నేడు నెల్లూరు

Thursday, October 7, 2010

ఫలించిన వివేకా వ్యూహం

నెల్లూరు నగర కేంద్రంగా కాంగ్రెస్ నేతలు ఆనం వివేకానందరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల మధ్య సాగుతున్న పోరుకు శుభంకార్డు పడినట్లే. వివేకా వ్యూహరచన ఫలించడంతో పీసీసీ కార్యదర్శిగా ఉన్న కోటంరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించారు. దీంతో నగరంలో కాం గ్రెస్ పార్టీపై పూర్తి పెత్తనం ఆనం సోదరులకే కా నున్నది. సస్పెన్షన్‌కు నిరసనగా ఈనెల 8న కోటంరెడ్డి అనుచరులు ఇందిరాభవన్‌ను ముట్టడించనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ డీఎస్‌నే గురి పెట్టి కోటంరెడ్డి అస్త్రాలు సంధిస్తున్నారు.

ఫలించిన వివేకా వ్యూహం
2009 వరకు వివేకా, శ్రీధర్‌రెడ్డి కలిసే ఉండేవారు. ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో కోటంరెడ్డి వివేకాను విభేదించారు. సొంతంగా రాజీవ్‌భవన్‌ను నెలకొల్పి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. నగరాభివృద్ధి పనుల్లో అవినీతిపై ధ్వజమెత్తుతూ వివేకాకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. పార్టీ కార్పొరేటర్లలో చీలికతెచ్చి కొందర్ని తమ వైపు తిప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహిస్తూ వ చ్చారు. వైఎస్ఆర్ మృతి తరువాత జగన్‌కు సంఘీభావం తెలిపారు. జగన్ వర్గం నేతగా కొనసాగుతూ వచ్చారు. ఈ విషయాన్ని పలుసార్లు పీసీసీ దృష్టికి వివేకా తీసుకుపోయారు. కోటంరెడ్డి మాట్లాడే ప్రతి మాటను పీసీసీకి నివేదిస్తూ వచ్చారు. ఈ ఏడాది

ఆగస్టులో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల నరసింహారావు ద్వారా ఓ నివేదికను పీసీసీకి అందచేశారు.
మూడునెలలుగా ప్రయత్నం
మూడు నెలలుగా కోటంరెడ్డిని పార్టీ నుంచి సాగనంపాలని వివేకా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. జగన్‌యాత్ర జిల్లాలో తలపెట్టడడంతో కీలక భూమిక పోషిస్తున్న కోటంరెడ్డిని ఇక ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని పీసీసీపై ఒత్తిడి తీసుకువచ్చారు. వివేకా వ్యూహరచన ఫలించడంతో మంగళవారం కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ప్రకటన విడుదల చేశారు. కోటంరెడ్డి 25 ఏళ్ల పైగా పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులు నిర్వహించారు. చివరకు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయించి వివేకా తనదే పైచేయి అని నిరూపించుకున్నారు. కోటంరెడ్డి సస్పెన్షన్‌తో వీరిద్దరి వివాదానికి తెరపడినట్లుగా పరిశీలకులు అంటున్నారు.

No comments: