
యేసుక్రీస్తు శిలువపై మరణించిన శుభ శుక్రవారాన్ని (గుడ్ ఫ్రైడే) పురస్కరించుకుని నగరంలో పలు క్రైస్తవ దేవాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో శిలువ ధ్యాన ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు.
శిలువను మోసిన రూరల్ ఎమ్మెల్యే ఆనం
నగరంలోని ఫత్తేఖాన్‌పేట రోమన్ క్యాథలిక్ దేవాలయం నిర్వహించిన ప్రత్యేక శిలువ యాత్ర కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శిలువను మోశారు. పాపుల పాపాలను భరించడానికి ఏసుక్రీస్తు శిలువను ఎక్కి మానవాళిని రక్షించాడని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment