నేడు నెల్లూరు

Monday, March 29, 2010

రేపు నెల్లూరు లో 3జి సేవలు ప్రారంభం

టెలిఫోన్‌ రంగంలో 3జి సేవలను ఈ నెల 30న (మంగళవారం) నెల్లూరు నగరంలో ప్రారంభించనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ గోపీ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3జి సేవలను ముందుగా నెల్లూరు నగరానికి మాత్రమే పరిచయం చేస్తున్నామని చెప్పారు. 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు స్థానిక స్వర్ణ వేదిక కల్యాణ మండపంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌లకన్నా ముందుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ 3జి సేవలను ప్రారంభిస్తుందని చెప్పేందుకు తమకు గర్వంగా ఉందన్నారు. 3జి సేవలలో భాగంగా వీడియోకాల్‌ సౌకర్యం, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌, మ్యూజిక్‌, ఆల్బమ్స్‌ క్షణాల్లో డౌన్‌లోడింగ్‌ చేసుకునే సౌకర్యాలు వినియోగదారులకు అందుతాయన్నారు. అంతేకాకుండా మొబైల్‌ ఫోన్‌లలో 50కి పైగా టివి చానల్స్‌ను నేరుగా చూసుకోవచ్చన్నారు.

జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లను విక్రయించే ఫ్రాంఛైస్‌లు ప్రస్తుతం నెల్లూరు, గూడూరు, కావలి పట్టణాల్లో మాత్రమే ఉండగా ఇకపై తొమ్మిది చోట్ల ఈ సౌకర్యాలను విస్తరిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, సోమవారం తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ల్యాండ్‌ లైన్‌ లేకుండానే ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తున్నామని, అయితే ఈ అవకాశం కేవలం పది రోజుల వరకు మాత్రమే ఉంటుందన్నారు. పది రోజుల తర్వాత ఇంటర్‌నెట్‌ కావాల్సినవారు తప్పనిసరిగా ల్యాండ్‌ లైన్‌ను తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో డిజిఎం పెంచలరెడ్డి, మార్కెటింగ్‌ డిఇ మార్కొండారెడ్డిలు పాల్గొన్నారు.

No comments: