
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 5, 6 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారు. అయిదవ తేదీ సాయంత్రం అనంతపురం నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకొంటారు. ఆరవ తేదీ మంగళవారం ఉదయం నగరంలోని పలు సిసి రోడ్లకూ, డ్రైయినేజీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేస్తారు. అదే రోజు ఉదయం పది గంటలకు నగరంలో చేపల మార్కెట్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు 5వ విడత భూ పంపిణీ, ప్రజాపథం, రైతు సదస్సు, రైతు చైతన్య యాత్రలు సంబంధిత అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఏడవ తేదీ ఉదయం రోడ్డు మార్గాన రేణిగుంట బయల్దేరి వెళతారు.
No comments:
Post a Comment