలను ముందస్తుగా గుర్తించి ఇప్పటి నుంచే వైద్యం ప్రారంభించా లని మాటల చాతుర్యంతో ఆకట్టుకుం టారు. చైనా నుంచి దిగుమతి చేసు కున్న కొన్ని మిషన్ల ద్వారానే (ప్రెజర్) ఈ రోగాలన్నీ నయమవుతాయని, వీటికిి సపోర్టుగా కొన్ని మందులను వాడాల్సి ఉంటుందని చెబుతారు.

ఇవి కాకుండా వంటపాత్రలు ప్రత్యేకంగా తయారు చేసిన వాటిని అందిస్తారు. ఇలా ఒక రోగి నుంచి రూ. 60వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమా చారం. సూళ్లూరుపేట, నాయుడు పేట, గూడూరు, నెల్లూరు, కావలి పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ వైద్యం పల్లెలకు ఎగబాకుతోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే కొన్ని బోగస్ సంస్థల ద్వారా ప్రజలు మోసపోయినట్లే జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నలుగురు కార్పొరేటర్లపై పోలీ సులు నిఘా

నెల్లూరు నగరంలో నలుగురు కార్పొరేటర్లపై పోలీ సులు నిఘా వేసినట్లు సమా చారం. వీరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తు న్నారు. నాలుగో నగర పోలీసు స్టేషన్ పరిధిలో కొన్ని హోటళ్లను ఆసరాగా చేసుకుని ఆ నలుగురు కార్పొరేటర్లు బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లు సమాచారం. కార్పొరేటర్ల సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్ జరుగు తోందని పోలీసులు గుర్తించారు.

వీరంతా కడప, బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రా లుగా ఈ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పరిశీ లించిన పోలీసులు ఫోన్ ద్వారా బెట్టింగ్ వ్యవహారాలు ట్రాప్ చేయ గలిగారు. ఈ విషయాన్ని పసిగట్టిన కార్పొరేటర్లు కొన్ని సెల్‌ఫోన్ల నెంబర్లను వాడకుండా నిలిపివేశారు. వేరే సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు పక్కా ఆధారాల కోసం ప్రత్యేక నిఘా బృందాల చేత పరిశీలన చేస్తున్నారు. సాక్ష్యాలు సేకరించే ప్ర యత్నంలో ఉన్నారు. ఈ నలుగురు కార్పొరేటర్ల బెట్టింగ్ వ్యవహారం కోట్ల రూపాయల్లో సాగుతుందన్న అనుమా నాలున్నాయి.

సింహపురి సిరిమల్లెలు - ప్రత్యేక కథనం

రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా!’ అంటూ అనార్కలి చిత్రంలోని ఘంటసాల గానాన్ని హిందూళ రాగంలో మధురంగా ఆలపిస్తుంటే, ‘దినకరా...శుభకరా!’ అంటూ ఉదయరాగ గానంతో మురిపిస్తుంటే విని మైమరచిపోయిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఎవరయ్యా ఈ అభినవ ఘంటసాల? అని ప్రశంసించారట. అప్పటి నుంచి సింహపురి ప్రజలచే పాటూరు శ్రీనివాసులు అభినవ ఘంటసాలగా ఖ్యాతి పొంది ఆపాత మధురాలైన నాటి తెలుగు సినీపాటలకు పెట్టింది పేరుగా రాష్టస్థ్రాయిలో గౌరవాన్ని అందుకుంటున్నారు. 1942 ఫిబ్రవరి 17న పాటూరు లక్ష్మీనరసయ్య, వెంకట శేషమ్మల ముద్దుల తనయుడైన పాటూరు శ్రీనివాసులు ఇంటిపేరులోనే ‘పాట’ను పొందుపరచుకుని చిన్ననాటి నుంచే ఘంటసాలకు ఏకలవ్య శిష్యుడయ్యాడు. బాల్యంలోనే పాఠశాలలో పాటల శ్రీనివాసులుగా అందరి అభిమానాన్ని సంపాదించారు. ఆయన అన్న యతిరాజులు కూడా మంచి గాయకుడు కావడంతో తన తమ్ముడిలో దాగివున్న గాయకుడిని గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు.

విఆర్‌.కళాశాలలో బిఎ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎ, ఆ తర్వాత బియిడి పూర్తి చేసిన శ్రీనివాసులు ప్రముఖ హార్మోనియం విద్వాంసులు గుర్రాల శ్రీనివాసులునాయుడు ప్రోత్సాహంతో సినీ సంగీత కచ్చేరీలను నిర్వహించడం ప్రారంభించారు. 1960లో తొలిసారిగా అల్లూరులో జరిగిన రాష్టస్థ్రాయి సినీసంగీత పోటీల్లో పాల్గొని ప్రధమ బహుమతిని పొందారు. ఆ తర్వాత నేటి ప్రఖ్యాత సినీ నేపధ్య గాయకులు పద్మశ్రీ ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు సభ్యులుగా ఉంటున్న నెల్లూరు మ్యూజికల్‌ అసోసియేషన్‌లో సభ్యుడుగా చే రి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అనేక సినీ సంగీత కచ్చేరీలను చేశారు. 1970లో తాను తన వాయిద్య మిత్రబృందంతో కలసి ‘సింహపురి ఆర్కెస్ట్రా’ను స్థాపించి రాష్ట్రంలోనే గాక రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా సంగీత కచ్చేరీలను నిర్వహిస్తూ వచ్చారు. దాదాపు ఆరు వేలకు పైగా సంగీత కచ్చేరీలను నిర్వహించిన ఘనుడుగా పేరు పొందారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వంటివారి చేతుల మీదుగా ఘన సన్మానాలను అందుకున్నారు.

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీమణులు పి.సుశీల, జిక్కి, ఎస్‌.జానకి, ఎల్‌ఆర్‌.ఈశ్వరి వంటి వారితో కలసి పలు సంగీత కచ్చేరీల్లో పాల్గొన్న మేటి గాయకుడుగా రాష్ట్రంలో ప్రసిద్ధి కెక్కారు. సింహపురి ఆర్కెస్ట్రా ద్వారా ఎందరో గాయనీగాయకులకు శిక్షణ ఇచ్చి నేడు మేటి గాయనీగాయకులుగా ప్రఖ్యాతి పొందేందుకు దోహదపడ్డారు. స్వరసమ్రాట్‌ ఎస్‌.రాజేశ్వరరావు వంటి సినీ సంగీత దర్శకులను ఆహ్వానించి తన సంస్థ ద్వారా ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు అందుకున్నారు. సింహపురి లలితకళా సమితి రఘుపతి ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించిన సందర్భంగా ఘంటసాల, ముఖ్య అతిధి పిబి.శ్రీనివాస్‌ల సమక్షంలో సంగీత కచ్చేరీని నిర్వహించి వారి ఆశీస్సులందుకోవడం గొప్ప విశేషం. అలాగే 2003లో హైదరాబాద్‌ జ్యోతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారిచే ఘనసత్కారాన్ని పొంది సంగీత సేవారత్న, గానరత్న వంటి బిరుద సత్కారాలను అందుకున్నారు.

ఐదువేల కచ్చేరీలను పూర్తి చేసిన సందర్భంగా కేత అంకులు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ జరిగింది. 2005లో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌-రవీంద్రభారతిలో జరిగిన ఘంటసాల వర్ధంతి సభలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు, నటి జమున, నర్తకి శోభానాయుడుల చేతులమీదుగా ఘన సన్మానాన్ని పొందడం విశేషం. వీరి సతీమణి రుక్మిణీదేవి భర్తకు తగిన భార్యామణిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డునందు కోవడం మరో విశేషం. ఆరువేల కచ్చేరీలు పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాసులును నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు ఆవరణంలో కళాకారుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్‌కుమార్‌, రామ్మూర్తి ఆధ్వర్యంలో కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ వాకాటి నారాయణరెడ్డి, అప్పటి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకాటి నారాయణరెడ్డి రూ.10 వేలను గౌరవ ఆర్థిక పురస్కారంగా అందజేశారు. ఆ ధనాన్ని వెంటనే కళాకారుల సమాఖ్య అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం పాటూరు శ్రీనివాసులు కళా హృదయానికి నిలువెత్తు నిదర్శనం.

రావోయి బంగారు మామా, వెన్నెలలోనే వేడి ఏలనో, చల్లగ చూడాలి పూలను అందునకుపోవాలి, నీ మూగచూపేలా. భలే మంచిరోజు, రాగమూ రావే, నన్ను దోచుకుందువటే, ఆకాశవీధిలో, హిమగిరి సొగసులు, నిన్నలేని అందమేదో, హాయి హాయిగా ఆమనిసాగే, ఓ నెలరాజా, ఆలయాన వెలసిన బొమ్మను చేసి ప్రాణం పోసి, బహుదూరపు బాటసారి, పొన్నకాయ వంటి పోలీసెంకటసామి, విన్నవించుకోనా, కృష్ణాముకుందా మురారీ, అయినదేమో అయినదిచెలీ, రావే నాచెలియా, ఓ సజీవ శిల్పసుందరీ, శిలలపై శిల్పాలు, కిలకిల నవ్వులు విరిసిన అలల కలలపై తేలే, ఈ నల్లనిరాళ్లలో, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని, ప్రేమయాత్రలకు బృందావనము, నమో భూతనాధా, నాలోని రాగమీవే, పగటి పూట చంద్రబింబం, గోరింక గూటికే వంటి వేలాది ఘంటసాల మధుర గీతాలను, పుష్పవిలాపం పద్యాలను, భగవ ద్గీత శ్లోకాలను, తెలుగుదనం తొణికిసలాడే గళంతో మధురంగా గానం చేసి శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాటూరి శ్రీనివాసులు 65 ఏళ్ల వయసు పైడినా, మాధుర్యం చెదరని గాత్రంతో నేటికీ గాయకుడుగా విశేష ప్రజాభిమానాన్ని పొందుతుండడం సింహపురికే గర్వకారణం.

Saturday, April 24, 2010

ప్రజాపధం లో తనదైన శైలిలో ఆనం వివేకా -2

మత్తెక్కిస్తున్న డాబాలు ... నెత్తురోడుతున్న జాతీయ రహదారులు

జాతీయరహదారిపై..

జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే నేడు చాలా వరకు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి నేడు నెలకొనివుంది. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందంటే నేరుగా వారు యమపురికి టిక్కెట్టు పొందినట్లే . నాలుగు లైన్ల జాతీయరహదారి వచ్చిన తరువాత వాహనాలు వేగానికి అంతే లేకుండా పోయింది. ఈ వాహనాల వేగానికి అడ్డుకట్ట వేయవలసిన పోలీసు శాఖ, రవాణా శాఖ పట్టించుకొనే పరిస్ధితిలో లేరు. దీనికి తోడు మద్యంసేవించి వాహనాలు నడుపరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ దానిని అమలు పరచే నాధుడే లేడు. జాతీయరహదారి జిల్లాలో దాదాపు 190 కిలోమీటర్లు ఉంది . అయితే జాతీయరహదారిపై జిల్లాలో మొత్తం డాబాలు సుమారు 100పై చిలుకు ఉండటం విశేషం.

జాతీయరహదారిపై తిరిగే వాహన చోదకుల కోసం ఏర్పడిన ఈ డాబాలు అంచెలంచెలుగా ఎదిగి బార్‌ అండ్‌ రెస్టారెంటులుగా ఏర్పడ్డాయి. వీటిని నిరోధించాల్సిన పోలీసుశాఖ మాత్రం అధికారులు ఛీవాట్లు పెట్టినపుడు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించటం షరామామూలుగా ఉంది. ప్రతి నెలా పోలీసు అధికారులకు టంచనుగా వేలకు వేలు అందించే ఈ డాబాలు పోలీసులపాలిట కామధేనువులు కావటంతో వాటి జోలికి వీరు పోరనే నిజం నిత్య సత్యం. నగరంలో రోజురోజుకి చోరీలు పెరగటం, అఘాయిత్యాలు, గొడవలకి కారణాలు ఈ డాబాలలో మితిమీరి మద్యం అమ్మకాలను తెల్లవారుజాము వరకు అమ్మతుండటంతో మద్యంసేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాక నగర పోలీసు స్టేషనుకు కూతవేటు దూరంలో డాబాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.


మూలనపడ్డ హైవే మొబైల్‌

జాతీయ రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగినా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారు ఎవరైనా హైవేపై తారసపడినా హైవే దొంగతనాలు జరగకుండా చూడాల్సిన హైవే మొబైల్‌ నేడు మూల పడింది. కేవలం హైవే మొబైల్‌ మామూళ్ల మత్తులో జోగుతుందన్న కారణంగా ఈ మొబైల్‌ను మూలన పెట్టారు. వాటికే వెచ్చించిన లక్షల రూపాయల వాహనాలు నేడు నిర్వీర్యంగా ఉండడం విశేషం. హైవేపై పెట్రోలింగ్‌ చేస్తూ హైవే దొంగతనాలు జరగకుండా సకాలంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించినపుడు ఆదుకుంటూ ఉండే ఈ హైవే మొబైల్‌ను తీసివేయడం చాలా ఘోరమని పలువురు విమర్శిస్తున్నారు.

తిరిగి మొబైల్‌ను రంగంలోకి దించి రహదారిపై నిఘా పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ఎస్‌పి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న పద్ధతిలో ట్రాఫిక్‌, చోరీలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి అనేక చర్యలు తీసుకుని పలువురి మన్ననలు పొందడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారిపై ప్రమాదాలకు, గొడవలకు, హత్యలకు కారణాలుగా ఉన్న డాబాల్లో జరిపే అక్రమ మద్యం విక్రయాలను నిరోధించగలిగితే చాలావరకు జిల్లాలో ప్రమాదాలను, గొడవలను నివారించవచ్చు. దీనికి తోడు తిరిగి హైవే మొబైల్‌ను జాతీయ రహదారిపై తిప్పుతూ నిఘాను పెంచినట్లయితే మద్యం తాగి వాహనం నడిపేవారిని, చోరీలకు పాల్పడేవారిని నియంత్రించవచ్చని ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

Wednesday, April 21, 2010

ఎప్పుడో పోయేవాడ్ని.. చెక్కతో కొట్టబట్టే బతికా : మంత్రి ఆనం

విద్యుత్ ప్రమాదంలో ఎప్పుడో మృతి చెందేవాడినని ఆ సందర్భంలో తన పినతండ్రి ఎసి సుబ్బారెడ్డి చెక్కతో కొట్టబట్టే బతికానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. తమ స్వగ్రామమైన సౌత్ రాజుపాళెంలో ఓమారు విద్యుత్ తీగ పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యానని, ఇది గమనించిన తన పినతండ్రి, దివంగత ఎసి సుబ్బారెడ్డి చెక్కతో కొట్టి ఆయన కారులోనే నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. తన చేతివేలిపై విద్యుత్ తీగ పట్టుకోవడంతో ఏర్పడ్డ గాయపు మచ్చను చూపూతూ గత సంఘటనను గుర్తుచేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ప్రజాపథం సభలో ఆయన ఈ సందర్భాన్ని స్వయంగా ప్రస్తావించడం విశేషం. ఆ గ్రామ ప్రజాపథంలో భాగంగా స్థానిక రైతులు ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న స్విచ్ ఆన్/ ఆఫ్ చేసే విభాగం దెబ్బతినడంతో ప్రమాదభరితంగా మారిదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్థానిక ట్రాన్స్‌కో అధికార్లనుద్దేశించి ఈ సమస్య పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు. ఒకటి రెండురోజుల్లో ట్రాన్స్‌కో అధికారులు సంబంధిత మెటీరియల్ అమర్చి సమస్య పరిష్కరించిందీ లేనిదీ తనకు తెలపాలని గ్రామస్థులనుద్దేశించి సూచించారు. అలా ఆ అధికారులు బాగు చేయకుంటే తానే వచ్చి మరమ్మతులు చేసి సమస్య పరిష్కరిస్తానని హాస్యోక్తిగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భాన్ని కొనసాగిస్తూ... వాస్తవంగానైతే తనకు కరెంట్ పనులు తెలియదని, అలా చేస్తూ ఒకప్పుడు గాయపడ్డ సందర్భాన్ని ఈ గ్రామంలో గుర్తు చేసుకున్నారు. తనను కాపాడిన సమయంలో కాకతాళీయంగా ఎసి సుబ్బారెడ్డి విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి కూడా రామనారాయణ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రజాపథం కార్యక్రమాలు ఊరూరా వాడివేడిగా జరుగుతుండగా ఒక్కసారిగా మంత్రి నోట ఈ ఆటవిడుపు వ్యాఖ్యలు సరదాగా వినిపించడంతో సభలో నవ్వులు పూశాయి. కాగా, అప్పట్లో ఎసి సుబ్బారెడ్డి విద్యుత్, పిడబ్ల్యూడి (పిఆర్, ఇరిగేషన్) శాఖల మంత్రిత్వ బాధ్యతను నిర్వహిస్తుండేవారు. అందువల్ల అందరూ ఆయనను వాడుక భాషలో నీరూ, నిప్పు మంత్రిగా పిలుస్తుండేవారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన అరవయ్యేవ దశకపు చివరి సంవత్సరాల్లో నెల్లూరు జిల్లా మొత్తమీద వ్యక్తిగతంగా సొంత కారు అంటూ ఒకే ఒక్కరికి ఉండేది అదీ ఎసి సుబ్బారెడ్డికి మాత్రమేనని సమాచారం.

ఎసి కూరగాయల మార్కెట్టులో వ్యాపారుస్తుల జిమ్మిక్కులు

నెల్లూరు నగరం నడిబొడ్డున వున్న ఎసి.సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వ్యాపారస్తుల చేతిలో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో ఒక్కసారి పరిశీలించినా వ్యాపారస్తులు చేసే జిమ్మిక్కు ఏ ఒక్కరికైనా ఇట్టే అర్థమైపోతుంది. మార్కెట్‌కు సంబంధించి అధికారులు మార్కెట్‌పైనే ఉన్నప్పటికీ వ్యాపారస్తులు చేస్తున్న జిమ్మిక్కులు వారికి తెలియవంటే ఎవరూ నమ్మని పరిస్థితిలో ఉన్నారు. కారణం వ్యాపారస్తుల నుండి నెలసరి మామూళ్లు సంబంధిత అధికారులకు అందడమేనన్న వ్యాఖ్యలు లేకపోలేదు. మార్కెట్‌లో అడుగుపెట్టిన కొనుగోలు దారుడికి ఒక దుకాణంకు వెళ్తే కేజీ కూరగాయలు ఒక ధర చెప్పడం జరుగుతుంది. మరికొద్ది ముందుకెళ్తే మరో దుకాణాదారుడు అదే ధరకు మూడు కేజీల కూరగాయలనుఇస్తామంటూ పెద్దగా అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడం కనిపిస్తుంది. అయితే ఈ విషయమై కేజీ కూరగాయల ధర చెప్పిన దుకాణాదారుని అడిగితే, అదే ధరకు మూడు కేజీలిచ్చే వ్యాపారస్తుని తూకంలో తేడా ఉంటుందని పక్క వ్యాపారస్తుడే చెప్పడం విశేషం.

ఉదాహరణకు మార్కెట్‌లోని ఒక దుకాణాదారుడు కేజీ టమోటాలను పది రూపాయలు చెప్పినట్లయితే మరికొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో దుకాణాదారుడు అదే పది రూపాయలకు మూడు కేజీల టమోటాలను ఇస్తున్నామని పెద్దగా అరవడం మనకు వినపడుతుంది. కొనుగోలుదారుడు ఎక్కువగా రూ.10లకు మూడు కేజీలిచ్చే దుకాణాదారుని వైపే మొగ్గుచూపు తుంటారు. ఈ విషయమైవారిని ప్రశ్నిస్తే తమ ఖాతాలు ఖచ్చితంగా ఉంటాయని, వారి ఖాతాల్లో మోసం ఉంటుందని, మార్కెట్‌లోనే ఒక వ్యాపారస్తునిపై మరో వ్యాపారస్తుడు చెప్పుకునే దుస్థితి ఏర్పడి ఉంది. తూకాల్లో మోసాల విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి వందో రెండొందలో జరిమానా విధించడం జరుగుతుండడంతో అదే వ్యాపారస్తుడు తిరిగి అదే మోసానికి పాల్పడడం ఆనవాయితీగా మారింది. రోజుకు ఎసి మార్కెట్‌లో లక్షలాది రూపాయలు వ్యాపారం జరుగుతుండగా, ఇందులో వేలాది రూపాయల కూరగాయలను కొనుగోలు చేస్తున్న ప్రజలు భారీగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ దుకాణాల వద్ద కూరగాయల బేరాన్ని వారు చెప్పిన రేటుకు కొనకుండా బేరసారాలు చేసినట్లయితే ఆ దుకాణాదారులు రెండర్థాలతో కొనుగోలుదారులను హేళన చేస్తున్నట్లు తెలిసింది.

దీనికి సబంధించి కూడా కొనుగోలుదారులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో చూపుడుకు ధర్మ కాటా ఏర్పాటు చేసినా, అది ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయదో తెలియదు. పైగా ధర్మ కాటా విషయమై కూరగాయలు కొనుగోలు చేసే ఏ ఒక్కరికీ దాని గురించి తెలియదంటే అతిశయోక్తి లేదు. మార్కెట్‌లో ఎన్నిసార్లు సంబంధిత అధికారులు దాడులు చేసి చిన్నా చితకా కేసులను నమోదు చేస్తూ కొద్దిపాటి పెనాల్టీలను విధిస్తూ తిరిగి అదే వ్యాపారస్తునికి అమ్ముకునే విధంగా అనుమతి ఇస్తుండడంతో ఈ తరహా తప్పుడు తూకాలతో ప్రజలను మోసగించే వ్యాపారస్తులు మార్కెట్‌లో కోకొల్లలుగా తయారయ్యారన్న అపవాదులను సంబంధిత అధికారులు మూట కట్టుకుంటున్నారు. ఇటీవలే తూనికల, కొలతల శాఖ అధికారులు ఈ మార్కెట్‌పై దాడులు నిర్వహించి పలు వ్యాపారస్తుల మీద కేసులు పెట్టిన సంఘటనలు కూడా జరిగిన విషయం విదితమే.

అయినప్పటికీ వ్యాపారస్తుల్లో ఎటువంటి మార్పులు రాకపోగా కూరగాయల వినియోగదారులని ఎన్ని రకాలుగా మోసగించవచ్చో అన్ని రకాల మోసాలకు గురి చేస్తూ ఎక్కువ రేట్లతో ప్రజలను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మార్కెట్‌ మొత్తం మీద కూడా సకాలంలో చెత్తా చెదారాలను కార్పొరేషన్‌ అధికారులు తొలగించకపోవడంతో కుళ్లిన కూరగాయలను దుకాణాదారులు మార్కెట్‌ సమీపంలోనే పోస్తుండడంతో మార్కెట్‌ ఏరియా అంతా దుర్గంధపూరితమైన వాతావరణం నెలకొంది. కూరగాయలు కొనుగోలు చేసేవారు ముక్కులు మూసుకుని కొనాల్సి వస్తుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత తూనికల, కొలతల శాఖ అధికారులు ఈ మార్కెట్‌పై దృష్టి సారించి మోసాలకు పాల్పడే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూరగాయలు కొనుగోలుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. మోసాలకు పాల్పడే ఏదైనా ఒక దుకాణాదారునిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మిగిలిన దుకాణాదారులైనా నిజాయితీగా తమ వ్యాపారాలను కొనసాగించే అవకాశం ఉందని పలువురు కోరుతున్నారు.

Tuesday, April 20, 2010

ప్రజాపధం లో తనదైన శైలిలో ఆనం వివేకా

నూతన కార్పోరేషన్ కార్యాలయం పనులను పరిశిలించిన మంత్రి

ఎన్‌బికెఆర్‌ ప్రతిష్టను కాపాడేందుకే బాధ్యతలు చేపట్టా

ఎముకలు ఏరేస్తున్నారు...ఆపై అమ్మేస్తున్నారు

నెల్లూరు నగరంలోని బోడిగాడితోట ఎదురుగావున్న సుమారు 10 ఇళ్లలో మృతి చెందిన మూగజీవాలతోపాటు బతికిన మూగజీవాలను చంపివేస్తూ వాటి మాంసాన్ని నగరంలోని పలు వ్యాపారస్తులకు కేజీల లెక్కన అమ్మేస్తున్నారు. ఈ మాంసాన్ని నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో చికిన్‌పకోడా తయారు చేసి అత్యంత గోప్యంగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ తరహా చికిన్‌ పకోడా దుకాణాలు నగరంలోని కొన్ని ప్రధాన కేంద్రాలలో చికిన్‌ పకోడా కంటే రూ.10లు తక్కువగానే దీన్ని అమ్ముతుండడంతో ఎక్కువగా నగరంలోని పలువురు దీనివైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఆపైన
వాటి ఎముకలను ఆ ఇళ్లలో నిల్వ ఉంచుతూ చెనై్న, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాలకు సంబంధించిన వ్యాపారస్తులకు అమ్ముతూ లక్షలాది రూపాయలు సంపాదించే పనిలో పలువురు వ్యాపారస్తులు పనిచేస్తున్నారు.

ఈ మూగజీవాల్లో ఎక్కువగా బర్రెలు, ఆవులు, దూడలు ఉంటున్నాయి. ఎక్కువగా వీటికి సంబంధించిన ఎముకలనే ఈ ఇళ్లలో ఉంచుతుండడంతో వీటికి సంబంధించిన దుర్వాసన సమీపంలోని సత్యనారాయణపురం, వైకుంఠపురం తదితర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ వాసన పీల్చి పలువురు వ్యాధులకు గురైనట్లు చెబుతున్నారు. వంట నూనెలలో కలిపేందుకు, నూనెను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అలాగే వీటి తోళ్లను బ్లీచింగ్‌తో కడిగి అదే ప్రాంతాల్లో ఆరబెడుతుండడంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. మైపాడు రోడ్డులో పాత చె క్‌పోస్ట్‌ నుంచి జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ జంక్షన్‌వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణీకులు, పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఆ ప్రాంతంలోని పేదరికంలో మగ్గుతున్న పదేళ్లలోపు పిల్లలను, అనాధ పిల్లలను చేరదీసి ఎముకల వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఈ పిల్లలను సమీపంలోని బోడిగాడి తోటకు పంపి మనుషుల ఎముకలను సైతం ఏరించి వాటిని కూడా బర్రెల, ఆవుల ఎముకలతో కలిపేస్తూ అమ్ముకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎక్కువగా శుక్రవారం, శనివారం, ఆదివారం సమయాల్లో ఈ మూగజీవాలకు సంబంధించి ఎక్కువగా ఎముకలను అక్కడే ఒలిచి వ్యర్థ పదార్థాలను సమీపంలోని సర్వేపల్లి కాలువలో పడవేస్తూ, ఎముకలను మాత్రం ఇళ్లలో భద్రపరుస్తూ, వ్యాపారస్తులకు మంగళ, బుధవారాల్లో చె నై్న, గుంటూరు, విజయవాడకు చెందిన వ్యాపారస్తులకు రాత్రి 8 గంటలపైన అత్యంత గోప్యంగా లారీల్లో లోడు చేస్తూ రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారంపై అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా పగలు సమయాల్లో ఆ పది ఇళ్ల వరకు సుమారు 10 మంది వరకు కాపలా ఉండడం, ఆ ఇళ్ల వద్ద ఎవరైనా ఆగినట్లయితే వారి గురించి విచారణ చేయడంతోపాటు, అనవసరంగా వివాదాలకు దిగుతూ, వారిని కొట్టి ఆ ప్రాంతం నుంచి తరిమివేస్తున్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో, ఏదైనా వాహనం ఆ ఇళ్ల వద్ద ఆగినట్లయితే ఆ వాహనం ఎవరిది, ఎందుకు ఆగింది, ప్రెస్‌కు, లేదా పోలీసులకు సంబంధించినవారా అని ఆరా తీస్తూ వారిని ఆ ప్రాంతం నుంచి అతి తొందరగా వెళ్లేలా చూస్తున్నట్లు తెలిసింది.

ఈ ప్రాంతంలో సుమారు గత పదేళ్లుగా అత్యంత గోప్యంగా ఈ ఎముకల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై స్థానికులు ఇప్పటికే చాలామంది అధికారులకు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని పలువురు పేరు చెప్పేందుకు ఇష్టంలోని స్థానికులు తె లపడం విశేషం. కొన్ని సందర్భాల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన పలువు అధికారులు మాత్రం మామూళ్లు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానికులు కార్పొరేషన్‌ అధికారులకు, సంబంధిత అధికారులకు రాస్తున్న లేఖల ఆధారంగా చర్యలు తీసుకోకపోవడమే గాక ఆ లేఖలను అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారస్తుల వద్ద భారీగా మమూళ్లు వసూలు చేసి స్తబ్దుగా ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే మూగజీవాలకు సంబంధించిన ఎముకలను నిల్వ ఉంచడంతో స్థానికులు పలు రోగాలకు గురవుతున్నట్టు, అలాగే పలు చర్మ వ్యాధులు అంటుకుంటున్నట్టు సమాచారం.

గతంలో కేవలం మూగ జీవాలకు సంబంధించిన ఎముకలను, చర్మాలను మాత్రమే ఎగుమతులు చేసే ఈ వ్యాపారస్తులు తాజాగా అనాధ పిల్లలను సేకరించి బోడిగాడి తోటలోని మనుషుల ఎముకలను కూడా సేకరించి జంతువుల ఎముకలతో కలిపి ఎగుమతులు చేస్తుండడంతో స్థానికులకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నట్టు తెలిసింది. వీరికి అంగబలం, ఆర్థిక బలంతోపాటు రాజకీయ పలుకుబడి కూడా ఉండడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లోని పలువురికి తెలిసినప్పటికీ వారు మఫ్టీల్లో వచ్చి ఆదివారం సమయాల్లో మామూళ్లు వసూలు చేసుకుని వెళ్తున్నట్టు తెలిసింది. ఈ ఎగుమతులు ఎక్కువగా మంగళవారం, బుధవారం, రాత్రిళ్లు మాత్రమే చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఈ ప్రాంతంలో దాడులు చేసి ఈ తరహా వ్యాపారాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో ఎముకల వ్యాపారస్తులు బోడిగాడి తోటలోని మనుషుల ఎముకలను కూడా అతి త్వరలో మాయం చేసే ప్రమాదం లేకపోలేదు.

Monday, April 19, 2010

నగరంలో వంటల పోటీలు

నెల్లూరు రైల్వే స్టేషన్ స్క్రాప్ గోదాములో దొంగలు పడ్డారు

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని నెల్లూరు రైల్వే స్టేషన్ స్క్రాప్ గోదాములో దొంగలు పడ్డారు. రైల్వే సిబ్బందే స్వయంగా స్క్రాప్ పరికరాలను రహస్యంగా ఒక్కొక్కటి తరలించి మాయం చేస్తున్నారు. రైల్వేశాఖ నిఘా, నియంత్రణ కరువవుతుండడంతో ఎన్నో ఏళ్లుగా ఈ తంతు నిర్విఘ్నంగా సాగుతోంది. ఇనుము, టేకు దుంగ లను దర్జాగా తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా రు. ఇలా ఏటా సుమారు రూ.5లక్షలకు పైగా సి బ్బంది చేతివాటంతో స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా పెట్టి సాక్ష్యాలతో సహా ఈ అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది.

స్క్రాప్ గోదాము సిబ్బంది వరం

దేశంలో అతిపెద్ద సంస్థగా విస్తరించి ఎంతోమంది ప్రయాణికుల ను చేరవేస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పించే శాఖగా రైల్వేకు మంచి పేరుంది. ఈ శాఖలో రైలు పట్టాల నిర్వహణకు అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రైలు పట్టాలు కొంచెం సరిలేకున్నా ఆ పరికరాలను స్క్రాప్ కింద తీసేస్తారు. ఉడెన్ స్వీపర్స్, రబ్బర్‌ప్లేట్లు, క్లాంపులు, బోల్టులు, రైలు పట్టాల ముక్కలు పెద్ద ఎత్తున స్క్రాప్ కింద చేరుతాయి.

ఇలా వచ్చిన వాటిని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో గోదాములలో నిల్వ చేస్తారు. వీటిని జాగ్రత్తపరచి ప్రతి ఏటా టెండర్లు నిర్వహించి అమ్మకాలు జరిపి వచ్చిన సొమ్మును రైల్వే ఖాతాలో జమ చేయాలన్నది నిబంధన. కాని ఈ స్క్రాప్‌ను దాచి పెట్టడమే రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. అధికా రులు, సిబ్బంది కుమ్మకై వాటిని మాయం చేస్తున్నారు. ఉడెన్ స్వీపర్స్ పూర్తిగా టేకువే ఉంటాయి. ఇవి గృహో పకరణాలకు విరివిగా ఉపయోగిస్తారు.

ఒక్క దిమ్మె సామిల్లు యజమానులు రూ. వెయ్యికి కొనుగోలు చేస్తే వాటిని ముక్కలుగా చేసి రూ. 4నుంచి 5వేల వరకు అమ్మకాలు సాగిస్తారు. ఇదే రీతిన ఇనుప పరికరాలను, ఇనుప సామాన్ల దుకాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నెల్లూరు రైల్వే స్టేషన్ గోదాములలో ఏడాదికి రూ. 5 నుంచి 6 లక్షల వి లువైన పరికరాలు మాయం చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బిట్రగుంటలోని ఓ పాత సినిమా హాలును విజిలెన్స్ అధికారు లు తనిఖీ చేయగా, కొన్ని వేల ఇనుప స్వీపర్లు దొరికాయి. ఇనుప సామాను వ్యాపారుల వద్ద రైల్వే పరికరాలు ప్రత్యక్షమైనా చిన్న చిన్న కేసులతో రాజీ చేసుకుని చేతికందిన మేరకు సొమ్ము చేసుకుని గోప్యంగా ఉంటున్నారు.

ఇదిగో సాక్ష్యం..
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పనిచేసే రైల్వే క్లాస్ ఫోర్ ఉద్యోగి వెంకటేశ్వర్లు రైలు పట్టాలు కింద అమర్చే టేకు దిమ్మెను ముఠామేస్త్రి సాయంతో రైల్వే స్టేషన్‌కు సమీపంలో శెట్టిగుంట రోడ్డు వద్ద ఉన్న ఓ సామిల్లుకు రిక్షాలో తరలించారు. వెంటనే సామిల్లు కూలీలుఈ దిమ్మెను ముక్కలుగా చేసి నాజుక్కుగ్గా తయారు చేయడంలో నిమగ్నంకాగా,ఇక్కడే ఉన్న వెంక టేశ్వర్లను ఇదేమిటని ప్రశ్నిస్తే...... సమాధానం చెప్పక పరుగులు తీశాడు.

కార్యాలయానికి వెళ్లి విచారిం చగా, అక్కడే ఉన్న వెంకటేశ్వర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను చూసి మరోసారి పరుగులు తీశాడు. ఇదే విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు, నిఘా అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు.విధుల్లోఉన్న సిబ్బందిని అధికారుల వివరాలను కోరగా వారు చెప్పెందుకు నిరాక రించారు.

రక్షణ మాటేమిటి ?
నెల్లూరు రైల్వేస్టేషన్ స్క్రాప్ గోదాముల్లో రైల్వే పరికరాలు విచ్చల విడిగా పడేశారు. పీడబ్ల్యు కార్యాల యంలో ఇనుప దిమ్మెలు, టేకు కొ య్యలు భారీగా ఉన్నా వీటికి రక్షణగా కంచె ఉన్నా అది నామమాత్రమే. పేరుకు గేటు ఉన్నా అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. స్బిబందికి సొమ్ము అవసరమైతే దర్జాగా ఈ గోదాము నుంచి స్క్రాప్ పరికరాలను బయటకు తరలించి అమ్ముకుంటున్నారు. ఎంతో విలువైన ఈ పరికరాలకు రక్షణ కరువవడంతో ఇంటి దొంగలే స్వాహా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరచి నియంత్రించకపోతే రైల్వేశాఖ భారీగా నష్టపోనున్నది.

నేటి నుంచి ప్రజాపధం

సోమవారం నుంచి ప్రజా పథం కార్యక్రమాన్ని నిర్వహించనున్నా రు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరురూరల్ మండలం మైపాడుగేటు వద్ద ఉన్న వేణుగోపాల్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించను న్నారు. తొలి రోజు పది మండలాల్లోనే ప్రజాపథం నిర్వహించి, ఆ తరువాత మరో మండంలో అధికారులు అడుగు పెట్టనున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ముఖ్య అతి«థులుగా పాల్గొననున్నారు.

ఏడు అంశాలకు ప్రాధాన్యం

ఈ కార్యక్రమంలో ప్రజా సమస్య లనే చర్చిస్తూ సభలు, సమావేశాలకు పరిమితం చేశారు. మొత్తం ఏడు అంశాలతో ఈ సారి ఐదో విడత ప్రజా పథాన్ని నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దారు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ, పీఆర్ఏఈ తదితర అధికారులతో మొబైల్ టీం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో వీఆర్‌వో పర్యవేక్షణలో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు.

రోజుకు నాలుగు నుంచి ఐదు గ్రామాల్లో వీరు పర్యటిస్తారు. ఆయా ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తేదీలు ఖరారు చేసి పర్యటన కార్యక్రమాన్ని రూపొందిం చారు. జిల్లా అధికారులు ఈ కార్యక్ర మాన్ని సజావుగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించగా, కలెక్టర్ కె. రాంగోపాల్ నెల్లూరు డివిజన్, జేసీ సౌరబ్‌గౌర్ గూడూరు డివిజన్, అదనపు జేసీ సీతారామాయ్య కావలి డివిజన్‌లలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. నియోజకవర్గానికి ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రజాపథం ముగిసిన తరువాత మరో మండలం లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల నుంచి అందే వినతులను ఏరోజు కారోజు డేటా ఎంట్రీ చేసి వాటిని జిల్లా కేంద్రానికి పంపుతారు. తాగునీటి సమస్య ఉంటే అందుకు అవసరమైన నిధులు వాటి వివరాలు కూడా ఈ నివేదికల ద్వారా తెలియజేయాలి. బోర్లు ఇతర చిన్న చిన్న రిపేర్లను మాత్రం వెంటనే చేస్తారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 4 కోట్లను విడుదల చేసింది. పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దు, తాగునీటి సమస్యపై గ్రామాలకు వచ్చే అధికారులను నిలదీసేందుకు ప్రజలు కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెటుకున్న ప్రభుత్వం ప్రజలతో ఎక్కడ కూడా వివాదాలకు దిగ దంటూ అధికారులను కోరింది.

Friday, April 16, 2010

జీఎస్ఎల్‌వీ -డీ3 ప్రయోగ వ్యయం రూ.330 కోట్లు

షార్ నుంచి జీఎస్ఎల్‌వీ -డి3 ప్రయోగ వ్యయం మొత్తం 330 కోట్లు. అందులో జీఎస్ఎల్‌వీ వాహన వ్యయం 180 కోట్లు కాగా, జీ శాట్-4 ఉపగ్రహ తయారీ వ్యయం 150 కోట్లు అయిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 335 కోట్లు కేటాయించింది. తొలి ప్రయోగం విఫలం కావడంతో దాదాపు 500 కోట్లు బంగాళాఖాతంలో కలిసిపోయాయన్న విమర్శలను ఇస్రో ఎదుర్కోవాల్సి వచ్చింది.

తొలి ప్రయోగాలు వైఫల్యాలే...

శ్రీహరికోట సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో 30 ఏళ్ళలో జరిగిన నాలుగు రాకెట్ల ప్రయోగాలలో మొదటి మూడు ప్రయోగాలు వైఫల్యం చెందాయి. 1979లో జరిగిన ఎస్ఎల్‌వి తరహా రాకెట్ల తొలి ప్రయోగం విఫలమయింది. 1987లో జరిగిన ఎఎస్ఎల్‌వీ తరహా రాకెట్ తొలి ప్రయోగం కూడా అపజయాన్ని చవిచూసింది.

అనంతరం 1993లో తొలి పీఎస్ఎల్‌వీ డి1 ప్రయోగం విఫలమయింది. 2001లో జరిగిన జీఎస్ఎల్‌వీ సిరీస్‌లో తొలి ప్రయోగం మాత్రం విజయవంతమైంది. గురువారం స్వదేశీ క్రయోజనిక్ దశతో జరిగిన జీఎస్ఎల్‌వీ -డి3 ప్రయోగం కూడా అపజయాని చవిచూసింది. అయితే ఆదిలో హంసపాదు అయినా... అనంతరం జరిగే ప్రయోగాలు విజయాలబాట పట్టడం విశేషం.

నీటి ఎద్దడి నివారణకు కాల్‌సెంటర్


వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడిపై వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కేంద్రలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో మంచినీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను కాల్ సెంటర్ ద్వారా స్వీకరించి, పనుల స్థాయిని బట్టి 24గంటల లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో జిల్లా పరంగా దాదాపు 5కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చిన మంచినీటి సమస్యలపై ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత ఎఇల ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంచినీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లోని 18004252499 నెంబర్‌కు ఫోన్ చేసినట్లయితే వెంటనే ఆన్‌లైన్‌లో ఆ సమస్యలను రిజిష్టర్ చేస్తామని చెప్పారు. మంచినీటి సమస్య పనుల స్థాయిని బట్టి వచ్చిన 24 గంటల లోపల పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ ఏప్రిల్ 15నుండి అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామస్థాయిలో, మునిసిపాలిటీలలో కూడా మంచినీటి సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియచేయవచ్చని చెప్పారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాల్ సెంటర్ నిర్వహణ పనితీరును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ సీతారామయ్య, జడ్పీ సిఇఓ బి రామిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి జివి జయరామయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రవిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆటోల పై నిషేధం అమలు కాలేదు

నెల్లూరు నగరంలోకి 15వ తేదీ నుండి 7 సీటర్‌ ఆటోల ప్రవేశాన్ని జిల్లా ఎస్‌పి నిషేధించడం తెలిసిందే. అయితే రవాణా శాఖాధికారులు మాత్రం నగరంలో అసలు 7 సీటర్‌ ఆటోలు లేవని తేల్చి చెప్పడం విశేషం. కేవలం నగరంలో 3 ప్లస్‌ 1 ఆటోలకు తాము అనుమతి ఇవ్వగా ఆ ఆటోలు 7 సీటర్‌ ఆటోలుగాను, అదేవిధంగా 4 సీటర్‌ అప్పీ ఆటోలు, 5 సీటర్‌ కెపాసిటీతో నగరంలో ప్రయాణీకులను ఎక్కించుకుని తిప్పుతున్నారని రవాణా శాఖాధికారులు తెలుపుతున్నారు.

అయితే పోలీసు అధికారులు మాత్రం నగరంలోకి రూరల్‌ ప్రాంతాల నుండి 7 సీటర్‌ ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, అటువంటి వాటిని నిషేధించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్‌పి ఇచ్చిన ఆదేశాల మేరకు 7 సీటర్‌ ఆటోల నిషేధంపై ఆటో యజమానులు లీగల్‌గా అనుమతిని పొందడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఆటో యజమానులు ఇప్పటికే తమకు ఉన్నంతలో కొంత సొమ్మును సేకరించుకుని మిగిలింది ఫైనాన్స్‌ ద్వారా ఆటోలను కొని అధికారుల ఆదేశాలను విన్న వెంటనే ఆటోలను అమ్ముకోలేక, ఫైనాన్స్‌లు కట్టలేక ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడా కూడా 7 సీటర్‌ ఆటోలను నగరాల్లోకి రాబోయే రోజుల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వరేమోనని భయాందోళనకు గురవుతున్నారు. రవాణా శాఖాధికారులు 7 సీటర్‌ ఆటోలు లేవని తేల్చడంతో వాటి నిషేధానికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించడానికి పోలీస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫలితంగా 15వ తేదీ నుంచి అమలు చేయాల్సిన 7 సీటర్స్‌ ఆటోలు నగర ప్రవేశ నిషేధం అమలు కాలేదు. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలనే జిల్లా ఎస్‌పి ఉద్దేశ్యం చాలా వరకు మంచిదే అయినప్పటికీ, నగరంలో ఉన్న రహదారులను వెడల్పు చేయకుండా వాహనదారులపై పడడం ఏమంత బాగులేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆటోల సీటింగ్‌ కెపాసిటీని బట్టి నిషేధం వర్తింపచేసేదానికంటే, ఓవర్‌లోడు చేయకుండా ఆటోలపై చర్యలు తీసుకుంటే మంచిదని సామాన్య ప్రయాణీకులు, ఆటోను నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆటోవాలలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రమాదాలు జరిగినపుడు అప్పటికప్పుడే పోలీసు అధికారులు స్పందిస్తూ తీసుకునే అనేక నిర్ణయాల్లాగే ఆటోలపై నిషేధం పూర్తిగ కొనసాగుతుందా లేక మూలన పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Thursday, April 15, 2010

జీఎస్ఎల్‌వీ-డి3 రాకెట్ ప్రయోగం విఫలం

జీఎస్ఎల్‌వీ-డి3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన క్రయోజనిక్ దశతో రూపొందిన జీఎస్ఎల్‌వీ-డి3 రాకెట్‌ను గురువారం సాయంత్రం 4.27 నిమిషాలకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.

బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్‌లో సాంకేతిక లోపంవల్ల కక్ష్యలోకి వెళ్లలేకపోయింది. దీంతో శాస్త్రవేత్తలు నిరాస చెందారు.

ప్రయోగించిన వెంటనే సెకండ్‌కు మూడు కిలోమీటర్ల వేగతంతో ప్రయాణించిన రాకెట్ ఒకటి, రెండు స్టేజ్‌లు దాటి కక్ష్యనుంచి దూరంగా వెళ్ళి, నిర్ణీత కక్ష్యకంటే తక్కువ ఎత్తులో రాకెట్ ప్రయాణిస్తుండడంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు.

నేడే జిఎస్‌ఎల్‌విడి3 ప్రయోగం


సథీష్‌ధావన్‌ స్ఫేస్‌ సెంటర్‌ శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో జిఎస్‌ఎల్‌వి డి3 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ మొదలైంది. రాకెట్‌ ప్రయోగానికి 29 గంటలముందు బుధవారం ఉదయం 11.27 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ కౌంట్‌డౌన్‌ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతోంది. సూపర్‌కంప్యూటర్‌ పర్యవేక్షణలో శాస్తజ్ఞ్రులు రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి నిముషాలు లెక్కపెడుతున్నారు. వాతావరణం, ఇతర పరిస్థితులు అనుకూలిస్తే గురువారం సాయంత్రం 4.27 గంటలకు ఖచ్చితంగా రాకెట్‌ ప్రయోగం ఉంటుంది. ఏదైనా..అనుకోని సాంకేతిక అవరోదాలు ఏర్పడితే మినహా ప్రయోగం వాయిదాపడే అవకాశం లేదు.

భూస్థిరకక్ష్య ఉపగ్రహవాహకనౌక ఈ జిఎస్‌ఎల్‌వి డి3 ద్వారా 2218 కిలోల బరువుండే భూస్థిర ఉపగ్రహం జిశాట్‌4ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. జిఎస్‌ఎల్‌వి ప్రయోగ పరంపరగా షార్‌నుంచి జరుగుతున్న ఆరవ ప్రయోగమిది. రాకెట్‌ అభివృద్ధి పరిణామ క్రమంలో జిఎస్‌ఎల్‌వి డి3 మూడవది. ఇప్పటికే అయిదు జిఎస్‌ఎల్‌వి రాకెట్‌లను షార్‌ నుంచి ప్రయోగించి ఉన్నారు. ఇందులో నాలుగు ప్రయోగాలు విజయవంతమవ్వగా, ఒక ప్రయోగం విఫలమైంది. రెండు రాకెట్‌ ప్రయోగాలలో అభివృద్ధి కరమైన అంశాలను పొందుపరిచి పంపించి ఉన్నారు. భూస్థిర ఉపగ్రహ ప్రయోగాలలో ప్రస్తుతం పంపిస్తున్న జిశాట్‌4 పంతొమ్మిదవది. భారత్‌ నుంచి పంపించిన భూస్థిర ఉపగ్రహాలలో నాలుగవది. రాకెట్‌ ప్రయోగం జరిగిన కొద్ది నిముషాలలోనే మధ్యంతర భూస్థిర కక్ష్యలోకి వేళ్ళే ఉపగ్రహం అనంతరం వివిధ దశలలో జరిగే ప్రక్రియతో 36 వేల కిలోమీటర్ల వృత్తాకార భూస్థిర కక్ష్యలో స్థిరపడి నిరంతర సేవలు అందిస్తుంది.

రెండన్నర దశాబ్దాలుగా ఇలాంటి ఉపగ్రహాలు తయారు చేసి పంపించడంలో భారత్‌ ఆరితేరి ఉంది. 18 ఉపగ్రహాలుని ఇప్పటికి పంపించి ఉండగా, ఇందులో 11 ఉపగ్రహాలు ఇప్పటికీ పని చేస్తున్నాయి. సమాచార వ్యవస్థలలో , టివి ప్రసారరంగాల్లో, వాతావరణ అధ్యయన రంగాల్లో ఈ ఉపగ్రహాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 3జి టెక్నాలజీలాంటి సేవలకు ఈ ఉపగ్రహ ప్రయోగాలవల్లనే వీలవుతోంది. ప్రస్తుతం జిశాట్‌, ఇన్‌శాట్‌ ఉపగ్రహాలు భూమి నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ కమ్యునికేషన్‌ రంగాలతోపాటు విద్య, వైద్య రంగాలలో కూడా గణనీయమైన సేవలు అందిస్తున్నాయి. గ్రామీణవనరుల కేంద్రాలద్వారా సామాన్యమానవుడికి సైతం ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రస్తుతం జిశాట్‌4లో అనేక ఆధునిక పరికరాలను అనుసంధించి ఉన్నారు. పొలాల్లోంచి రైతులు మార్కెట్‌ విలువలు తెలుసుకొనేందుకు, అననుకూల ప్రాంతాలనుంచి కూడా టెలిఫోన్‌, టివి సదుపాయం కల్పించడానికి ఈ ఉపగ్రహాలవల్ల వీలవుతుంది.

మూడంచెల మోటారు పద్ధతిన పనిచేసే జిఎస్‌ఎల్‌విలో ఈ సారి క్రయోజనిక్‌ మోటారు ఉపయోగించడం మరో గొప్ప విషయం. దాదాపు 50మీటర్ల ఎత్తు, 416 టన్నులు బరువుండే జిఎస్‌ఎల్‌వివిడి3 మూడుదశల మోటారు పద్ధతిన పనిచేస్తుంది. మొదటిదశలో ఇప్పటికే అబివృద్ధి చేసిన ఘన ఇంధనం, రెండవదశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. మూడవ దశలో కీలకమైన క్రయోజనిక్‌ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించే ఈ క్రయోజనిక్‌ మోటారుని ఈ సారి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం విశేషం.

దీంతో ఈ రాకెట్‌ ప్రయోగానికి విశేష ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రయోగం విజయవంతమైతే క్రయోజనిక్‌ మోటారుని ఉపయోగించే ఆరవ దేశంగా మనదేశం ప్రపంచ పటంలో చోటు సంపాయించుకొంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలో మైనస్‌ 252 డిగ్రీలవద్ద ఉదజనిని, మైనస్‌ 195 డిగ్రీలవద్ద ప్రాణవాయువుని ద్రవీకృతం చేసి క్రయోజనిక్‌ మోటారులో వినియోగిస్తారు. అత్యంత క్లిష్టతరమైన ఈ ప్రక్రియను జిఎస్‌ఎల్‌విడి3 ద్వారా మన దేశ శాస్తజ్ఞ్రులు సాధిస్తున్నారు.

చెంగాళమ్మకు ఇస్రో మాజీ చైర్మన్ పూజలు


దేశచరిత్రలో గురువారం కీలకఘట్టం ఆవిష్కరించనున్నదని, ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్‌వీ ప్రయోగ విజయం ఒక మైలురాయి కాబోతోం దని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన చెన్నై నుంచి షార్‌కు వెళుతూ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించా రు. అక్కడే స్థానిక విలేఖర్లతో మా ట్లాడారు. జీఎస్ఎల్‌వీ ప్రయోగంలో క్రయోజనిక్ దశను మనశాస్త్రవేత్తలు రూపొందించారని ఈ ప్రయోగ విజ యం భవిష్యత్తులో ఎన్నో ప్రయో గాలకు మార్గాన్ని సుగమం చేస్తుందని తెలిపారు.

అమ్మణ్ణి ఆశీస్సుల కోసం వచ్చానని, రాకెట్ ప్రయోగం సంపూర్ణ విజ యాన్ని సాధిస్తుందని «ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. ఆయన వెంట షార్ శాస్త్రవేత్త రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

Tuesday, April 13, 2010

నగరంలో కాఫీ కేఫ్‌లలో బాతాఖాని తో మోసం

నగరంలో ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 వరకు ఏ కాఫీ కేఫ్‌లలో చూసినా ఖద్దరు దుస్తులు ధరించిన వ్యక్తుల సెల్‌ఫోన్‌లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి మోగడం ఆనవాయితీగా మారిపోయింది. వీరి సంభాషనలు వినేవారికి రోమాలు సైతం నిక్కపొడుచుకునే పరిస్థితి నెలకొంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నగరంలోని శివారు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూములు, ప్లాట్ల వ్యాపారాలు, వాటి రేట్లు వినే వారికి సైతం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. గతంలో ముత్తుకూరులో షిప్‌యార్డ్‌ పడక ముందు రియల్‌ ఎస్టేట్‌కు మంచి రేటు పలికిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం ఆ మాత్రపు ధరలు నగరంలో ఏ ప్రాంతంలో పలకడం లేదనేది సత్యం. అయితే ఈ కేఫుల వద్ద సెల్‌ఫోన్‌లో నగరంలో పలానా ప్రాంతంలో అంకణం రూ.20 వేల నుండి రూ.60 వేల వరకు, రూ.70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉందంటూ కొనుగోలుదారులను మోసగించే ప్రయత్నంలో ఈ ఘరానా బాబులు తయారైఉన్నారు. వీరికి నిద్రలేచింది మొదలు మరో పని లేకుండా నగరంలోని నర్తకి సెంటర్‌లో ఉన్న రెండు ప్రధాన కేఫ్‌లు, లస్సీ సెంటర్‌లో ఉన్న మరో కేఫ్‌, అదేవిధంగా వేదాయపాళెం, అయ్యప్పగుడి, పొదలకూరురోడ్డు తదితర ప్రాంతాలలోని కేఫుల వద్ద గుంపులు గుంపులుగా చేరి ప్రజలను మోసగించే ప్రయత్నంలో నిత్యం తమవంతు ప్రయత్నాలు చేయడం పరిపాటైపోయింది.

వీరి మాటలు విని వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అదేవిధంగా వీరు కేఫుల వద్ద సెల్‌ఫోన్‌లో బిజీగా ఉన్నట్టు నటిస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న వ్యాపార సంస్థలవారిని, కొద్దో గొప్పో పలుకుబడి గలవారిని ఆకర్షిస్తూ, తాము చీటీ వ్యాపారాలు మొదలు పెట్టామని, రూ.50 వేల నుండి రూ. లక్ష వరకు ఈ చీటీ పాటలను వేయాలని వారిని మభ్య పెడుతూ అనంతరం ఆ ఖాతాదారుల నుండి కోట్లాది రూపాయలు వీరు దండుకుని పరారైన సంఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి. అయినప్పటికీ ఎక్కువగా ఈ తరహా ఘరానా బాబుల వలలో సామాన్య మానవులు, మధ్య తరగతి ప్రజలు తిప్పుకోవడంతోపాటు వేలాది రూపాయలు నష్టపోతూ ఆత్మహత్యలకు పాలవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలనే గాక, ఇతర జిల్లాల నుండి మహిళలను నగరంలోని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో వారికి వసతులు ఏర్పాటు చేయడంతోపాటు చిన్నా చితకా రాజకీయ నాయకులకు ఫోన్‌ల ద్వారానే కాంటాక్ట్‌ అవుతూ వారి ద్వారా ఎటువంటి పనీపాట లేకుండా వేల రూపాయలు కమిషన్‌ల రూపంలో దండుకుంటూ తమపబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేఫుల వద్దకు కాఫీ, టీ తాగేందుకు వచ్చే వారి సంఖ్య పదుల వరకు ఉంటే, ఈ తరహా వ్యవహరాలపై అదేపనిగా పెట్టుకుని గంటల కొద్దీ ఈ కేఫుల వద్ద బాతాఖానీలు కొడుతూ ఈ తరహా వ్యవహారాలపై ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నట్టు సమాచారం. ఈ తరహా బడాబాబుల ఘరానా మోసాలని సంబంధిత అధికారులు ప్రధానమైన సెంటర్లలో నిఘా ఏర్పాటు చేసి ఈ తరహా వ్యక్తులు చే సే ఘరానా మోసాలకి అడ్డుకట్ట వేయాలని, అలాగే చట్టవ్యతిరేకంగా చీటీపాటల వ్యవహారం నడిపే వ్యక్తులపై కూడా నిఘా పెట్టడంతోపాటు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైన ఉంది.

ఈ తరహా మోసాలపై కేవలం సంబంధిత అధికారులే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా సంఘాలవారు కూడా నిఘా ఉంచి ఈ ఘరానా బాబుల భరతం పట్టాలని, ఈ తరహా వ్యవహారాలను నడిపే వారి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు అందించడంతోపాటు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నష్టాలబారీన పడి ఆత్మహత్యలపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థలపై ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఈ కేఫుల వద్ద జరిగే బాతాఖానీలపై దృష్టి సారించకుండా, వారు మభ్యపెట్టే మాటల్లో పడకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా సంఘాలవారు తమ వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మద్రాసు బ స్టాండు వద్ద రోడ్డు మార్టిన్ వ్యాపారాల తొలగింపు


కూరగాయల మార్కెట్‌కు అనుసంధానంగా రోడ్డు మార్జిన్‌లో చేస్తున్న వ్యాపారాలను పోలీసులు సోమ వారం తొలగించారు. మద్రాసు బ స్టాండు సమీపంలోని ఏసీ కూరగా యల మార్కెట్ వెలుపల ఆకుకూర లు, పండ్లు, టెంకాయలు, కూరగాయ లు తదితర వ్యాపారాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. స్వచ్ఛం దంగా వ్యాపారాలు ఎత్తివేయాలని ఎ న్నిసార్లు చెప్పినా సదరు వ్యాపారులు వినలేదు. దీంతో నగర డీఎస్పీ రాధిక, ట్రాఫిక్ సీఐ రాఘవరావు, నగర సీఐ వీరాంజనేయరెడ్డి, నగర ప్లానింగ్ అధి కారి రాజేంద్రప్రసాద్‌నాయక్, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ప్రాం తానికి చేరుకుని రైతు బజారులో వ్యా పారాలు పెట్టుకోవాలని వ్యాపారులకు సూచించారు.

దీంతో వ్యాపారులు త మ నిరసన తెలిపారు. డీఎస్పీ రాధిక వ్యాపారుల దగ్గరకు వెళ్ళి ఎస్పీ ఇ.దామోదర్ ఆదేశాల మేరకు తాము ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అక్కడకు వచ్చిన సీపీఎం నాయకు డు మోహన్‌రావు ఆధ్వర్యంలో వ్యా పారులందరూ ప్రదర్శనగా కలెక్టర్ కా ర్యాలయానికి వెళ్ళి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ లోపు కార్పొరేష న్ జేసీబీతో రోడ్డు పక్కన ఫ్లాట్‌ఫారా లను పోలీసులు తొలగించారు. మా ర్కెట్లో నిర్ణీత పరిధిదాటి ముందుకు వచ్చిన షాపు రేకులను, వ్యాపారాలను ఎత్తివేయాలని పోలీసులు ఆదేశించా రు. అలాగే వాహనాలను అడ్డదిడ్డం గా పార్కింగ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ తొలగింపు కార్య క్రమాన్ని జిల్లా ఎస్పీ ఇ.దామోదర్ ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజ లు, పార్టీలు, వ్యాపారులు సహకరిం చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాల్గవ నగర ఎస్ఐ వేమారెడ్డి, ట్రాఫిక్ ఫ్లెయింగ్ స్క్వాడ్ ఎస్ఐలు దశర«థరామన్, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస రావు, గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం ప్రహసనంగా మారిన ట్రాఫిక్ నియంత్రణ

నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రహసనంగా మారింది. సోమవారం నగరంలోని చిన్న వ్యాపారులపై పోలీసులు, కార్పొరేషన్ అధికారులు ప్రదర్శించిన జులుంపై విమర్శలు చెలరేగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన చిన్న వ్యాపారులను తొలగించడాన్ని తప్పుపట్టకపోయినా ట్రంకురోడ్డును ఆనుకుని శబరి శ్రీరామ క్షేత్రం నుండి కెవిఆర్ పెట్రోలు బంకు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కనకమహల్ సెంటర్ వరకు ఉన్న మెగా వ్యాపార అంగళ్ళు, ఆసుపత్రులు, హోటళ్ల విషయంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోపాటు వారిని సమర్దించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్పగుడి సెంటర్ నుండి అడ్డొచ్చిన వారిని దౌర్జన్యం చేసి మరీ వెనక్కు పంపుతున్న అధికారులు కీలకమైన ప్రాంతాల్లో అలాంటి చొరవ చూపకపోవడంపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా శబరి శ్రీరామ క్షేత్రం నుండి రోడ్డుకు ఇటు అటూ ఉన్న భారీ దుకాణాలు, సంస్థలు అన్నీ నిబంధనలు తుంగలోకి తొక్కి రోడ్డును ఆక్రమించుకున్నవేనని అధికారులే అంగీకరిస్తున్నారు. అయినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. వీటన్నిటికీ అనుమతులు స్థానికంగా పలుకుబడి కలిగిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిథుల అండతో రాజధాని నుండి వస్తున్నాయి. దీనితో స్థానిక అధికారులు, ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నీ బడా వ్యాపార సంస్థల వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా మారాయి. నిబంధనలను అతిక్రమించి రోడ్డును ఆనుకుని షాపులు నిర్మించుకున్న యాజమాన్యాలు కనీసం వాటివల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదు. ఒక ప్రముఖ హోటల్ కూడా ఈ కోవకు చెందినదే అయినప్పటికీ స్వంతంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ నియంత్రణలో పాలుపంచుకుంటోందని కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. మిగిలిన వ్యాపార సంస్థలు యథేచ్ఛగా నిబంధనలు తుంగలోకి తొక్కి కనీసం ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా రోడ్ల విస్తరణలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ఈ ప్రక్రియ నిర్మాణాత్మకంగా జరగడం లేదు. గతంలో రోడ్ల విస్తరణలో అధికారులు, ప్రజాప్రతినిథులు ముడుపులు అందుకుని చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా తాజాగా చేపడుతున్న ట్రాఫిక్ నియంత్రణా చర్యలు మెగా సంస్థలపై కూడా తీసుకుంటే అధికారుల చిత్తశుద్ధి తెలుస్తుందని జనం సవాలు విసురుతున్నారు. దీనిపై సీటి ప్లానర్ నాయక్ వివరణ ఇస్తూ నెల్లూరు కార్పొరేషన్‌లో నిబంధనలకు అనుగుణంగా జరిగిన నిర్మాణాలను వేళ్లపై లెక్కించవచ్చని పేర్కొన్నారు. తమ వంతు ప్రయత్నం చేసినా ఉన్నత స్థాయిలో వస్తున్న అనుమతులు ముందుకాళ్లకు బంధం వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సంఘటన పోలీసుల చొరవతో ట్రాఫిక్ సమస్యలకు కనీస పరిష్కారంగా జరిగిందన్నారు. ఇదే చొరవ ప్రజలు, ప్రజాప్రతినిథులు, అధికారుల నుండి లభిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.

నగరం లో ట్రాఫిక్‌ రూట్లపై మార్పులు

రోజు రోజుకీ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూట్లను పరిశీలించి పలువురు సలహాలు, సూచనల మేరకు రూట్‌ మ్యాప్‌ను తయారు చేసినట్లు జిల్లా ఎస్‌పి ఇ.దామోదర్‌ తెలిపారు. శనివారం ఉమేష్‌ చంద్ర అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టర్‌ ఆఫీసుకు పోయేరోడ్డును వన్‌వేగా చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆఫీస్‌కు వెళ్లే వాహనాలు నెహ్రూ బొమ్మ, అభిరామ్‌ హోటల్‌, జడ్పీ సెంటర్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దోభీ బజార్‌ సెంటర్‌, డైకస్‌ రోడ్డు సెంటర్‌ వైపు వెళ్లవచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో వెళ్లే వాహనాలకు ఎటువంటి వాహనాలు ఎదురు రాకూడదని సూచించారు.

అదేవిధంగా ఆచారి వీధి నుంచి దోభీ సెంటర్‌ మీదుగా వచ్చే వాహనాలు కలెక్టర్‌ ఆఫీసు నుంచి వచ్చే వాహనాలు డైకస్‌రోడ్డు మీదుగా, పాత చేపల మార్కెటు మీదుగా, ఉమామహేశ్వరి ఆలయం వైపు వచ్చి అక్కడ నుంచి జడ్పీ సెంటర్‌కు గాని, వాహబ్‌పేట ద్వారా నెహ్రూ బొమ్మ సెంటర్‌కు వెళ్లవచ్చునని తెలిపారు. అయితే ఈ వన్‌వే ట్రాఫిక్‌ అమలు చేసేందుకు అనువుగా ప్రజల వద్ద నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దీనిపై సూచనలు ఏవైనా తెలియజేయాలనుకున్నవారు నగర డిఎస్పీ రాధికారెడ్డిని, నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌రెడ్డికిగాని రాత పూర్వకంగా తెలియజేయాల్సిందిగా ఎస్‌పి కోరారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 7 సీటర్‌, అప్పి ఆటోలను నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించడం, తిరుగటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఎస్‌పి తెలిపారు. లారీలు, టిప్పర్లు, హెవీ గూడ్స్‌ వెహికల్స్‌ను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని అమలుపరుస్తున్నట్లు తెలిపారు.

ఈ విధమైన నిషేధాఙ్ఞలు నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించే పలు కూడళ్ల వద్ద నుంచి అమలులో ఉంటుందని ఎస్‌పి తెలిపారు. వాటిలో కోవూరు వైపు నుంచి వచ్చు వాహనాలు వెంకటేశ్వరపురం వరకు, జొన్నవాడ వైపు నుంచి వచ్చు వాహనాలు ఇరుగాళమ్మవారి ఆలయం వరకు, మద్రాసు వైపు నుంచి వచ్చు వాహనాలు హైవే నుండి, టౌన్‌లోకి వచ్చు ఎంట్రీ పాయింట్‌ అయిన అయ్యప్పగుడి రోడ్డు వరకు, ముత్తుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్‌-5 అండర్‌ బ్రిడ్జి వరకు, చిల్డ్రన్స్‌ పార్క్‌ నుంచి వచ్చు వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్‌ అయిన చింతారెడ్డిపాళెం వరకు, గొలగమూడి వైపు నుంచి వచ్చే వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్‌ వరకు, నరుకూరు నుండి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్‌-5 అండర్‌ బ్రిడ్జి వరకు, మైపాడు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు సబ్‌ స్టేషన్‌ సెంటర్‌ వరకు, ఎన్టీఆర్‌ నగర్‌ నుంచి వచ్చు వాహనాలు ఎన్‌హెచ్‌-5 ఎంట్రీ పాయింట్‌, పొదలకూరురోడ్డు నుంచి వచ్చే వాహనాలు తెలుగుగంగ ప్రాజెక్టు వరకు వస్తాయని ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా మద్రాస్‌ బస్టాండు వద్దవున్న కూరగాయల మార్కెట్‌ వద్దగాని, ఐసిఐసిఐ బ్యాంకు వద్ద గాని, వాహనాలను పార్క్‌ చేయకుండా వాటిని అక్కడేవున్న కోనేరు గ్రౌండ్‌లో పార్క్‌ చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్‌పి జిఆర్‌.రాధిక, రూరల్‌ డిఎస్‌పి రవికుమార్‌, ట్రాఫిక్‌ సిఐలు, నగర సిఐ, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, నగర ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Saturday, April 10, 2010

ఆనం వారి ఇంట పెళ్లి సందడి

సిఎం పర్యటన వాయిదాపై పలు ఊహాగానాలు

అధికార పార్టీలో గ్రూపు రాజకీయాల ప్రభావం వల్లే పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ముద్ర పడిన ఆనం సోదరులు ఈ పర్యటనా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండడంతో వ్యతిరేక వర్గం సహజంగానే డీలా పడింది. వైఎస్ హయాంలో ఆనం సోదరులు హవా సాగించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి రాజకీయంగా వెనుకబడి పోయారు. దీనితో ఆనం సోదరుల ఆధిపత్యానికి తిరుగులేకుండా పోవడంతో వ్యతిరేక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో సమీకరణలు మారాయి. తన పాత సన్నిహితులు ముఖ్యమంత్రి కావడంతో నేదురుమల్లి సహజంగానే మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన మద్దతుతో ఆనం వ్యతిరేక వర్గం కూడా తేరుకుంది. ఓ దశలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డికి నేదురమల్లి మద్దతుతో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆనం సోదరులు మాత్రం చాపకింద నీరులా మళ్లీ తమ బలాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలో సిఎం రోశయ్య పర్యటనపై కూడా చర్చ జరిగింది. సిఎం పర్యటన కార్యక్రమాల ఖరారులో ఆనం సోదరుల ప్రమేయమే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన చేపట్టిన ఐదవ విడత భూపంపిణీ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రోశయ్య చేతులు మీదుగా జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. అదే రోజు సిఎం పర్యటనకు సంబంధించి సభా స్థలాన్ని ఎంపిక చేసి పరిశీలించి వచ్చారు. అయితే సిఎం పర్యటన విషయంలో శుక్రవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుందని చెప్పారు. కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో కానీ సిఎం పర్యటన మాత్రం వాయిదా పడింది. దీని వెనుక ఆనం వ్యతిరేక వర్గం పట్టు ఉందనే ప్రచారం ఊపందుకుంది. తమ ప్రమేయం లేకుండా ఆనం సోదరులు చేతిలో పర్యటన ఏర్పాట్లు జరుగుతుండడంతో గ్రూపుల మధ్య సమతుల్యం దెబ్బతిని వాయిదా పడిందని ఆనం వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. అయితే పర్యటన వాయిదాకు సంబంధించిన కారణాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించనున్నారు. దీనితో సిఎం పర్యటన వాయిదా సంబంధించి జరుగుతున్న ఊహాగానాలకు తెరపడుతుంది.

సిఎం పర్యటన వాయిదా

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు సిఎం పేషీ నుండి శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది. దీనితో ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన భూపంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడింది. సిఎం పర్యటన, భూపంపిణీ వాయిదా విషయాన్ని జిల్లా కలెక్టర్ కె రామ్‌గోపాల్ ధృవీకరించారు. అదే రోజున ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రికి అపాయంట్‌మెంట్ ఖరారయనందునే పర్యటన వాయదా పడినట్టు తెలిపారు.

పెంచలకోన అభివృద్ధికి మోహన్‌బాబు రూ. లక్ష విరాళం

పెంచలకోన ఆలయ అభివృద్ధికి ప్రముఖ సినీ నటుడు, లక్ష్మీప్రసన్న ఆర్ట్‌మూవీస్ అధినేత మంచు మోహన్‌బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. శుక్రవారం ఆయన స్వామి దర్శనానికి ఇక్కడకు వచ్చారు. ఆలయ పాలకవర్గ చైర్మన్ అమరా శ్రీరాములుశ్రేష్టి, సహాయ కమిషనర్ శ్రీరామమూర్తి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో సహా వచ్చిన ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు స్వామివారికి, అమ్మవారికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి చైర్మన్ అమరా శ్రీరాములు వారికి వివరించారు. ఇందుకు స్పందించిన మోహన్‌బాబు వెంటనే తనవంతుగా ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయల విరాళం ఇస్తానంటూ ప్రకటించారు. అనంతరం ఆయనకు స్వామి, అమ్మవార్ల ప్రసాదాన్ని వేదపండితులు అందజేశారు. రాపూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఆయన తోటల్లోకి వచ్చిన సందర్భంగా స్థానిక విలేఖర్లు వార్త సేకరణ నిమిత్తం వెళ్లగా ఫోటోలు తీసేందుకు, వీడియో చిత్రీకరించేందుకు ఆయన నిరాకరించారు.

Friday, April 9, 2010

నగరంలో మంత్రి రఘువీరా రెడ్డి

నగరంలో సినీ ప్రముఖులు


నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన ఒక కళ్యాణానికి సినీ నటుడు మోహన్‌బాబు దంపతులు, ఆయన కుమారుడు హీరో విష్ణువర్థన్‌బాబు, కోడలు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, అల్లుడు, ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. విష్ణువర్థన్‌బాబుతోపాటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌ కళాశాలలో చదువుకున్న అశోక్‌కుమార్‌ వివాహానికి వారు హాజరయ్యారు. అశోక్‌కుమార్‌ ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఒక చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు నగరమంటే తనకు ఎంతగానో ఇష్టమని, తన భార్యది నాయుడుపేట కావడంతో తాను నెల్లూరు అల్లుడు అయ్యానన్నారు.

భార్య సమాధి వద్ద సినీనటుడు మోహన్‌బాబు పూజలు

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు గురువారం తన కుటుంబ సభ్యులతో కలసి నాయుడుపేటలో ఆయన మొదటి భార్య విద్యావతి సమాధి వద్ద పూజలు నిర్వహించారు. స్థానిక రాజగోపాలపురంలోని దివంగతనేత వెంకటప్పనాయుడు పెద్దకుమార్తె విద్యావతి ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు మొదటి భార్య. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక అమరా గార్డెన్‌లో వారి వ్యవసాయ పొలాల్లో ఆమె సమాధి ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మోహన్‌బాబు ప్రత్యేకంగా వచ్చి అక్కడ పూజలు నిర్వహిస్తారు. గురువారం మోహన్‌బాబు, సతీమణి నిర్మలమ్మ, పెద్దకుమారుడు విష్ణువర్ధన్ బాబు, కుమార్తె లక్ష్మీప్రసన్నలతో కలసి సమాధి వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా విలేఖర్ల ఆయనతో మాట్లాడేందుకు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.

Wednesday, April 7, 2010

సిఎం రాకపై ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి


ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కె.రోశయ్య నగరానికి రానుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులు, నేతలతో సమీక్షించారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక విఆర్‌. హైస్కూల్‌ మైదానానికి వెళ్లి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి, నెల్లూరు రూరల్‌ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్‌ భానుశ్రీ, జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌, ఎస్‌పి ఇ.దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

నగర వాసులకు రోజుకు ఒక్కొక్క కుటుంబానికి 105 లీటర్ల నీరు : మంత్రి


నెల్లూరు నగర వాసులకు రోజుకు ఒక్కొక్క కుటుంబానికి 105 లీటర్ల నీటిని అందజేస్తున్నామని, త్వరలో 130 లీటర్ల నీటిని అందజేసి ప్రజలకు సంపూర్ణంగా మంచినీటి సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక పొదలకూరురోడ్డులోని వాటర్‌ ట్యాంకు వద్ద రూ.1.35 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మంచినీటి పైప్‌ లైన్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మరో మూడు నెలల్లో నెల్లూరు చెరువులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పూర్తవుతుందని, తద్వారా నగర వాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందగలదన్నారు.

సభకు నగర మేయర్‌ భానుశ్రీ అధ్యక్షత వహించి మాట్లాడారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను దేశంలో అమలుపరచగలిగితే ప్రతి ఒక్కరూ సుఖజీవనం సాగించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

నగరంలో ఆదునిక చేపల మార్కెట్

నగరం లో అలరించిన నాటికలు

Tuesday, April 6, 2010

నెల్లూరు టవున్ హాలు లో వై.కామేశ్వరరావు మెమోరియల్ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం


సోమవారం రాత్రి నెల్లూరు పురమందిరం ఓపెన్ ఆడిటోరియంలో వై.కామేశ్వరరావు మెమోరియల్ నా టక పరిషత్ 2010 రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో భానుచందర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. పోటీల్ని జ్యోతి ప్ర జ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడు తూ కళాకారులు, ప్రేక్షకులు ఎదురు ఎదురుగా ఉండి ఒకరి హృదయాలలో ఒకరు ఇమిడిపోయే ప్రక్రియ ఒక నాటకంలోనే ఉందన్నారు. ఏదైనా కళను ప్రాక్టీసు చేస్తే రాదని, కళ భగవంతుడు ఇచ్చే వరం అన్నారు. మంచి స్నేహశీలి వై.కామేశ్వరరావును భౌతికంగా చూడకపోయినా ఆయన స్మారకంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటికల పోటీలలో పాల్గొనడం తన అదృష్టంగా తెలిపారు. సినిమాలు, టీవీలు వచ్చినా నాటకాలకు ఇంకా ఆదరణ ఉందనే వాటిని ప్రోత్సహిస్తు న్న ప్రేక్షకుల గొప్పదనమని కీర్తించా రు.


భానుచందర్ కు ఘనంగా సన్మానం

వై.కామేశ్వరరావు మెమోరియల్ నాటక పరిషత్ 2010 తరపున భానుచందర్‌కు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. పరిషత్ తరపున భానుచందర్ బంగారు నంది అవార్డు గ్రహీత మేకప్‌మెన్ ఫరీఫ్‌ను, భక్తిగీ తాల గాయకుడు గూండాల గురవ య్యలను, వై.కామేశ్వరరావు, స్మారక అవార్డు, ప్రముఖ హాస్యనటులు కొండ వలస లక్ష్మణరావు,లకు నగదు పుర స్కారాలు అందజేశారు.
అనంతరం వేదిక అలంకరించిన ప్రముఖులంద ర్ని భానుచందర్ సన్మానించారు. .

కోర్పోరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల : ఎమ్మెల్యే ఆనం వివేకా


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అవసరమయ్యే మౌళికసదుపాయాలను అందించడంలో మందుంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నారాయణరెడ్డిపేట గ్రామానికి చెందిన చేవూరి రంగారెడ్డి, వెంకమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు ఇక్కడి జడ్పీ హైస్కూల్‌ విద్యార్ధులకు సోమవారం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే వివేకా మాట్లాడుతూ పాఠశాలకు అవసరమయ్యే 12అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయిస్తానన్నారు. క్రీడా ప్రంగణం కోసం స్థలం మంజూరుచేయిస్తానని హామినిచ్చారు. పాఠశాల లెవలింగ్‌ నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. హైస్కూల్‌ ప్రవేశ ద్వారానికి ఎంపీటీసి నిధులు ద్వారా హాచ్‌ నిర్మిస్తామన్నారు. కోర్పోరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని విధాల సహకరిస్తానని ఆయన హామినిచ్చారు.

Monday, April 5, 2010

పిల్లల వినోద ప్రపంచం " గేమ్ కింగడమ్ " : ఆనం


నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో ఆదివారం నాడు చిన్నారుల వినోదం కోసం గేమ్ కింగ్ డమ్ ను రూరల్ యమ్.యల్.ఏ ఆనం వివేకానంద రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో చిన్నారు లే రారాజులన్నారు. పెద్ద నగరాలలో ఉన్న సదుపాయాలను నెల్లూరు లో ప్రారంభించడాన్ని ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో గేమ్ కింగ్ డమ్ M.D ఏ.మురళి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పధకాల ప్రచార రధాన్ని ప్రారంభించిన ఆనం

ఈ నెల 6న పైప్‌లైన్ల ప్రారంభం


నగరంలోని పొదలకూరురోడ్డు వాటర్‌ వర్క్‌‌సలో రూ.1.34 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పొదలకూర్ రోడ్డు కొత్త పైప్‌ లైన్లను ఈ నెల 6వ తేదీన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలలోమహాత్మాగాంధీ పార్కు

నగరం నడిబొడ్డున గాంధీబొమ్మ సమీపంలోవున్న మహాత్మాగాంధీ పార్కు దుర్గంధాలకు నిలయంగా తయారైంది. పార్కుకు పడమర వైపున జలగం వెంగళరావ్‌ కార్పొరేషన్‌ భవనంలోని అద్దెకున్న వ్యాపారస్తులు విడుదల చేసే వ్యర్థ జలాలతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు పార్కుకు వచ్చే సందర్శకులు చెపుతున్నారు. ఒక పక్క మురికి నీటితో దుర్గంధం, మరో పక్క సినిమాహాలు వలన వచ్చే ధ్వని కాలుష్యంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా, నగరం నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి ఇక్కడ కూర్చొని విపులంగా చర్చించే మేధావులు, రాజకీయ నిపుణులు సైతం ఈ పార్కును గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ పార్కులో ప్రస్తుతం నీళ్ల వసతి లేక చెట్లు ఎండిపోతున్నా, వేలకు వేలు ఖర్చుచేసి నిర్మించిన వాటర్‌ పౌంటైన్‌లు కళావిహీనంగా తయారై చూపరుల ఛీత్కారాని గురవుతున్నా పట్టించుకునే నాథులే లేకపోవడం దారుణం. పార్కులో ఉన్న ఒకే ఒక బావిలోని నీరు వేసవి ప్రభావం వలన అడుగంటి పోయాయి, అయినా పార్కులోని చెట్లుకు నీరు లేకుండా ఆ మిగిలిన నీటిని పక్కన నిర్మాణం జరుపుకుంటున్న పనులకు కాంట్రాక్టర్‌ వాడుకోవడం విశేషం.

Sunday, April 4, 2010

కేంద్ర మంత్రి మునియప్పకు సన్మానం


శనివారం రైల్వే సహాయ మంత్రి బసచేసిన డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కలిసి ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించారు. నెల్లూరు రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.

నెల్లూరు రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్ప


నెల్లూరు రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన మంత్రి మునియప్ప స్టేషన్‌ నిర్వహణతో పాటు అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ప్రధానంగా ప్రయాణీకులకు అవసరమైన మంచినీటి వసతిని పరిశీలించిన మంత్రి అక్కడ నీరు వేడిగా వస్తుండడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణీకులు ఇటువంటి వేడినీటి ని ఎలా తాగగలరని ప్రశ్నించారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులను పలు వసతులపై ఆరా తీశారు. ప్రయాణీకులు సరిపడా బల్లలు లేక నిలబడి ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ ప్రాంగణంలో ఎప్పుడూ కనిపించని చెత్తబుట్టలు మంత్రి తనిఖీ సమయంలో దర్శనమివ్వడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్‌ ఎన్‌.భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

బొల్లినేని నర్సింగ్ విద్యార్ధి ఆత్మాహత్య

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి - http://www.youtube.com/watch?v=n7tuJYckF4Q

జనార్దన్‌రెడ్డికి అన్న అయినందుకు తాను సిగ్గుపడుతున్నా : నేదురుమల్లి పద్మనాభరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్‌గా తనయుడు రామ్‌కుమార్‌రెడ్డిని నియమించి తమను వీధిన పడేశారని, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి అన్న అయినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఎఐసిసి సభ్యులు, ఎన్‌బికెఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి ధ్వజమెత్తారు.

చాటు మాటుగా ఉంటూ వెన్నుపోటు పొడిచి తనను వీధిన పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ముఖ్యమంత్రిని కలిశానే కానీ స్వార్ధంతో కాదన్నారు. కళాశాల నిర్మాణంలో తాను ఒక తాపీ మేస్ర్తి లాగా పని చేశానన్నారు. విద్యా సంస్థలు తమకు కావాలని జనార్దన్‌రెడ్డి అడిగితే తానే వారికి ఇచ్చేవారినని చెప్పారు. ఇంజనీరింగ్‌ కళాశాలను రామ్‌కుమార్‌రెడ్డి దౌర్జన్యంగా లాక్కున్నారని ఇదేమి న్యాయమని జనార్దన్‌రెడ్డిని అడిగితే కుమారునితో మాట్లాడుకోమన్నారని చెప్పారు. తాను రామ్‌కుమార్‌రెడ్డి దగ్గరకెళ్లి చేతులు కట్టుకుని నిలబడాల్నా అని ప్రశ్నించారు. తమ చిన్నాన బాల కృష్ణారెడ్డి మహానుభావుడన్నారు.

నాడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలకు తమ సొమ్మే ఖర్చు చేశామన్నారు. సొమ్ము నాది సోకు జనార్దన్‌రెడ్డిది అని ఎద్దేవా చేశారు. కనీసం జనార్దన్‌రెడ్డి జీవితచరిత్ర పుస్త్తకంలో కూడా తన పేరు ప్రస్తావించలేదని పద్మనాభరెడ్డి తన బాధను వ్యక్తం చేశారు. జనార్దన్‌రెడ్డిని దళితద్రోహిగా పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. తానొక దళితునికి పనిచేయడం తప్పా అని కాంగ్రెస్‌ పార్టీకి కృషి చేయడం తప్పా అని ప్రశ్నిస్తూ జనార్దన్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌పార్టీలో ఎన్నో పదవులు పొందుతూ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ కూడా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కృషి చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘానికి తాను జీవిత కాలపు చైర్మన్‌అని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. తాను ఎక్కడ విద్యా సంస్థల కోసం న్యాయ పోరాటం చేస్తామో అని జనార్దన్‌రెడ్డి కుట్రతో కోర్టులో ముందుగానే కేవియట్‌ దాఖలు చేసి రామ్‌కుమార్‌రెడ్డి అక్రమంగా ఇంజనీరింగ్‌ కళాశాలను లాక్కున్నారన్నారు.

Saturday, April 3, 2010

నగరాభివృధికి శ్రమిస్తున్న మేయర్ : ఆనం


మేయర్ కనపడటం లేదని ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని రూరల్ M.L.A ఆనం వివేకానంద రెడ్డి అన్నరు. కొన్ని సమస్యల వల్ల ఆమె 15 రోజులుగా నగరంలో లేదని, అదే సమయంలో రాజధాని లో ఉంటూ నగరాభివృదికి రూ.23 కోట్లును మంజూరు చేయుంచుకు వచ్చారని చెప్పారు. ఇబ్బందులలో కూడా నగర అభివృధి కోసం కృషి చేసారని ప్రసంసించారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే


యేసుక్రీస్తు శిలువపై మరణించిన శుభ శుక్రవారాన్ని (గుడ్‌ ఫ్రైడే) పురస్కరించుకుని నగరంలో పలు క్రైస్తవ దేవాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో శిలువ ధ్యాన ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు.

శిలువను మోసిన రూరల్‌ ఎమ్మెల్యే ఆనం

నగరంలోని ఫత్తేఖాన్‌పేట రోమన్‌ క్యాథలిక్‌ దేవాలయం నిర్వహించిన ప్రత్యేక శిలువ యాత్ర కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శిలువను మోశారు. పాపుల పాపాలను భరించడానికి ఏసుక్రీస్తు శిలువను ఎక్కి మానవాళిని రక్షించాడని ఆయన పేర్కొన్నారు.

Friday, April 2, 2010

నేదురుమల్లి ఇంట పెళ్ళి సందడి


మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్ది భార్య రాజ్యలక్శ్మి సోదరుడు మేడా సునీల్ కుమర్ రెడ్డి కుమార్తె నిచ్చల, లిల్లి లిటిల్ ప్లవర్ పాఠశాల కరస్పాండెంటు ఇ.సి. నారాయణ రెడ్డి కుమారుడు చైతన్య వివాహ నిశ్చితార్దం నెల్లూరు లోని జనార్దన్ రెడ్డి స్వగృహమైన స్వర్ణముఖి లో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రముఖులు పాల్గొన్నరు.

ఈ కార్యక్రమానికి పద్మనాభరెడ్ది కుటుంబం హాజరుకాక పోవడం చర్చాంశనీయమైనది.

కార్పోరేషన్ కార్యాలయానికి మేయర్ భానుశ్రీ


దాదాపు 20 రోజులుగా కార్పోరేషన్ కార్యాలయానికి దూరంగా ఉన్న మేయర్ గురువారం సాయంత్రం తన చాంబర్ కు వచ్చారు. సీనియర్ కార్పోరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేసారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జిల్లా పర్యటన ఈనెల 5, 6 తేదీలలో


రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 5, 6 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారు. అయిదవ తేదీ సాయంత్రం అనంతపురం నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకొంటారు. ఆరవ తేదీ మంగళవారం ఉదయం నగరంలోని పలు సిసి రోడ్లకూ, డ్రైయినేజీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేస్తారు. అదే రోజు ఉదయం పది గంటలకు నగరంలో చేపల మార్కెట్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు 5వ విడత భూ పంపిణీ, ప్రజాపథం, రైతు సదస్సు, రైతు చైతన్య యాత్రలు సంబంధిత అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఏడవ తేదీ ఉదయం రోడ్డు మార్గాన రేణిగుంట బయల్దేరి వెళతారు.

నెల్లూరు లో ఎండలు


జిల్లా నిప్పుల గుండంగా మారుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు మండుతుండడంతో చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి గా గురువారం 42.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకొంది.
గత పది రోజులుగా 36 నుంచి 39 వరకు ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం నుంచి పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు 42.1కి చేరుకోగా, రాత్రి ఉష్ణోగ్రతలు 28.1గా నమోదయ్యాయి.

Thursday, April 1, 2010

ఆనం తో భానుశ్రీ శాశ్వతంగా దూరం


నెల్లూరు నగరంలో జరిగిన, జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకు విసుగు చెందిన నగర మేయర్‌ భానుశ్రీ రాజీ యాలకు శాశ్వతంగా దూరం కానున్నట్లు తెలిసింది. ప్రశాంతంగా ఉంటున్న తనకు మేయర్‌ పదవి కిరీటం విషయం అటుంచి ఆ పదవి వల్లే తాను అన్ని విధాలా నష్టపోయానని ఆమె భావిస్తున్నారు. నమ్ముకున్న వారు నట్టేట ముంచారన్నదే భానుశ్రీ ఆవేదనగా ఆంతరంగికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులైన రాజీవ్‌ భవన్‌ నేతలు తనను అడ్డుగా పెట్టుకుని మానసికంగా క్షోభకు గురి చేసినా ఇన్నాళ్లూ ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ, ఆ మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా తయారై ఆమె భర్త ట్రాన్స్‌కో డిఇఇ సుబ్బరాజును జైలుకు పంపేంతవరకు రావడంతో ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, మరోవైపు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించారని రాజీవ్‌ భవన్‌ నేతలు చేసిన ఆరోపణలు ఎసిబి దాడులతో తేటతెల్లమైనాయని భానుశ్రీ ఓవైపు గంభీరంగా చెబుతున్నప్పటికీ, మరోవైపు తన భర్తను అన్యాయంగా జైలుపాలు చేసి కుటుంబ గౌరవాన్ని కాస్తా వీధులపాలు చేసిన రాజీవ్‌భవన్‌ నేతలపై ఆమె తీవ్రంగా రగిలిపోతున్నారు. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందాన తనను మానసిక క్షోభకు గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే విషయమటుంచి తనపై ఈగ కూడా వాలనీయకుండా చూడగలరని నమ్ముకున్న ఆనం సోదరులు, ముఖ్యంగా అగ్రజుడు ఆనం వివేకానందరెడ్డి ఈ విషయంలో నిస్సహాయతను ప్రదర్శించడం ఆమె జీర్ణించుకోలేకుంది. మరోవైపు మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎసిబి దాడులను అడ్డుకోలేకపోవడం, తన భర్తను జైలుకు వెళ్లనీయకుండా చూడడం, చివరకు బెయిలు మంజూరు విషయంలో కూడా ఏమాత్రం తమ రాజకీయ అనుభవం, పరపతిని ఉపయోగించలేకపోవడం వంటి కారణాలతో భానుశ్రీ అటు ఆనం వర్గంతో తెగతెంపులు చేసుకోవడంతోపాటు మరో ఆరు నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ మేయర్‌ పదవిని తృణప్రాయంగా త్యజించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాజకీయాలకు మేయర్ భానుశ్రీ భై భై ???


ముళ్ల కిరీటం వంటి మేయర్‌ పదవిని చేపట్టిన నాటి నుంచి స్వపక్షీయుల నుంచే తీవ్రంగా ఎదురైన నిరసనను ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఆదిలోనే అణచివేసివుంటే ప్రత్యర్థులకు ఇంతటి అవకాశం ఉండి ఉండేది కాదని ఆమె అభిప్రాయంగా తెలిసింది. గతంలో సీనియర్‌ కార్పొరేటర్‌ సందానీబాషా స్వయంగా మంత్రి ఆనం ఇంట్లో నలుగురి ముందు తనను అవమానపరచినా అప్పట్లో వివేకానందరెడ్డి దానిని సీరియస్‌గా తీసుకోకపోవడం, మరోవైపు కొత్తగా ఎన్నికైన స్వపక్ష కార్పొరేటర్లు సైతం తనను విభేదిస్తుండడం, తాను పాల్గొనే కార్యక్రమాలకు వారు డుమ్మా కొడుతూ ప్రత్యర్థులకు ఒక అవకాశం కల్పించారన్నది ఆమె ఆవేదన. రాజీవ్‌భవన్‌ నేతలను ఒంటరివారుగా చేసి రాజకీయంగా ఆదిలోనే అణచివేసివుంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేదా అని ఆమె తమ ముఖ్య అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

కేవలం తన ఒక్కరినే కాకుండా తమ బంధువులైన పాపానికి అందరినీ రచ్చకీడ్చిన వారి అంతం చూసేంతవరకు నిద్రపోనని ఆమె భీష్మించుకు కూర్చుంది. గత 20 రోజులుగా రాజధాని నగరంలో మకాం పెట్టిన భానుశ్రీ ఎట్టకేలకు బుధవారం నగరానికి వచ్చారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సాయిబాబా మీద ప్రమాణం చేసినప్పటికీ, ఆయన సైతం తనను రక్షించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న తన భర్త సుబ్బరాజు ఉద్యోగ ప్రస్థానంలో తన కారణంగా మచ్చ ఏర్పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. అసలు ఈ రచ్చ జరగడానికి కారణం రాజకీయాలే అని భావించి అసలు వాటినే వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చిన ఆమె ఈ నెల 3వ తేదీన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మేయర్‌ పదవితోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లుగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

నగరం లో మేయరమ్మ భానుశ్రీ


తన భర్త, ట్రాన్స్‌కో డిఇఇ నందిమండలం శివ సుబ్బరాజు ఎసిబి కేసులో ఇరుక్కున్న నేపధ్యంలో ఆయన బెయిల్ ప్రయత్నాల్లో తలమునలైన మేయర్ భానుశ్రీ ఇరవై రోజుల తరువాత నగరానికి తిరిగి రావడంతో రాజకీయ హడావుడి నెలకొంది. ఇరవై రోజుల క్రితం ఆమె భర్త ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి దాడులకు గురై అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎసిబి కోర్టు ఆయనకు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు పంపింది. ఆయన విడుదల కోసం మేయర్ భానుశ్రీతో సహా ఆనం సోదరులు గట్టి ప్రయత్నమే చేశారు. వారి ప్రయత్నాలు పక్షం రోజుల తరువాత ఫలించాయి. అయితే ఇరవై రోజుల్లోనూ నగరంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగర మేయర్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించారని విపక్షాలు విరుచుకుపడటమేగాకుండా ప్రదర్శనలకు దిగాయి. సిపిఎం ఒకడుగు ముందుకేసి మేయర్ బాధ్యతలను డిప్యూటీ మేయర్‌కు బదలాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. ఇదిలాఉండగా మేయర్ నెల్లూరుకు తిరిగివచ్చిన సందర్భంగా ఆనం వర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇరవై రోజులుగా స్థబ్ధుగా ఉన్న కాంగ్రెస్ రాజకీయాలకు మళ్లీ ఊపువచ్చినట్లైంది. మేయర్‌ను పరామర్శించడానికి సిద్ధమైన కొందరు అధికారులు హడావుడిగా ఆమె ఇంటికి బయలుదేరారు. ఇరవై రోజులుగా మేయర్ ప్రస్తావన లేకుండా పని చేస్తున్న అధికారుల్లో బుధవారం కదలిక కనిపించింది. అయితే మేయర్ మాత్రం తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో గంభీరంగా వ్యవహరించారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళిక రూపొందించుకోవడంలో ఆమె నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇరవై రోజులుగా నగరానికి దూరమైన నేపధ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆమె సమీక్షించారు. వీటిపై ఆనం సోదరుల స్పందనను బట్టి ప్రణాళిక అమలు చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశం జరగకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పోరేషన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని తెలిసి కూడా తన కుటుంబ సమస్యల పరిష్కారానికి పరిమితమై నిర్లక్ష్యం చేయడం పట్ల సిపిఎం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు స్తంభించిపోయేలా మేయర్ వ్యవహరించిన తీరు గర్హనీయమని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.