నేడు నెల్లూరు

Saturday, October 16, 2010

వ్యూహం ప్రకారమే ఓదార్పుయాత్ర

కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అన్ని వర్గాలను ఆకట్టు వ్యూహంతో సాగు తోంది. అయితే రెండోరోజూ కూడా జగన్ నోటి వెంట అవే పలుకులు వినిపిస్తున్నాయి. ఈ పర్యటన వైఎస్ పథకాల జపం ఇందులో ప్రధాన భా గం. మృతుల కుటుంబాలను పరామ ర్శించే కార్యక్రమం రహస్యంగాు మారింది

ప్రతి సభలోను కాబోయే సిఎం జగన్ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.ఇది అధిష్టానానికి ఒక రకంగా ఓదార్పు ద్వారా హెచ్చరిక సంకేతాలు పంపుతున్నారు.కావలిలో బుధవారం రాత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మొ క్కుబడి తంతుగా నిర్వహించడం కలికి వర్గీయులు, అభిమానులను తీవ్ర అ సంతృప్తికి గురిచేసింది.. కోవూరు ఎమ్మెల్యే జగన్‌తో జతకట్టి ఓదార్పు యాత్రల్లో పాల్గొన్నారు. రెండో రోజైన గురువారం కావలి పట్టణం, రూరల్ ప్రాంతాలకే ఈ యాత్ర పరిమితమైంది.

అవే పలుకులు
బుధవారం రాత్రి 8.30గంటలకు జిల్లా సరిహద్దులోకి జగన్ అడుగు పెట్టారు. ప్రకాశం జిల్లాలో అన్ని తానై నడిపించిన మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సరహద్దు వరకు వచ్చి జగన్‌ను జిల్లా నేతలకు అప్పగించి వెనుదిరిగారు. చేవూరు వద్ద జగన్ వర్గీయులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాలుగున్నర గంటలు జగన్ ఆలస్యంగా రావడం, కారులోనే కూర్చొని చేతులూపడంతో చాలా సేపు నిరీక్షించిన కొంతమంది జనం నిరాశగా తిరుగుముఖం పట్టారు.

5 గంటల పాటు జరిగిన తొలి రోజు పర్యటనలో వైఎస్ విగ్రహాలతో పాటు కావలి మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభల్లో జగన్ వైఎస్ పథకాలను ఏకరువు పెట్టారు. జనం చేత పదే పదే వైఎస్ పేరు జపించే విధంగా చూశారు. తొలి రోజు సభల్లో ఎమ్మెల్యేకొండాసురేఖ ఆనం సోదరులు లక్ష్యంగా మాట్లాడారు. ము న్సిపల్, సహకార ఎన్నికలు వాయిదా వేయడాన్ని ఎండగట్టారు.

ఇక ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీరు ఏం కోరుతున్నారు... మీ తాపత్రయం ఏమిటి అంటూ సభికులను ప్రశ్నించి, జగన్‌ను సిఎంను చే యాలని వ్రారు చెప్పినట్లు అధిష్టానం దృష్టికి తీసుక పోతామన్నారు. తొలి రోజు పర్యటన ్ధరాత్రి ఒంటిగంట దాటే వరకు సాగింది. జనం కూడా ఒపిగ్గా ఉండి జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటారు.ప్రతి సమావేశంలో చెప్పిన మాటలనే పదే పదే చెబుతుండడంతో పాటు ఆకట్టుకొనే రీతిలో జగన్ ప్రసంగం సాగడంలేదు.కొన్నిచోట్ల ఐదు నిమిషాలు లోపే ప్రసంగాన్ని ముగిస్తున్న ఆయన వైఎస్ పేరే జపిస్తూ వస్తున్నారు. వైఎస్ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారిని ఆకట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సభికుల చేత నేవైఎస్ఆర్... అంటూ ప్రతి సారి చెప్పిచడంతో పాటు జగన్ కూడా మూడు, నాలుగు సార్లు వైఎస్ ఆర్... అంటూ వారితో శృతి కలుపుతు న్నారు. ఈ యాత్రలో చిత్తూరు, కడ ప ప్రాంతాల నేతల సందడే జోరుగా ఉంది.

అంతా వ్యూహం ప్రకారమే
రెండు నెలలుగా జిల్లాలో జగన్ ఓదార్పుయాత్రకు జగన్ వర్గీయులు రాత్రింబవళ్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి కార్యక్రమాన్ని వ్యూహం ప్రకారం రూపొందించారు. జగన్ గ్రామానికి రాకముందే పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంఘీబావం తెలిపే విధంగా చూ స్తున్నారు. మేళ తాళాలతో స్వాగతం, స్థానికులనుు సమీకరించ డం వంటివి కూడా ముందుగానే చూస్తున్నారు. జగన్ అడుగుపెట్టగానే జగన్ జిందాబాద్ , కాబోయే సిఎం జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు మార్మోగుతున్నాయి.

కొద్దిసేపు జగన్ వైఎస్ పథకాలను వివరించి వాటి ద్వా రా పొందే లబ్దిని గుర్తుచేసి భవిష్యత్‌లో నేనే మీకు అండగా నిలుస్తానని సంకేతాలిస్తున్నారు.. ఇక గ్రామాలో పిల్లలతో ముద్దాడడం, వృద్ధులను పలకరించి చేతులు కలపడం ఈ యాత్రలో తళుక్కులు. ఒక్కసారిగా కాన్వాయ్‌ని ఆపి ఇళ్లలోకి వెళ్లి కొందరి యోగ క్షేమాలు తెలుసుకొని తిరిగి ప్రయాణం అవుతున్నారు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో కి వెళ్లి సర్వమత సమానత్వాన్ని చాటే వి«ధంగా పూజ లు, ప్రార్దనలు చేస్తున్నారు.

స్థానికుల్ల్లో మమేకమై నేనున్నాను.. అంటూ భరోస కల్పించే ప్రయత్నం చేస్తున్నా రు. పూర్తిగా భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో ఉంచుకొని ఓదార్పుయాత్ర సాగుతోంది. స్థానిక నేతల ప్రస్తావన ులేదు. పూర్తిగా జగన్ మాటలతోనే సమావేశాన్ని ముగిస్తున్నారు. ఇది స్థానిక నాయకులకు కొంత మింగుడు పడని పరిస్థితిగా మారుతోంది.

రహస్యంగానే ఓదార్పు
వైఎస్‌మృతి అనంతరం అశువులు బాసిన కుటుంబాలను జగన్ ఓదారు స్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణ, ఓదార్పు చేసే కుటుంబం ముంగిట వరకు మీడియా, ప్రజా ప్రతినిధులు అందరు వెళతారు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన తరువాత జగన్ ఏకాంతం గా మాట్లాడుతారు. అప్పుడు మాత్రం ఎవ్వరికి అనుమతి ఉండదు. మీడియా ఫొటోలకు అనుమతిలేదు. సొంత ఛా నల్ వారికే అనుమతి. మృతుల కు టుంబాలకు రూ.1లక్ష వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నారన్నది సమాచా రం. దీనిని గోప్యంగా ఉంచడంలో మర్మమేమిటో తెలియదు.

కలికి అనుచరుల అసంతృప్తి
మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి మూడు దశాబ్దా లుగా కావలి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వీరి జ్ఞాపకార్ధం ఉదయగిరి రోడ్డు కూడలిలో కలికి విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన అ నుచరులు బావించారు. చాలా రోజు లుగా విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం రాత్రి జగన్ చేత కలికి విగ్రహాన్ని ఆవిష్క రించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి జగన్ ఈ విగ్ర హాన్ని ఆవిష్కరించగా కలికి అభిమా నులు కొద్దిసేపు మాట్లాడాలని కోరా రు. వైఎస్ విగ్రహావిష్కరణ తరువాత మాట్లాడాతానన్నారు. వైఎస్ విగ్రహా న్ని ఆవిష్కరించిన జగన్ కలికి ప్రస్తా వన తేకపోవడంతో కలికి అభి మానులు,అనుచరులు నిరాశ పడ్డారు.

నేతలు దూరం దూరం
జగన్ వర్గీయులుగా ముద్రపడ్డ వారు తప్పా ఈ యాత్రకు జిల్లాలోని కాంగ్రెస్ నేతలు దూరం దూరంగానే ఉంటున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కావలి పట్టణ ంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయ గిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డిసిసి అ«ధ్యక్షడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి జగన్ వెంట నడుస్తున్నారు. నేదురమల్లి, పనబాక, ఆనం సోదరులు, ఆదాల, కాకాణి తదితర నేతలంతా దూరం దూరం గానే ఉంటున్నారు.

No comments: