నేడు నెల్లూరు

Thursday, October 28, 2010

స్టోన్‌హౌస్‌పేట, ట్రంకురోడ్డు విస్తరణకు కసరత్తు

నగర తూర్పు, పడమర ప్రాంతాలను కలిపే సర్వేపల్లి కాలువ బ్రిడ్జి ఒక వైపు శిథిలావస్థలో ఉంది. దానిని నూతనంగా నిర్మించడంతో పాటు ఆరు లైన్లుగా విస్తరించేందుకు 2.6 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. స్టోన్‌హౌస్‌పేట నుంచి టూ టౌన్ పోలీసు స్టేషన్ వరకు 50 అడుగులు మేర రోడ్డు విస్తరణకు 1.8 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నిధుల మంజూరుకు మంత్రి హమీ ఇవ్వడంతో స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణకు మోక్షం కలగనుంది. ఇందు కోసం త్వరలో వ్యాపారులతో నగర, రూరల్ శాసన సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

మైపాడు గేటు రోడ్డు కూడళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
నగరంలోని మైపాడు గేటు రోడ్డు కూడలి ఇరుకుగా ఉంది. ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువగా ఉన్నాయి. కూడలిని ,బ్రిడ్జిని విస్తరించేందుకు కోటి రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనికి ఆమోద ముద్ర లభిస్తే ఆ ప్రాంతం కూడా విశాలం కానున్నది. అలాగే మైపాడు, గేటు రోడ్డు నుంచి మైపాడు వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో రోడ్డును అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిధులు మంజూరైతే మైపాడు గేటు నుంచి నవాబుపేట కూడలి వరకు రోడ్డును విస్తరించి అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ట్రంకురోడ్డు విస్తరణకు కసరత్తు
నగరంలోని ప్రధాన రహదారి అ యిన ట్రంకురోడ్డు కొన్నిచోట్ల 100 అ డుగులు మరికొన్నిచోట్ల 40 అడుగులు మేర ఉంటుంది. దీంతో ఫత్తేఖాన్‌పేట, ఎంబీ బ్రదర్స్ ప్రాంతంలో రోడ్లు ఇరుకుగా ఉంటూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు కసరత్తు జరుగుతోంది. స్థానిక వ్యాపారులతో చర్చించి విస్తరణను చేపట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో విస్తరణ జరిగితే ట్రాఫిక్ ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.

No comments: