నేడు నెల్లూరు

Friday, October 8, 2010

స్పీకర్ వద్దకు ప్రసన్న వివాదం

కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వివాదం స్పీకర్ ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు చేరింది. గురువారం టీడీపీ విప్ ధూళిపాళ నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రసన్ననను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపి త్వరలో నోటీసు జారీ చేస్తానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. స్పీకర్ నుంచి తాకీదు అందిన తరువాత స్పందిస్తానని ప్రసన్న పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికలు ముగిసిన 15 రోజుల నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపె ౖ ్ట విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ పగ్గాలు సినీ నటుడు బాలకృష్ణకు అప్పగించాలని విలేఖర్ల సమావేశంలో పదే పదే డిమాండ్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ప్రసన్న చేరుతారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు వినిపించాయి.

అసెంబ్లీలోనూ టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడటంతో తిరుగుబాటు అభ్యర్థిగా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హత లేదని, టీడీపీ విప్ నరేంద్రనాథ్ స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఆ తరువాత తెలంగాణ వివా దం చోటుచేసుకోవడంతో ప్రసన్న వివా దం మరుగున పడింది. జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర జరుగనున్న నేపథ్యంలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలు, ఇతర ఆధారాలతో గురువారం మరో సారి టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్‌తో మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అయిన ప్రసన్నను ఎమ్మెల్యే పదవి నుంచి ఎందుకు తొలగించరో చెప్పాలన్నారు. ఇందుకు ఆధారాలు కూడా సమర్పించామని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. జగన్, వైఎస్‌లను పొగుడుతూ మాట్లాడటాన్ని వారు తప్పుపట్టారు. ఇది చట్టవిరుద్ధమని స్పీకర్‌గా న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ చట్టపరంగా ఎలాం టి చర్యలు తీసుకోవాలో అదే విధంగా ఉంటాయని, త్వరలో నోటీసు పంపుతానని హామీ ఇచ్చారు. ఇదే విషయా న్ని ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకుపోగా స్పీకర్ నుంచి నోటీసు అందిన తరువాతే మాట్లాడుతానన్నారు.

No comments: