
దేశచరిత్రలో గురువారం కీలకఘట్టం ఆవిష్కరించనున్నదని, ఇస్రో చరిత్రలో జీఎస్ఎల్‌వీ ప్రయోగ విజయం ఒక మైలురాయి కాబోతోం దని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన చెన్నై నుంచి షార్‌కు వెళుతూ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించా రు. అక్కడే స్థానిక విలేఖర్లతో మా ట్లాడారు. జీఎస్ఎల్‌వీ ప్రయోగంలో క్రయోజనిక్ దశను మనశాస్త్రవేత్తలు రూపొందించారని ఈ ప్రయోగ విజ యం భవిష్యత్తులో ఎన్నో ప్రయో గాలకు మార్గాన్ని సుగమం చేస్తుందని తెలిపారు.
అమ్మణ్ణి ఆశీస్సుల కోసం వచ్చానని, రాకెట్ ప్రయోగం సంపూర్ణ విజ యాన్ని సాధిస్తుందని «ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. ఆయన వెంట షార్ శాస్త్రవేత్త రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment