నెల్లూరు నగరంలో లీలామహల్, కృష్ణ, అర్చన, నర్తకి థియేటర్లలో రోబో సిని మాను ప్రదర్శించారు. ప్రపంచంలోని అన్ని థియేటర్లతో పాటు ఇక్కడ కూడా ఒకటో తేదీన సినిమాను ప్రదర్శించడం మొదలెట్టారు. రూ. పది టిక్కెట్టు వంద, రూ.30 టిక్కెట్టు రూ.350, రూ.60 టిక్కెట్టు రూ.వెయ్యికి విక్రయించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాలుగు థియేటర్ల వద్దఇదే తంతు కొనసాగింది.
సినీ మాఫియా
నెల్లూరులోని ఓ సినీ మాఫియా ఉంది. పెద్ద నటుల సినిమాలను కొన్ని థియేటర్లు మాత్రమే తీసుకుంటాయి. ఇందుకు ఎన్నికోట్లయినా వెచ్చిస్తారు. హక్కులు తీసుకుంటారు. ఇక బ్లాక్ టిక్కెట్ల పర్వం మొదలవుతుంది. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే. ఆయా థియేటర్లలో బ్లాక్ పర్వాన్ని కొనసాగిస్తారు. లేకుంటే సదరు సినిమాను ఒక్క థియేటర్‌కే పరిమితం చేస్తారు. అప్పుడు కూడా బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని కొనసాగిస్తారు. వీరి దెబ్బకు మిగిలిన థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తట్టుకునే పరిస్థితిలో లేరు.
రోబోకు టిక్కెట్లు లేవ్.!
రోబో సినిమాకు వారం రోజులు ముందు నుంచి బుకింగ్‌లు ప్రారంభమ య్యాయి. నెల్లూరులో మాత్రం ఒక్క రోజు ముందు మాత్రమే కొన్ని టిక్కెట్లను ఇచ్చి కౌంటర్లు క్లోజ్ చేస్తారు. సినిమా చూద్దామని ఆనందంగా థియేటర్ల వద్దకు వెళ్ళి క్యూలో బారులు తీరినా ప్రయోజనం శూన్యం. టిక్కెట్లన్నింటిని థియేటర్ల యాజమాన్యం వారి సిబ్బందితో బయటకు పంపిస్తారు. రూ. పది రూపాయల టిక్కెట్టు 70 రూపాయలకు వారికి ఇస్తారు. ఆపై ఎంతొచ్చినా వారిదే.
పత్తాలేని పోలీసులు
రోబో సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా థియేటర్ల వద్ద పోలీసుల ఊసే లేదు. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి తెరతీసి అభిమానులు ఎగబడుతున్న తరుణంలోనూ థియేటర్ల సమీపాలక కూడా రాలేదు. ఒకటి, రెండు థియేటర్లు వద్ద ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని వెంటనే వదిలిపెట్టారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్దకు రాకుండా ఉండేందుకు సినిమాను బట్టి పోలీసులకూ ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడంలో సినీ మాఫియాకు సాటెవ్వరూ లేదనేది నిర్విదాంశం.
ఆశకు పోతే నిరాశ
రోబో సినిమా చూద్దామని అభిమానులకు ఎందరికో నిరాశ ఎదురైంది. ఇప్పటికే వారం రోజుల పాటు టిక్కెట్లు లేవనే ప్రచారం మొదలు పెట్టారు. కానీ అన్ని టిక్కెట్లు అమ్మిన దాఖలాలు లేవు. సగానికి సగం ప్రేక్షకుల చేతికి చేరలేదు.
ఎక్కువ షోలు వేస్తే థియేటర్ సీజ్ చేస్తాం: సౌరబ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ రోబో సినిమాను ప్రభుత్వం నిర్ణయించిన షోల కంటే ఎక్కువగా ప్రదర్శిస్తే థియేటర్లను సీజ్ చేస్తాం. నెల్లూరు, కావలి, గూడూరు డివిజన్‌లలో శనివారం నుంచి సినిమా హాళ్ళ దగ్గర డిప్యూటీ తహసిల్దార్లను బ్లాక్ టి క్కెట్లపై నిఘా ఉంచుతాం. బ్లాక్ టిక్కెట్ల సమాచారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియచేయాలి. నెల్లూరు నగరంలో వేస్తున్న సినిమా హాళ్ళు వివరాలు, ప్రదర్శిస్తున్న షోల వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటాం. థియేటర్లలో పారిశుథ్యం నిర్వహణపై తనిఖీలు నిర్వహిస్తాం.
Saturday, October 2, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment