నేడు నెల్లూరు

Wednesday, March 31, 2010

నెల్లూరు లో B.S.N.L 3G సేవలు ప్రారంభం

పెరిగిన ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా టెలిఫోన్ రంగంలో బిఎస్‌ఎన్‌ఎల్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక స్వర్ణవేదిక కళ్యాణమండపంలో బిఎస్‌ఎన్‌ఎల్ త్రీజి సేవలను మంగళవారం నెల్లూరు ఎంపి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. దేశంలో 112 కోట్ల జనాభా ఉన్నారన్నారు. వారిలో 56కోట్ల మంది టెలిఫోన్‌ను వినియోగించుకుంటున్నారని, త్వరలోప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అందుబాటులోకి రాబోతుందన్నారు. శాంపిట్రోడా కమిటీ సిఫార్సులు టెలిఫోన్ రంగానికి ఊతమిస్తాయన్నారు. గతంలోల్యాండ్‌లైన్ దొరికాలంటే చాలా కష్టంగా ఉండేదని, ఫోన్ మాట్లాడలాంటే పోస్ట్ఫాసు వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి ఉండేదన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందుతున్నారు. గతంలో దేశంలో 70శాతం వరకు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారయ్యాయని, ప్రస్తుతం అవి 40శాతం తగ్గినట్లు తెలిపారు. త్వరలో 100శాతం వరకు చేరుకుంటుందన్నారు. రాబోయే రోజులలో అన్ని పరికరాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతాయన్నారు. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడి ముందుకు పోతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ పిఎసి నెంబర్లు, నెల్లూరు బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ఎంపిని సన్మానించారు. నెల్లూరు టెలికం జనరల్ మేనేజర్ గోపి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలకొండారెడ్డి, తిరుపతి డిజిఎం విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల అధినేత ఆచార్య ఆదిత్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments: