నేడు నెల్లూరు

Wednesday, January 12, 2011

సినిమా రంగానికి చిరంజీవి మూడో నేత్రం : వెంకయ్యనాయుడు

సినిమా రంగంలో అందరూ ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్‌లను రెండు కళ్లుగా అభివర్ణిస్తుంటారని అయితే చిరంజీవి మూడవ నేత్రం అని బిజెపి జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. వెంకటాచలం సరస్వతి నగర్ అక్షర నిలయంలో వివేకానందస్వామి విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. మూడవ కన్నుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం అందరికీ తెలుసునని, అలాగే చిరంజీవి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని వెంకయ్యనాయుడు అన్నారు.
జైలు జీవితం నా జీవితానే్న మార్చేసింది : వెంకయ్యనాయుడు
అప్పట్లో ఎమర్జన్సీ, ఇందిర ప్రభుత్వం హయాంలో జైలుకెళ్లటం తన జీవితానే్న మార్చేసిందని బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తన మిత్రుడు, హిందీ భాష అభివృద్ధి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో కలిసి ఒకసారి జైలుజీవితాన్ని గడిపామని, ఆ జైలులోనే అనేక భాషలు నేర్చుకోవటంతోపాటు క్రమశిక్షణ, ఎలా జీవించాలి, ఏం సాధించాలనే అంశాలను నేర్చుకున్నట్టు వెంకయ్యనాయుడు తన జైలు జీవితాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

No comments: