
నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన ఒక కళ్యాణానికి సినీ నటుడు మోహన్‌బాబు దంపతులు, ఆయన కుమారుడు హీరో విష్ణువర్థన్‌బాబు, కోడలు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, అల్లుడు, ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. విష్ణువర్థన్‌బాబుతోపాటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ కళాశాలలో చదువుకున్న అశోక్‌కుమార్ వివాహానికి వారు హాజరయ్యారు. అశోక్‌కుమార్ ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఒక చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు నగరమంటే తనకు ఎంతగానో ఇష్టమని, తన భార్యది నాయుడుపేట కావడంతో తాను నెల్లూరు అల్లుడు అయ్యానన్నారు.
No comments:
Post a Comment