నేడు నెల్లూరు

Wednesday, October 6, 2010

షోకాజ్‌లు కాదు.. ఏకంగా తీసేయాలి : ఆనం వివేకా


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే షోకాజ్‌ నోటీసులు కాదు ఏకంగా పార్టీని తొలగించాలని పిసిసి కార్యదర్శి కోట్టం శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు డిసిసి అధ్యక్షులు గోపాల్‌రెడ్డిని ఉద్దేశించి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి విషయాన్ని ప్రస్తా వించగా ఆయన విషయంలోనూ తన అభిప్రాయం అదేనని చెప్పారు. జగన్‌ ఓదార్పు విషయంలో తమ వైఖరి ఇప్పటికే వెల్లడించామని పేర్కొన్నారు. ఈ విషయంలో స్పందించేందుకు తమ జిల్లాలో ఉద్దండులు ఉన్నారని, ఓ దార్పుపై వారినే అడగండని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటీసులు జారీచేయడం వృథా ప్రాయాసం అని పేర్కొన్నారు. ఏకంగా పార్టీ నుంచి తొలగించే చర్యలే తీసుకోవాలని సూచించారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి సేవ చేసిన వారి విషయంలోనూ ఇలాగే స్పందించాలా అని గోపాల్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించగా అయితే ఏంటి (సో వాట్‌)అని ఆనం స్పందించారు.

పార్టీకి ఎన్నడూ పనిచేయని వారి పార్టీ అధికారంలోకి రాగానే వచ్చి హవా చలాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ జిల్లాలో తొమ్మిది మంది ఎంపీలు, సిడబ్ల్యుసి సభ్యులు ఉన్న ప్రత్యేక జిల్లా అని పేర్కొన్నారు. జిల్లాలో చక్రం తిప్పే నేతగా మీడియా అభివర్ణించే ఆయన సమస్యల సందర్భంలో పార్టీకి అండగా నిలవరని, ఏ సమస్య లేనప్పుడే ఆయన చక్రం తిప్పుతాడని చెప్పారు. ఎవరు ఆయన అని ప్రశ్నించగా మీకు తెలియందా అని బదులిచ్చారు. మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్‌రెడ్డా అని ప్రశ్నించగా నా చేత చెప్పించాలని మీరెందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. తమ బండి ఎద్దులు మాత్రం తమ వద్దనే ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

No comments: