నేడు నెల్లూరు

Wednesday, January 12, 2011

నిత్య జీవితంలో జరిగే సంఘటనలే సినిమా ; నటుడు రాజేంద్రప్రసాద్

సమాజంలో ప్రతిఒక్కరి నిత్య జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఆ నలుగురు, లేడీస్ టైలర్ సినిమాలు రూపుదిద్దుకున్నాయన్నారు. తాను నెల్లూరు జిల్లా గూడూరులో చదువుకున్నానని, స్వర్ణ్భారత్ ట్రస్ట్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ మాట్లాడుతూ తాము మాట్లాడే భాషకు లిపి, అర్థం ఉండవని, హాస్యం ఉంటుందని, అయితే వెంకయ్యనాయుడు అనర్గళంగా ఎన్నో భాషలు మాట్లాడగల సమర్థుడని అన్నారు. సినిమా నటులు, ఇతర అనేక మంది జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్సీ ఇ దామోదరం మాట్లాడుతూ హేతుబద్ధంగా, శాస్తబ్రద్ధంగా సంక్రాంతి పండుగను జరపటం గొప్ప విషయమన్నారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ మాట్లాడుతూ నేడు జాతీయ నేతలను మర్చిపోతున్నామని, అలా కాకుండా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం స్వర్ణ్భారత్ ట్రస్ట్‌ను అభినందించాలన్నారు. ఒంగోలు ఎంపి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వర్ణ్భారత్ ట్రస్ట్ సంక్రాంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండి శైలజాకిరణ్ మాట్లాడుతూ స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. హిందీ భాషాభివృద్ధి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఐదుగురు మహానీయులు శ్రీ కృష్ణుడు, క్రీస్తు, మహ్మద్ ప్రవక్త, బుద్ధుడు, మహాత్మాగాంధీలని, వీరిలో ముగ్గురు మన వాళ్లేనని, ఈ విషయం మన పిల్లలకు వివరించాలని అన్నారు.

No comments: